’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -209
78 – -భావ చిత్ర కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -2
వాల్ట్ విట్మన్ కవిని ఒకప్పుడు ద్వేషించినా ,ఇప్పుడు ఆయనతో సయోధ్య కుదుర్చుకొనే ప్రయత్నం చేశాడు ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’కవిత్వం రాసిన కుర్రాడు బాగా ఎదిగిపోయాడని మెచ్చి ,’’కొత్త కట్టె ను విరగ్గొట్టిన నువ్వు ఇప్పుడు ఆకర్రతో నగిషీలు చెప్పే సమయం వచ్చింది ‘’అని ప్రోత్సహించాడు .కొన్నేళ్ళకే ఎజ్రా పౌండ్ తనకు తగిన ప్రదేశాన్ని ఎంచుకొని ఇంగ్లాండ్ వెళ్లి మొదట్లో అక్కడి వారిని ఆకర్షించలేక పోయినా ,క్రమంగా వారి కి దగ్గరయ్యాడు .19 వ ఏట కొంచెం నెర్వస్ గా ,ఉద్రిక్తంగా ,కుదుపులతో రెడ్డిష్ బ్రౌన్ అమెరికన్ ‘’లాగా ఉండేవాడని వింధాం లెవిస్ రాశాడు .గ్లాసు నీటిలో నూనె చుక్క ‘’లాగా ఉండేవాడు .ఆయన ఎవరితోనూ కలవని రకం .ఆకట్టుకోవటానికి ప్రయత్నించే వాడు .దీనిలో మాత్రం విజయం సాధించాడు .ఆయన అహంకారం ,పాండిత్యాలు చరిత్రనే సృష్టించాయి .కళల లో నూతన పరిశోధనాలను వివరించి చెబుతూ విక్టోరియన్ యుగ లక్షణాలను ప్రేల్చి వేస్తూ ఉపన్యాసాలిస్తూ ,తానుచికాగో లో పెట్ట్టిన ’’పొయిట్రి ‘’మేగజైన్ కు ‘’యూరోపియన్ విలేకరి అయ్యాడు .అహంకార పూరిత ఎర్ర గడ్డం తో కంద గడ్డ లాంటి మొహం తో దూరం గాతిరుగుబాటు మాండరిన్ గా ఉండే వాడు .శిష్యుల్నిఆకర్షిస్తూ నిరాకరిస్తూఘాటుగా చివాట్లు పెడుతూ ఉన్నా వినాశకరంగా ప్రవర్తించే వాడు మాత్రం కాదు . పౌండ్ విమర్శలకు లాభ పాడినవాడు టి ఎస్ ఇలియట్ కవి .ఆయన సలహాపై తన ‘’వేస్ట్ లాండ్ ‘’కావ్యాన్ని సగానికి సగం తగ్గించి ఆకర్షణీయం చేశాడు .పౌండ్ రాసిన ‘’సేలక్టేడ్ పోయెమ్స్ ‘’కు ఇలియట్ ముందుమాటరాస్తూ ‘’అతని ప్రభావం చాలా గొప్పది .ఆయన కవిత్వాన్ని ఉపన్యాసం చేశాడు .తర్వాత కవిత్వాన్ని పాట ను చేశాడు .
1914లోసమకాలీన రొమాంటిక్ కవిత్వాన్ని నిరసించే కవి బృందాన్ని పోగేసి ,వారికొక మేని ఫెస్టో తయారు చేసి ఆ గ్రూప్ కు’’ఇమేజిస్ట్ ‘’లని ఒక పేరు కూడాపెట్టాడు . వీళ్ళు భావ చిత్రాలకు ప్రాధాన్యమిచ్చి ,రోమా౦ టిజం బంధనాలలోంచి కవిత్వపు చెర విడిపించి నందుకే ఈ పేరు పెట్టాడు .ఇమేజిస్ట్ లు సాధారణ భాషను ,సరైన వర్ణనాత్మక పదాలతో రాస్తూ ,ఛందస్సు ను వదిలి కొత్త లయ తో ,కొత్త మూడ్స్ తో అనిబద్ధ కవిత్వం రాస్తూ ,కఠిన స్పష్టమైన కళంక రహిత,అనిర్దిష్ట కవిత్వ సృష్టిచేశారు .ఈసిద్దా౦తాలవలననే ఉత్తమ కవిత్వం మాత్రమె కాక సాహిత్య సృష్టి జరుగుతుందని నమ్మారు . ఈ సిద్ధాంతాలు జనం లో కల్లోలం నిరసన అవహేళన సృష్టించాయి .ముఖ్యంగా ఆమిలోవెల్ అనే కవయిత్రి ఇమేజిస్ట్ గా మారి పౌండ్ బాటలో నడిచి నూతన కవిత్వాన్ని రాసి ప్రసిద్ధి పొందింది .అయితే పౌండ్ తమ గ్రూపును ఆమె డామినేట్ చేసి రాస్తోందని,ఆమె కవిత్వం తాము ఆశించిన స్థాయిలో లేదని ప్రాణం లేని జీవి చిత్రంలా ఆమె కవిత్వం ఉందని మండిపడ్డాడు .లోవెల్ భార్య అయిన ఈమె రాసింది ఇమేజిస్ట్ కవిత్వంకాదని దాన్ని ‘’అమీజిస్ట్ ‘’కవిత్వం అనాలని అన్నాడు .తాను ఏర్పరచిన గ్రూప్ నుంచి విడిపోయి ,ఆ సిద్ధాంతాలకు ఇక తానేమీ బాధ్యుడినికానని ప్రకటించాడు .తర్వాత ‘’దిలిటిల్ రివ్యు ‘’పత్రికకు ఎడిటర్ అయి మొదటి ప్రపంచ యుద్ధం అయ్యాక లండన్ వదిలి పారిస్ చేరాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-16 –ఉయ్యూరు

