ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -215
80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -2
28 ఏళ్ళ వయసులో నీల్ చేతినిండా స్క్రిప్ట్ లే .ప్రావిన్స్ టౌన్ కు వెళ్లి తన మొదటినాటక ప్రదర్శన’’బౌండ్ ఈస్ట్ ఫర్ కార్డిఫ్ ‘’ చూసుకొన్నాడు .వేర్ఫ్ దియేటర్ దీన్ని ప్రదర్శించింది బ్రహ్మాండమైన విజయం లభించింది .ఈ దియేటర్ తర్వాత న్యూయార్క్ గ్రీన్ విచ్ విలేజ్ కి మారి ప్రావిన్స్ టౌన్ ప్లేయర్స్ గా ప్రసిద్ధ మైంది .1917 నుండి 20 దాకా మూడేళ్ళు నీల్ రాసిన పది ఏకాంకికలను ప్రదర్శించింది .అవే ‘’ఐల్ ‘’,ది మూన్ ఆఫ్ ది కర్రబీస్ ‘’,’’ది లాంగ్ వాయెజ్ హోం ‘’.ఈ మూడిటిని ‘’ది స్మార్ట్ సెట్ ‘’గా ముద్రించాడు .తరువాత పూర్తీ నిడివిగల నాటకం ‘’బియాండ్ ది హోరైజన్స్ ‘’19 20 లో ప్రదర్శించారు .అధిక ప్రేక్షకాదరణతో ఇది వంద కు పైగా ప్రదర్శనలు నిర్వహించారు .దీనికి మొదటిసారిగా పులిట్జర్ బహుమతి పొందాడు .దీనికి ముందటి నాటకాలు మోటుగా ఉన్నా అవి ‘’టైలర్ మేడ్ వినోదాలు అనిపించుకోలేదు .సామర్ధ్యంగా రాసినవే .అవి ఆకర్షణీయంగా లేకపోయినా ,సుఖాన్ని కలిగించక పోయినా చీకటిలో ,హింసాత్మక ,వికార అందాన్ని ప్రదర్శించాయి .ఒక్కో సారి హీనంగా మరో సారి భయంకరంగా ఉన్నా అప్రధానంగా మాత్రం లేవు .ప్రపంచ బాధ ,అందులోని చెడు ను చూసి కుంగి పోలేదు .అతని హీరోలు ‘’నిస్సహాయులు ,విషాద వదనులు .’’అన్నా క్రిస్టీ ‘’కి రెండో సారి1922 లో పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .’’స్ట్రెంజ్ఇంటర్ లూడ్ ‘’నాటకం బహుళ ప్రజాదరణ పొంది దేశవ్యాప్తంగా నీల్ కీర్తి వ్యాపించి మూడో పులిట్జర్ పొందింది .రెండేళ్ళ తర్వాత అమెరికన్ రచయిత సింక్లైర్ లెవిస్ నోబుల్ బహుమతిని స్వీకరిస్తూ హుందాగా’’ ఈ ప్రైజ్ యూజేన్ ఓ నీల్ కు ఇచ్చిఉంటే చాలా గొప్పగా ఉండేది ..సమాజం లోని వికృతిని భయంకరంగా నేల బద్దలయేట్లు అగ్ని వర్షం కురిపించినట్లు ,తన నాటకాలను దాదాపుగా పది ఏళ్ళ నుంచి రాస్తూ కొత్త లోకాలను చూపిస్తున్నాడు’’అని మెచ్చుకొన్నాడు .విధ్వంసకర అగ్ని అనిపించాడు నీల్ .
నాటక రంగ సంప్రదాయాలనన్నిటిని తుంగలో తొక్కాడు .’’ది ఎ౦పరర్ జోన్స్ ‘’సుదీర్ఘ స్పీచ్ లకు స్వస్తి పలికింది .మోనోలాగ్ లతో రక్తి కట్టించాడు .పాతకాలపు ఫాంటసి నుంచి ఆధునిక వాస్తవికత కు నాటకాన్ని మార్చాడు .’’ది హేయిరీ ఏప్ ‘’లో ఫాంటసిని భావ వ్యక్తీకరణ వాద సిమ్బాలిజంగా మార్చాడు .’’ది గ్రేట్ గాడ్ బ్రౌన్ ‘’లో మాస్క్ లను ప్రవేశ పెట్టాడు .ఒరాస్ పాటల శబ్దాలతో ‘’లాజరస్ లాఫ్ద్ ‘’ను తీర్చి దిద్దాడు .పూర్వ గ్రీకు ట్రాజెడిలను ఆధునిక విధానాలతో శోభ కూర్చాడు .ఆయన నాటకాల లాగానే ఆయన జీవితమూ మారింది .అనేక మూడ్స్ లో అనేక ప్రదేశాలలో ఉన్నాడు .ఎక్కడా ఎక్కువ కాలం ఉండలేక పోయాడు.న్యు ఇంగ్లాండ్ ,బెర్మూడా ,ఫ్రాన్స్ ,సీ ఐలాండ్స్ ,టావో హౌస్ ,సాన్ ఫ్రాన్సిస్కో ,న్యూయార్క్, కేప్ కాడ్ లన్నీ తిరిగాడు మొదటి పెళ్లి మూడేళ్లకే పెటాకులైతే 30 వ ఏట యాగ్నెస్ బోల్టన్ ను పెళ్ళాడి ఒక కొడుకు షేన్ ను కూతురు ఊనా కు తండ్రి అయ్యాడు .1929 లో విడాకు లిచ్చి 42 వ ఏట అందమైన నటి కార్లోటా మాంటరి ని పెళ్లి చేసుకొని తోమ్మిదినాటకాల శ్రు౦ఖలానికి నాంది పలికాడు .1775 నుంచి 1932 వరకు అమెరికా కుటుంబం పొందిన ఉద్దాన పతనాలను వీటిలో గొప్పగా చూపించాడు .ఆరోగ్యం పూర్తిగా లభించి జుట్టుకొంచెం తెల్లబడి చలన పూర్వక పెదవులతో ,తీవ్ర ఆలోచన ఉన్న కనులతో ,ఎముకలు పొడుచుకు వచ్చే దవడలతో అనేక ప్రశ్నల సమాహారంగా కనిపించేవాడు .
45 లో అభిమానులను ఆశ్చర్య పోయేట్లు ‘’ఆ వైల్డర్ నెస్ ‘’అనే సెంటిమెంటల్ కామెడి తో చేశాడు .భౌతిక సంపద మొహాన్ని తిరస్కరించాడు .’’ఆల్ గాడ్స్ చిల్లన్ గాట్ వింగ్స్ ‘’నాటకం జాతి అల్లర్లు సృస్తిస్తు౦దేమోనని భయ పడ్డారు .’’ది ఫైర్ ఉండరర్ ది ఎల్మ్స్ ‘’కి బుజాలు తడుముకొన్న అవినీతి పరులు న్యు యార్క్ దియేటర్ లో ఆడనీకుండా అడ్డు పడి మూసేయించారు .బోస్టన్ లో కూడా జరగ నివ్వ లేదు .లాస్ ఏంజిల్స్ లో కొన్ని ప్రదర్శనలతర్వాత అందులో పాల్గొన్న నటుల౦దర్నీ అరెస్ట్ చేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-16 –ఉయ్యూరు
