ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -228
84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్
టి ఎస్ .ఇలియట్ లాగా విలియం ఫాక్నర్ ‘’అతి ‘’వలన పరాజయం పొందిన ,దాని అపరాధానికి అంతమైన ,దాని గర్వానికి,మాయ నటనకు నాశనమైన,శిధిలమవుతున్న ప్రపంచం లో ఎదురు చూపులు చూస్తూ ,చావును కోరుకొంటూ బతికిన వాడు . ఇలియట్ లాగానే రాసిన శక్తివంతమైన కొన్ని ,ఆకాలపు పెసిమిస్టిక్ సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందాడు .ఇలియట్ లాగా కాకుండా తను పుట్టిన తనకు అన్నం పెట్టిన మట్టినే నమ్మి తాను ఎంచుకొన్న తన ‘’ఊసర క్షేత్రం ‘ సౌత్ లాండ్ ను ’ పండించే ప్రయత్నం చేస్తూ ,జన్మ భూమిని ,సంస్కృతిని ,పౌరసత్వాన్ని ఎప్పుడూ నిందించని వాడు ఫాక్నర్ .
25-9-1897 న నలుగురు సోదరులలో పెద్దవాడుగా అమెరికా లో న్యు ఆల్బనిలోని మిసిసిపి లో పుట్టాడు .బాల్యం లోనే తండ్రి’’ గౌరవ మర్యాదల ‘’ కోసం హత్య చేయ బడ్డాడు .తాతగారు చేయించిన ఈ ఘాతుకం లో ఎవరూ చావ లేదు.తల్లి కుటుంబాన్ని యూని వర్సిటి టౌన్ ఆక్స్ ఫర్డ్ కు మార్చింది .కుటుంబం లో ఈ హత్యలు మామూలే .ఫాక్నర్ తాత విలియం కూబర్ట్ ఫాక్నర్ చాలా ఊహా ప్రపంచ జీవితం గడిపాడు .14 వ ఏటనే ఇంట్లోంచి పారిపోయి ,మెక్సికన్ యుద్ధం లో చేరి ,కెప్టెన్ గా తిరిగొచ్చి ,లా చదివి ,చిన్ననాటి స్వీట్ హార్ట్ ను పెళ్ళాడి ,సివిల్ యుద్ధకాలం లో ఒక వాలంటీర్ దళాన్ని ఏర్పరచి ,యుద్ధం తర్వాత గొప్ప లీగల్ ప్రాక్టిస్ చేసి 40 లో ప్రసిద్ధుడయ్యాడు .50 నాటికి లెజేండరివ్యక్తీ అయి ,ఒక బ్యాంకర్ తో భాగస్వామి అయి ,రైల్ రోడ్ నిర్మించి ,రచయితగా పేరు పొంది ‘’వైట్ రోజ్ ఆఫ్ మెంఫిస్ ‘’’’లిటిల్ బ్రిక్ చర్చ్’’,లను ‘’అంకుల్ టామ్స్ కేబిన్ ‘’కు దీటుగా రాసి స్టేట్ కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు .ఈ బహువిధ జీవన వ్యాపారం తన భాగస్వామితో జరిగిన పోట్లాటలో ద్వేషంగా మారి కాల్చిఆయన్ను చంపి పారేసేదాకా వచ్చింది .అందరూ తాతను కల్నల్ అని పిలిచేవారు ఆయనే ఫాక్నర్ కు ఆదర్శం .తాను రాసిన నవలలో కధల్లో ఆ పాత్రను అద్భుతంగా పండించాడుకూడా .
తాతకాలం నుండి కుటుంబాని గౌరవ ప్రఖ్యాతులు పుష్కలంగా ఉండేవి .ఫాక్నర్ తండ్రి స్వంత ఫామిలి రైల్ రోడ్ కు కండక్టర్ . ఫాక్నర్ గతకాలపు స్మృతులలో తేలుతూ వర్తమానాన్ని పట్టించుకొనే వాడు కాదు .స్కూల్ లో చదవటం ఇష్టం ఉండేదికాదు .హైస్కూల్ చదువు కూడా పూర్తీ చేయలేదు .చదువులో దిశా నిర్దేశం లేక ,తప్పుల్ని సరిదిద్దేవారు లేక చాలా అతిశయం తో కీట్స్ కవి స్వచ్చ రోమాన్టిజం నుంచి ఫ్లాబర్ట్ రియలిజం దాకా దేకాడు.యవ్వనం లో ఉన్నప్పుడే కవిత్వం రాశాడు .మొ .ప్ర .యుద్ధం ప్రారంభమవగానే విమాన దళం లో చేరాడు .అమెరికా వాయుసేన విమానాలు నడపటానికి తిరస్కరించాడు .’’యాంకీల ‘’బాసిజాన్ని నిరసించే భేషజం ఉన్నవాడు .21 వ ఏట బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ లో చేరి ,ఫ్రాన్స్ యుద్ధం లో గాయపడి ,యుద్ధం పూర్తీ అయినా ఫ్లైట్ ట్రెయింగ్ లోనే ఉండి ,తాను గొప్పలు చెప్పుకొనే గాయం యుద్ధం లో కాక ఆర్మిస్టిక్ డే ఉత్సవాలలో తగిలిన గాయమే అది అని తెలిస్తే ఎవరైనా నవ్వి పోతారు .’’నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు ‘’రకం .
ఆక్స్ ఫర్డ్ లో చేరి చిన్నఇంటికి పెయింటింగ్ ,కప్పు బాగు చేత ,కార్పెంటరి ఉద్యోగాలు చేస్తూ బతికాడు .అప్పుడే రైతులు ,కౌలు దార్లు నీగ్రోలు చెప్పిన అనేక కధలను విన్నాడు వాటిని సేకరించాడు .అనేక పుకార్లు నమ్మాడు .మళ్ళీ ఒకసారి బడి చదువు ప్రయత్నం చేశాడు ఆక్స్ ఫర్డ్ లో మిసిసిపి యూని వర్సిటి లో చేరి లెక్కలు ఇంగ్లీష్ లలో తప్పి ,రెండో ఏడాది చదవకుండానే బయటికొచ్చాడు .యూని వర్సిటి లో ఉన్న మిసిసిపి రచయిత స్టార్క్ యంగ్ ఫాక్నర్ ఆశించేది న్యు యార్క్ లో దొరుకుతుంది అని సలహా ఇవ్వగా ఉత్తరానికి వెళ్ళాడు .అక్కడ ఏమీదోరకలేదు .యాంగ్ తో కలిసి ఉండి గ్రీక్ హోటల్ లో బొచ్చెలు కడిగి ఏవో కొన్ని రాళ్ళు సంపాదిస్తూ ,డిపార్ట్మెంట్ స్టోర్స్ లో పుస్తకాలు అమ్ముతూ గడిపాడు .ఆరు నెలల పస్తుల బతుకు తర్వాత తన స్వగ్రామం ఆక్స్ ఫర్డ్ లో పోస్ట్ మాస్టర్ గా పని చేద్దామని తిరిగొచ్చాడు .ఏ పని సమయానికి చేసేవాడుకాడు .ఉత్తరాలు సార్ట్ చేయాలంటే బద్ధకం .అకౌంట్ పుస్తకాలు జాగ్రత్తగా నింపటం ,,రికార్డ్ లను భద్ర పరచటం లో అలసత్వం చూపుతూ తన ఇష్టం వచ్చినప్పుడు పోస్టాఫీస్ ను తెరుస్తూ మూస్తూ పబ్లిక్ సంగతి పట్టించుకోకుండా చెత్త పోస్ట్ మాస్టర్ అనిపించుకొన్నాడు .కస్టమర్లు పైకి ఫిర్యాదు చేయగా రాజీనామా ఇచ్చేశాడు ‘దీనిపై రాస్తూ ‘’I am glad I will no longer have to be at the beck and call of any one who happens to have two cents ‘’అన్నాడు .
రెండేళ్ళు వ్యవసాయం ,చేపలుపట్టటం , వేట చేసి 27 వ ఏట విసుగెత్తి యూరప్ వెళ్ళాలనుకొని న్యు ఆర్లియన్స్ చేరాడు .తనకిష్టమైన చిన్నకదా రచయితా షేర్ వుడ్ యా౦డర్సన్ ను కలిసి ,మొదటిసారిగా రచయితలతో కలిసే అవకాశం పొందాడు .’’పార్శియన్ బోహేమియన్స్ ఆఫ్ ది లెఫ్ట్ బ్యాంక్ ‘’ కు బదులుగా ‘’న్యు ఆర్లియాన్స్ ఫ్రెంచ్ క్వార్టర్ ‘’ఏర్పాటు చేశారు .వీళ్ళ ‘’ది డబుల్ డీలర్ ‘’పత్రికకు ,సిటీలో పేరున్న మరో పత్రిక కు ‘’మస్క్విటోస్’’అనే సెటైర్ ను ‘’సోల్జర్స్ పే’’అనే అనే ఉడుకు రక్తపు రిపోర్ట్ రాశాడు ,హీరో హీరోయిన్ లు లేకుండా రాశాడు .పెద్దగా క్లిక్ కాలేదు కొన్ని చిన్న కధలు రాసి అమ్మాడు .రచనతో పొట్ట గడుపులేను అనుకొన్నాడు .’’సార్టారిస్’’,’’ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ ‘’లలో తన సొంత సాహిత్య సీమను సృష్టించుకొన్నాడు.ఒక ఊహా దేశం ‘’యోక్న పటా వఫా’’ సృష్టించు కొన్నాడు ..ఇదే అసలైన అమెరికన్ ఆదిమానవుల యోకనా రివర్ పేరు .ఒకప్పుడీ ప్రాంతం బంగారు పంట పండిన ప్రదేశం ,ఇప్పుడు భవంతులతో పాట సంస్కృతీ వినాశనం తో వెల వెల పోతోందని భావించాడు .ఎస్టేట్లు ,నాశనమై తెల్లబంగారం అనబడే పత్తి క్షేత్రాలు కనుమరుగై ,రైతుల నడుములు విరిగి ,అవినీతి నిలయమైన పట్టణాలతో ,చిత్తడినేలలు ,అడవులతో అమెరికన్ యూనియన్ లో అత్యంత పేదరిక ప్రదేశమైనందుకు బాధ పడ్డాడు ఫాక్నర్ .అచ్చంగా ‘’వేయి పడగలు’’ నవల లో విశ్వనాధ పడిన ఆవేదనే పడ్డాడు ఫాక్నర్ .
ఈ సౌండ్ అండ్ ఫ్యూరీనవల ఫాక్నర్ రచనలలో ఉత్కృష్ట మైనదిగా ,చెదిరిన సంస్కృతీ విలసిననానికి దర్పణంగా బావిస్తారు అతని రచనా పాటవానికి అబ్బుర పడతారు ‘’లైఫ్ బీయింగ్ యే టేల్.టోల్డ్ బై యాన్ ఇడియట్ సిగ్ని ఫైయింగ్ నధింగ్ ‘’అన్న షేక్స్ పియర్ సూక్తికి ఇది సజీవ నిదర్శనం .ఫాక్నర్ శీర్షికతో నే కాకవిధానం తో కూడా చదువర్లు దారి తప్పారు .సామాన్య వివరణ కు భిన్నంగా దీన్ని రాయటం అతని ప్రత్యేకత.’’Faulkner disrupted the usual sequence of events ,he juggled the sections to show the violent disintegration of a family sharpened characterization by the use of interior monologs in the Joycean ‘’stream of consciousness ‘’and made time seem as way ward as the mind of the idiot Benjy Compson the symbol of ultimate ruin .’చాలా మంది ఈ విధానం అస్పష్టం అని వెనక నుంచి చదువుకోవాలని మళ్ళీ మళ్ళీచదివితే కాని బుర్రకు ఎక్కదు అన్నారు .దీనికి భిన్నంగా పెద్ద పెద్ద సిటీల జనం అతని శైలీపరిణతికి నిశ్చేస్టు లయ్యారు . రాత లోని దూకుడు ,దాని ప్రభావం అనిర్వచనీయం .అంతకు ముందు కాని ఆ తర్వాత కాని ఈ పుస్తకం ప్రజల మనసులలో దూరినంత గా, యే పుస్తకం చేరలేదు .’’It presented a marvelous and unprecedented amalgam of innocence and depravity of sick delusions maturity ‘s yearning for the security of early family affection ,and child hood ‘s memories lost in hopeless longings or as in the case of Benjy twisted into madness ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-16 –ఉయ్యూరు

