ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16
33-అమెరికన్ సంస్కృత విద్వాంసుడు –ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి
6-4-1814 న జన్మించి 5-2-1901 న మరణించిన ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి అమెరికా సంస్కృత విద్వాంసుడు .1832 లో ఏల్ యూని వర్సిటి నుండి గ్రాడ్యుయేట్ అయి ,అక్కడే 1841 లో అరెబిక్, సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .1854 వరకు అమెరికాలో సంస్కృత పీఠం పై ఆచార్యుడుగా ఉన్న ఏకైక విద్వాంసుడు సాలిస్బరి .తరువాత అది ప్రొఫెసర్ షిప్ ఫర్ సాంస్క్రిట్ అండ్ కిన్ద్రేడ్ లాంగ్వేజెస్ ‘’ ,అనే ప్రత్యెక డిపార్ట్ మెంట్ గా ఏర్పడి విలియం ద్వైట్ విట్నీమొదటి అధిపతి అయ్యాడు.1863 నుండి 66 వరకు మళ్ళీ ,1873 నుంచి 1880 వరకు అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .
పారిస్ ఏషియాటిక్ సొసైటీ కి, కనెక్టికట్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కూ మెంబర్ గా ఉన్నాడు .జర్మన్ ఓరిఎంటల్ సొసైటీకి , అమెరికన్ యాంటి క్వేరియన్ సొసైటీ కి మెంబర్ గా 1861 లో ఎన్నికయ్యాడు .ఆయనకు ఏల్ యూని వర్సిటి 1869 లోను ,హార్వర్డ్ యూని వర్సిటి 1886 లోను గౌరవ ఎల్ ఎల్ డి నిచ్చి సత్కరించాయి .
34-డచ్ –కెనెడియన్ స్కాలర్ –రాబర్ట్ జే .జిడెన్ బాస్
1957 లో కెనడాలోని టోరేంటోలో జన్మించిన రాబర్ట్ జే జిడేన్ బాస్ డచ్ కెనెడియన్ స్కాలర్ ఇండియన్ ఫిలాసఫీ ,ద్రవిడియన్ స్టడీస్ లో డాక్టరేట్ డిగ్రీ పొంది ,నెదర్ లాండ్స్ లోని యూట్రెక్ట్ యూవర్సిటి నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ సాధించి ,సౌత్ ఆసియా ఇన్ స్టి ట్యూట్ లో ,జర్మనీలోని హీడెల్ బెర్గ్ యూని వర్సిటి లలో ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ రెలిజియన్స్ చదివాడు .హీల్డల్ బెర్గ్ వర్సిటిలో సంస్కృతం బోధించి ,తర్వాత ఇండియాలో మద్రాస్ యూని వర్సిటిలో జైనం బోధించాడు .తరువాత కెనడాలోని టోరేంటో యూని వర్సిటిలో సంస్కృతం, బౌద్ధం, దక్షిణాసియా భాషలు బోధనా చేశాడు .సమకాలీన కన్నడ ఫిక్షన్ పై డాక్టోరల్ దిసీస్ రాసిన మొట్ట మొదటి వెస్ట్రన్ స్కాలర్ రాబర్ట్ జిడేన్ బాస్.
కోఎన్రాడ్ ఎలిస్ట్ ,,యెన్ ఎస్ రాజా రాం లు ప్రచారం చేసిన’’ ఆర్యన్ ఇన్వేజన్ దీరీ ;’’ని పూర్తిగా వ్యతిరేకించాడు .అమెరికన్ ఓరి ఎంటల్ సొసైటీ జర్నల్ కు చాలా విలువైన వ్యాసాలు రాశాడు .కన్నడ సాహిత్యం పై సంపూర్ణ పాశ్చాత్య చరిత్ర ను రాశాడు. కన్నడ సాహిత్యాన్ని జర్మన్ ,ఇంగ్లీష్ భాషలలోకి అనువదించాడు .సంస్కృతం లో ఉన్న ద్వైత వీరశివ, జైన రచనలను ఆంగ్లం లోకి తర్జుమా చేశాడు .దాదాపు 20 ఏళ్ళ నుండి కర్ణాటకలోని మైసూర్ లో ఉంటున్నాడు ‘
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-16 –ఉయ్యూరు
.
