ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –22’
40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్
18-7-1943 న ఆనాటి జర్మని ఈనాటి పోలాండ్ లో ని స్క్యూబాస్ లో మైకేల్ విట్జేల్ జన్మించాడు 1965 నుండి 71 వరకు జర్మనీలో ,పాల్ ధీమే ,హెచ్ పి స్కిమిట్ ,కె హాఫ్మన్ జే నార్తన్ ల వంటి ఉద్దాదుల వద్ద ఇండాలజీ చదివాడు .19 72 – 73 కాలం లో నేపాల్ లో మీమాంస శాస్త్రాన్ని జనునాద పండిట్ వద్ద అభ్యసించాడు .1972 -78 మధ్య కాట్మండు లో ‘’నేపాల్ –జర్మన్ మాన్యు స్క్రిప్ట్ ప్రిజర్వేషన్ ప్రాజెక్ట్ ను ,’’నేపాల్ రిసెర్చ్ సెంటర్ ‘’ను ఏర్పరచాడు . టూబింజేన్ ,లీడెన్ ,లలో పని చేసి 1986 నుండి హార్వర్డ్ లో చేస్తున్నాడు .క్యోటో పారిస్ టోక్యో లకు రెండేసి సార్లు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళాడు .1972 నుంచి సంస్కృతాన్ని బోధిస్తున్నాడు .
వేద సంస్కృతం లో ప్రాచీన భారత దేశ చరిత్రలో ని మా౦డలీకాలు ,వేదమతాభి వృద్ధి భారత ఉప ఖండం లోని భాషా శాస్త్ర పూర్వ చరిత్ర మొదలైన వాటిపై , విస్తృత పరి శోధన చేసిన వాడుగా మైకేల్ విత్జేల్ గుర్తింపు పొందాడు .’’ఎలక్ట్రానిక్ జర్నల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ ‘’కు హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ కు ముఖ్య సంపాదకుడుగా ఉన్నాడు .1999 నుంచి ‘’స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ ఆఫ్ ప్రి హిస్టరీ ‘’అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నాడు .2006 నుండి ‘’ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఫర్ కంపారటివ్ మైదాలజి ‘’కి ప్రెసిడెంట్ .2003 లో అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు మెంబర్ గా ఎన్నుకో బడ్డాడు .2009 లో జర్మన్ ఓరియెంటల్ సొసైటీ గౌరవ సభ్యుడయ్యాడు . ,2012 లో రాసిన ‘’కంపారటివ్ మైదాలజి ‘’గ్రంధం గుర్తింపు వలన హార్వర్డ్ యూని వర్సిటి లో ఫాకల్టిఅఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కు కాబట్ ఫెలో గౌరవం20 13 లో పొందాడు .
విత్జేల్ ముఖ్య పరిశోధన అతి ప్రాచీనమైన వేదాలపైన వాటి వ్రాత ప్రతులు ,పారాయణ పద్ధతులపైన.అంతకు పూర్వం లభించని కొత్త ప్రతుల అన్వేషణ చేశాడు .ఆతను సాధించింది ‘’కధా ఆర్యాంక ‘’.ఋగ్వేదాన్ని జర్మన్ భాషలోకి టి గోటే తోకలిసి కొత్తగా తర్జుమా చేశాడు .వేద శాఖల గూర్చి,ఉత్తర భారతం ఆ పై ప్రాంతాలలో వేద సంస్కృతీ వీటి వలన ఎలా వ్యాపించిందీఅనే విషయాలపై విస్తృత పరిశోధన చేశాడు .దీనికోసం వేద మా౦డలీకాలపై 1989 లోను ,వేద ప్రామాణ్య అభి వృద్ధి పై 1997 లో , ప్రాచీన భారతం పై 2003 లో పుస్తకాలు రాశాడు ఇవికాక విస్తృత పరిశోధనతో రాసిన వ్యాసాలూ చాలానే ఉన్నాయి అందులో ‘’ది అనాలిసిస్ ఆఫ్ ఇంపార్టెంట్ రెలిజియస్ అండ్ లిటరరీ కాన్సెప్ట్స్ ,ది సెంట్రల్ ఏసియ యాంటి సిడేన్ట్స్ ,ది మహా భారత ,ది కాన్సెప్ట్ ఆఫ్ రి బర్త్ ,ది లైన్ ఆఫ్ ప్రాజేని (సంతాన రేఖ ),సెవెన్ రిషిస్ ముఖ్యమైనవి .
విత్జేల్ మరో గొప్ప పరిశోధన –మధ్యయుగ ,ఆధునిక భారత దేశం నేపాల్ లలో సంప్రదాయాలు భాషా శాస్త్రం ,బ్రాహ్మణులు ,కర్మ కండలు ,రాజ్యాధికారం ,ఈ నాటి సంస్కృతీ ..మరో పరిశోధన వేద గ్రందాల స్థానీకరణ .ఋగ్వేద ,కృష్ణ యజుర్వేద సంహిత ,బ్రాహ్మణాల కాలం లో ప్రాచీన భారత దేశ చరిత్ర .కౌరవులది ఢిల్లీ ప్రాంతమే అన్న మరో పరిశోధన .ఇటీవలి కాలం లో విత్జేల్ –ఇండియన్ ,యూరేషియన్ పురాణాలకు ఉన్న సంబంధం –దీనివలన చారిత్రాత్మక తులనాత్మక పురాణ బంధాలు తెలిశాయి .ఇండస్ లిపి లోని భాషాశాస్త్ర సహజత్వాన్ని ప్రశ్నించాడు .హార్వర్డ్ లో అనేక అంతర్జాతీయ సెమినార్లు నిర్వహించి ఫలప్రదం చేశాడు .కాలి ఫోర్నియా స్టేట్ స్కూల్ చరిత్ర పుస్తకాలలో మార్పులు చేయాలని అమెరికాలోని వేదిక్ ఫౌండేషన్ ,హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఒత్తిడి చేస్తే విత్జేల్ నాయకత్వం లో ఒక ఎక్స్ పర్ట్ పానెల్ ను వేసి మార్పులపై అధ్యయనం చేయమన్నారు .మధ్యవర్తిత్వం జరిపి కోరిన 58 మార్పులలో 12 మాత్రమె ఒప్పుకొని ఒక అవగాహన కుదిర్చి పుస్తకాలలోని విషయాలు మార్చనక్కర లేదని రిపోర్ట్ ఇచ్చాడు .దీనితో ఆయన హిందువులకు వ్యతిరేకి అని అభాండం వేశారు .2009 లో ఇండియా చైనాలు పర్యటించాడు .తాను హిందువులకు వ్యతిరేకిని కానని చెప్పుకోవాల్సి వచ్చింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-16 –ఉయ్యూరు

