— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
3-కృష్ణానంద ఆగమ వాగీశ
వారెందర బెంగాలీ బ్రాహ్మణుడైన కృష్ణానంద వాగీశ 1650 లోచైతన్య ప్రభు జన్మించిన నవ ద్వీపం లో మహేశ మిత్రునికి జన్మించాడు ..గొప్ప పండితుడు ,సాధకుడు .వేదాన్ని తంత్ర శాస్త్రాన్ని మధించినవాడు.అనేక శాస్త్రాలు చదివినందువలన మహామహోపాధ్యాయ బిరుదు పొందాడు .తమ్ముడు సహస్రాక్ష మిత్ర గొప్ప వైష్ణవ భక్తుడు .శ్రీ కృష్ణ ఉపాసకుడు .ప్రణతోషిణి రాసిన రామతోష ణుడికి 7 వ తరం వాడు .బెంగాల్ ప్రాంతం లో తాంత్రిక విద్య వ్యాప్తి చేసిన వారిలో ప్రధముడు .’’ఆగమేశ్వరికాలి మా’’ అనే నవద్వీప పూజా విధానాన్ని ప్రారంభించాడు . బీర్భం లోని మోల్లెపూర్ లో యోగ సాధన చేస్తూ తనువు చాలించాడు .
కలకత్తాదక్షిణ కాళీ ఆరాధన ప్రారంభించింది కూడా ఈయనే .ఒక రోజు కాళికా దేవి కలలో కన్పించి ,మర్నాడు ఉదయం ఆయనకు ఎవరు ఏ రీతిలో కనిపిస్తే ఆ రీతిలో తనను పూజించే పద్ధతిని ప్రచారం చేయమని కోరింది .మర్నాడు ఉదయం లేవగానే ఒక యువతీ ఆవుపేడతో పిడకలు చేసి గోడకు కొడుతూ ఉండటం చూశాడు .గోడకు పిడక కొట్టే టప్పుడు ఆమె ‘’ఆలీఢ భంగిమ ‘’ లో కుడి పాదం ముందుకు చాచి,.కృష్ణానంద ను చూడగానే ఆమె కంగారు తో నాలుకను దంతాల మధ్య .పెట్టి కనిపించింది .కృష్ణానంద ఈ భంగిమను మరింత వాస్తవాని దగ్గరగా మలచి కాళీ మాత పూజా విధానాన్ని ఏర్పాటు చేశాడు .క్రిష్ణానందుడు కాళీ భక్తులకు ,కవి రాం ప్రసాద్ సేన్ కు గురువు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్—29-10-16 –ఉయ్యూరు

