గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య
10-12-1947 న కలకత్తా లో జన్మించిన రామ కృష్ణ భట్టాచార్య కలకత్తా యూనివర్సిటి లో చదివిఇంగ్లీష్ లో బి ఏ ,ఎం ఏ ,పి హెచ్ డిలను 1966 ,68 ,1986 లలో పాసైనాడు .ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ లో రీడర్ గా ఆనంద మోహన్ కాలేజి లో చేరి 31-12-2007 న రిటైర్ అయ్యాడు .ఇంగ్లీష్ లో ఎమిరిటస్ ఫెలో ,యూని వర్సిటి గ్రాంట్స్ కమిషన్ సభ్యుడు .ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రిసెర్చ్ కు విజిటింగ్ ప్రొఫెసర్ .ప్రస్తుతం కలకత్తా పావ్ లోవ్ ఇన్ స్టిట్యూట్ ఫెలో గా ఉన్నాడు .
8 వశతాబ్ది నుండి 12 వ శతాబ్ది వరకు ఉన్న చార్వాక లేక లోకాయత భౌతిక వాదం పై శాస్త్రీయ పరిశోధన చేసి ,దాని కనుమరుగుకు కారణాలు అన్వేషించి తెలియ జేశాడు .చార్వాకం లో మత భేదాలు చాలా ఉన్నప్పటికీ అవగాహన విషయం లో అందరిదీ ఏకాభిప్రాయమే అని రుజువు చేశాడు .చార్వాకు లందరూ ఇంద్రియ వాదులు అనే అభిప్రాయం తప్పు అని సాదికారికం గా రుజువు చేశాడు .చార్వాకమతానికి ముందుకూడా ఈ భావనలు ఇండియాలో ఉన్నాయని ,కాని దానిపైనే చార్వాకం వృద్ధి చెందింది అని చెప్పటానికి ఆధారాలు లేవని వివరించాడు .మణిమేఖలలో దొరికిన ఆదారాలను బట్టి మహా భారతం లో అప్రత్యక్షంగా చెప్పబడిన విషయాలను బట్టి ఈ రెండు వ్యవస్థలు ఒకే సారి ఏర్పడి ఉంటాయని భావించాడు .
భట్టాచార్య ఇంగ్లీష్ లో ‘’గ్రౌండ్స్ ఫర్ హాప్,స్టడీస్ ఆన్ ది చార్వాక ,ఎమేర్జెంస్ ఆఫ్ మెటీరియలిజం ఇన్ ఇండియా ‘’గ్రంధాలు రాశాడు బెంగాలీలో 20 దాక పుస్తకాలూ రాశాడు .చార్వాకం పై 25 దాకా వ్యాసాలూ రాసి ప్రచురించాడు .8 పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు .
సశేషం
దీపావళి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-29-10-16 –ఉయ్యూరు
