మాన్యులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,
నమస్కారములు ! ముందుగా ‘దీపావళి శుభాకాంక్షలు‘ తెలుపుకుంటున్నాను.
మీరు నాపట్ల అభిమానంతో లోగడ పంపిన ‘మా అన్నయ్య‘ కవితా సనకలనం చదివి ఏంతో ఆనందించాను. వెంటనే నా స్పందనలను తెలుపాలని అనుకున్నా, తెనాలి వెళ్ళటం, ఏవో ఇతర రచనలు చేయటంతో కాల యాపన అయినందుకు విచారిస్తున్నాను.
అయినా, ఇది ఇప్పుడు చదివి అందులోని కొన్ని మధుర భావాలను ఆస్వాదించాను. వాటిపై, నా సమీక్షను రాసి ఇప్పుడే, నా మిత్రులందరికీ అంతర్జాలం లో పంపాను. దీనితో మరల పంపుతున్నాను. ఎన్నో మంచి కవితలను, సోదర సోదరీమణులు రాసి ఈ గ్రంధానికి వన్నె తెచ్చారు. మీరు సాహితీ సేవలో తరిస్తూ, మావంటి సాహిత్య ప్రియులను కూడా తరింపజేస్తున్నందుకు మీకు శతథా ధన్యవాదాలు తెలుపుకుంతున్నాను.
నా సమీక్ష మీ మనసును ఆకట్టుకుంటుందని భావిస్తాను. ప్రస్తుతానికి సెలవు.
మీ గీతాంజలి మూర్తి




