ఘోరకలి -4

ఘోరకలి -4

             బుక్  బర్ణింగ్ బోన్ ఫైర్
మనుషుల పనిపట్టి వారి సర్వ నాశనం చేసినట్లే హిట్లర్ తనకిష్టం లేని వారిరచనలను తగలబెట్టే ప్రయత్నం దేశవ్యాప్తంగాచేసి రికార్డ్ నెలకొల్పాడు .ఇదే” పుస్తక దహన భోగిమంటలు ”అనే బుక్ బర్ణింగ్ బోన్ ఫైర్ .ముఖ్యంగా హీబ్రూ బైబిల్ దహనం సోషలిస్టు సాహిత్య  దహనం ఇందులో భాగాలు .. ఈ దహనక్రియ పబ్లిక్ గా  బాండ్  మేళాలతో చప్పట్లు కేరింతలతో నడిబజార్లలో, యూని వర్సిటీ ఆవరణలో,సెంటర్ లలో  జరిపించాడు ..జ్యోవోయిష్ నాగరికత పూర్తిగా అంతమైపోవాలన్న  ఆరాటమే ఇది జ్యులు లేని ప్రపంచ నిర్మాణం సాధించాలన్న తపన . ఇదంతా ఒక  ఫా0టసీ . జ్యుల ను ఒక కల్పిత శత్రువుగా భావించి చీకట్లో చేసిన యుద్ధమే ఇది . జ్యులు ఏనాడూ జర్మనీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పని చేయలేదు ఆక్రమణలు చేయలేదు .ఆరకమైన సాహిత్యాన్నీ రాయలేదు . అందుకే యా0టి సెమిసిస్ట్ అనేది ఒక ఫా0టసీ అన్నారు . 1937 లో ”ది జ్యు  యాజ్ ఎ  క్రిమినల్ ”అనే పుస్తకాన్ని కిల్లర్ ,హాన్స్ ఆండర్సన్ లు రాశారు .అందులో ”స్పైరోకైతే బాక్తీరియా సిఫిలిస్ వ్యాధి కారణమైనట్లే జ్యులలో రాజకీయ ,రాజకీయేతర విషయాలలో నేర చరిత్ర రక్తం లోనే ఉన్నవాళ్లు మానవులకు జ్యులు పూర్తి వ్యతిరేకులు దుష్టత్వానికి మూర్తీభవించిన రూపం జ్యు .దేవుడికి వ్యతిరేకి .వాడి వాసనే చావుకు కారణం ”అని అభూత కల్పనలతో రాశారు  జాతి విద్వేషం కలగటానికి ఇది పూర్తిగా కారణాలలో ప్రధాన కారణమైంది
  క్రిస్టియానిటీ  జ్యుల మతమార్పిడిని సమర్ధించింది కానీ నాజీలు వ్యతిరేకించారు .ఇంతటి జాతి వ్యతిరేకతను నాజీలు కలిగించటానికి క్రైస్తవం కూడా బాగా దోహదం చేసింది .జ్యులనూ  జ్యుయిజాన్ని అగ్నికి ఆహుతి చేయాలన్నది హిట్లర్ సంకల్పం .వీళ్లకు ఈ భావం యూరోపియన్ కాలనీల నుండి వచ్చింది లక్షలాది ఇతరులను చంపి బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ బెల్జియం రాజ్యాలను ఏర్పరచుకున్నారు 1904 -1907 మధ్యఆగ్నేయ ఆఫ్రికాలో(నాంబియా )   హెరెరో ,నామాక్వా లను జర్మన్లు తుడిచిపెట్టేశారు కనుక ఇప్పుడు కూడా అలాంటిది సాధ్యమని కలలు కన్నారు .జ్యులకు మూలాలు బలంగా ఉన్నాయని ,బైబిల్ ,క్రిస్టియానిటీ ,లకు కారణం భూతులని కనుక కొత్త పరభుత్వానికి పాత వాళ్ళు అడ్డు అని భావించారు నాజీలు జ్యులు అంటే టెర్రర్ ..కనుక ఎన్ని లక్షలమంది అయినా సరే జర్మనీ యూరప్ దేశాలలోని జ్యులను అంతం చేయాలనే నిశ్చయించాడు హిట్లర్ .. 919-33 వరకు జర్మనీలో న్యాయం చట్టం ప్రజాస్వామ్యం చక్కగా వర్ధిల్లాయి.  జ్యులకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే పోలీస్ న్యాయస్థానం వారి హక్కులను కాపాడాయి . థర్డ్ రీచ్ పాలనవచ్చాక జ్యులకు హింస ప్రజ్వరిల్లింది .రౌడీలు వీధిమూకలు మిలిటరీలో ఎస్ ఏ రూపం లో దూరిపోయారు .వీళ్ళు సైన్యానికి అనుబంధ సంస్థ అయ్యారు  జ్యులకు అన్యాయం జరిగి ఫిర్యాదు చేస్తే ”జ్యులను రక్షించటం పోలీసుల ద్యూటీ కాదు ”అనే స్థితికి వచ్చింది .ధనికులైన జ్యులు అనేక వర్తక వాణిజ్య సంస్థలను  కంపెనీలను స్థాపించి నిర్వహించేవారు .వేలాది ఉద్యోగస్తులు పని చేసేవారు .అనేక యూనివర్సిటీలలో న్యాయస్థానాలలో సంస్థలలో విద్యాలయాలలో జ్యులు ఉన్నతపదవుల్లో ఉండేవారు ఇప్పడు దీన్ని సహించలేక నాజీలు ”యాంటీ కే పటలిస్ట్ ”విధానం అవలంబించారు .హిట్లర్ కు జ్యుల వల్లనే ఫ్రెంచ్ విప్లవం ,సమాన హక్కులు ,కమ్యూనిజం కేపటలిజం వచ్చాయని భ్రమ ఉండేది .ఇదంతా కూలదోసి నవ జర్మనీ ఏర్పరచాలనుకొన్నాడు ఆ విషయం స్పష్టంగామీన్ కాంప్ అనే 

తన చరిత్రలో చెప్పాడు -”సృష్టికర్త దేవుని ఆజ్ఞప్రకారం నేను జ్యులను వ్యతిరేకిస్తూ ,దేవునిపనిలో నడుస్తున్నాననుకొంటున్నా”అన్నాడు  .కేపిటలిజం కన్జర్వేటిజం కమ్యూనిజం బోల్షివిజం మార్క్సిజం ,సోషలిజం .లిబరలిజం ,పసిఫిజం ,కాస్మోపాలిటనిజం  మెటీరియలిజం  నాస్తికత, ప్రజాస్వామ్యం లు ఏర్పడ్డాయని తానునమ్మి ప్రజలచేత నమ్మించాడు హిట్లర్ .నిజానికి వీమర్ రిపబ్లిక్ లో సాహిత్య సంస్కృతులు మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లాయి .వినోదం కేబరే క్లబ్ డాన్స్ లైంగిక స్వాతంత్రం ,సైకో అనాలసిస్ , ఫెమినిజం ,హోమో సెక్సుయాలిటీ  అబార్షన్ జాజ్ సంగీతం బాహాస్ ఆర్కి టెక్చర్  ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్  ఇంప్రెషనిజం ,క్యూబిజం డాడాయిజం ఎక్స్ప్రెషనిజం లు వర్ధిల్లాయి అందుకే హిట్లర్ కు ”ఎక్కడో ”కాలింది .. 1933 వరకు నాజీలకు జీనోసైడ్ (జాతి విధ్వంసం ),ఎక్స్టెర్మి నేషన్(దుంపనాశనం )ఆలోచన రాలేదు . కొత్త జర్మన్ జాతిని జ్యుల  రక్త రహితంగా ఏర్పరచాలని ఆతర్వాత వచ్చింది అందుకే ఆ మారణ హోమాలు .దానికోసమే ప్రజాస్వామ్యాన్ని బలపరచిన వీమర్ డెమాక్రసి చట్ట న్యాయ వ్యవస్థ ,జర్మన్ ఉదారవాదం కమ్యూనిజం  విధ్వంస నిర్ణయం  హిట్లర్ ఛాన్సలర్ అయినా కొత్తలో ”ఆ వీడెన్ని  రోజులుంటా డు రెండునెలల్లో మూలకు తోసిపారెయ్యమా స్ప్రింగ్ దాకా ఉంటె గొప్పే ”అని ప్రగల్భాలు  పలికారు డెమొక్రాట్లు .అప్పటికి హిట్లర్ అధికారాలు పరిమితమే .క్రమంగా బలపడి ప్రెసిడెంట్ అయి సైన్యాధికారి అయి సర్వాధికారాలున్న ఫ్యురేర్ చక్రవర్తి అయి డెమొక్రసీని డిక్టేటర్షిప్ తో శాసించాడు ఏకు మేకయ్యాడు . .
   ఏది చేసినా హిట్లర్ పెద్ద ఆర్భాటం గా చేసేవాడు” లో కీ ”ఉండేదికాదు .బంద్ మేళాలు మార్చింగ్ లు హెయిల్ హిట్లర్ నినాదాలు దీపాలతో హోరెత్తించేవాడు సెబాస్టియన్ హాఫ్నర్ హిట్లర్ గురించి రాస్తూ ”అతడిదగ్గర మనిషి రక్తం మాంసం వాసన వచ్చేది .మనుషుల్ని తినే జంతువు. అతడి చూపు భయంకరం ”అన్నాడు ..బలపడిన హిట్లర్ స్వతంత్రముగా ఉన్న రాజకీయ ,సాంఘిక ,సాంస్కృతిక ,సంస్థల అధికారాలను రద్దు చేసిపారేశాడు దీన్ని సింక్రనైజేషన్ ;;అన్నాడు ..ట్రేడ్ యూనియన్ లను రద్దుచేసి జర్మన్ లేబర్ ఫ్ర0ట్ఏర్పరచి  కమ్యూనిస్ట్ సోషలిస్టు పార్టీ ఆఫీసులని కూలగొట్టి  ఏక పార్టీ నాజీ ఏకవ్యక్తి హిట్లర్ పాలన ప్రారంభించాడు  ఫ్రాన్స్  లో బాస్టిల్లే పతనం 1789 లో జరిగిన జులై 14 నుంచి అమలు చేశాడు ..నాజీలు అంటే టెర్రర్ అనుకున్న హిట్లర్ ఇప్పుడు అందరికీ టెర్రర్ అయ్యాడు ప్రజాస్వామ్య మూలాలన్నీ విధ్వంసం చేశాడు .ఆటలు సంగీతం డాన్స్ లలో జ్యులు లేకుండాచేసి నాజీ లతో ఆలోచనలతో నింపాడు .జర్మన్ ఆర్ట్ లో విదేశీయులు దూరారని భావించి ఇప్పుడు జర్మన్ ఆర్ట్ కు ప్రాణం పోశాడు .జర్మన్ ఆర్ట్ సోల్ అండ్ స్పిరిట్ అనేది హిట్లర్ నినాదం   దీనికోసమే పుస్తక దహన కార్యక్రమం .చేబట్టాడు .టౌన్హాల్ ముందు రాత్రి 9-30 కి విద్యార్థులతో టార్చ్ పెరేడ్ జరిపించి ఊరేగింపు జరిపి స్వస్తిక్ జెండాలతో ,రైట్ వింగ్ పారామిలిటరీ దళాలు నడుస్తుంటే ఎస్ ఎస్ ఎస్ ఏ వాళ్ళ కేరింతలతో అరుపులు ఆర్భాటాలతో ప్రొఫెసర్లు లెక్చరర్లు విద్యార్థులు కదం తొక్కుతూ నడిచి ,అప్పటికే మధ్యాహ్నం పెద్ద పెద్ద దుంగలతో 12అడుగుల ఎత్తు  ,6 అడుగుల వెడల్పుగ తయారై  కణకణ మండుతున్న అగ్ని వేదిక  భగభగ భోగి మంటలను  వెదజల్లుతుండగా వామపక్ష జర్నల్స్ ,న్యూస్  పేపర్లు ,కమ్యూనిస్ట్ సోషలిస్టు గ్రంధాలు పోస్టర్లు కరపత్రాలు జెండాలు మంటల్లో కేరింతలతో వేసి మండుతుండగా చూసి చప్పటలతో హర్షధ్వానాలు చేస్తూ ఆపైన సోషలిస్టు టోపీలను విసిరేసి మండుతుండగా ఆనందించి వీమర్ రిపబ్లిక్ బ్యానర్లనూ తగలెట్టి రాక్షసానందాన్ని సామూహికంగా అనుభవించారు .ఇదే  బర్ణింగ్  బుక్స్ బోన్ ఫైర్ .కు నాంది .తర్వాత ఎక్కడెక్కడ ఎలా మండించారో చూద్దాం
ఇన్‌లైన్ చిత్రం 1.
ఇన్‌లైన్ చిత్రం 2
   సశేషం
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.