వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -46
రఘు వీర చరితం -5(చివరిభాగం )
కావ్యం లో ఉపమాలంకారాలు ఎక్కువగా వాడాడు మల్లినాథుడు ..రామునిపై రాక్షసులు వేసేబాణాలు హిమాలయాలను మబ్బులు ఢీకొని వర్షం కురిసినట్లు న్నాయి -”పయోద బృందాన్ని సగర్జితాని ధారాదిపాతేరివ శైలరాజం ”ఇందులో బాణాలు ఉపమేయం ,వర్ధధార ఉపమానం .సమానధర్మం అభిపాతం .8వ సర్గ లో రూపకాన్ని చక్కగా ప్రయోగించాడు .రామ లక్ష్మణులు సుగ్రీవుని కలిశాక సోదరులను చూసి వానరారాజు మహా ముచ్చట పడ్డాడట అందం ముత్యాలరూపం లో పలువరుసనుండి వెలువడుతోంది అన్నాడు .చంద్ర కాంతి రాత్రి కలువ మనసు అతి తెల్లగా స్వచ్ఛ గంగా జలం తనను స్నానం చేయిస్తున్నట్లు ఉందన్నాడు ఇక్కడ ముఖ వర్చస్సు చంద్రకాంతితో ,దంతాలు ముత్యాలతోను సామ్యం చెప్పాడు .9 వ అధ్యాయం లో సూరి యాకంగా రఘువంశంలో లాగా యమకాన్ని నింపేశాడు .ఈ యమకం దృత విలంబిత శ్లోకానికి పరమ రామణీయకాన్ని తెచ్చింది -కమలినీ మాలినీ లిత పంకజం -శశమయం శమయంత మనుక్షపం -స్తపురితం పురితం కవ చ సానుభిః ”.మరొక చోట దృష్టాంతాలంకారం వాడాడు -భవిష్యత్తులో పెరిగే అవకాశమున్న శత్రువును ముందే తుద ముట్టించాలి -లేత మొక్కను గోటితోనే గిల్లేయవచ్చు ,కాలం గడిస్తే మొక్క మానై శాఖోపశాఖలై బలపడి పదునైన గండ్ర గొడ్డలితో ఛేదించాల్సి వస్తుంది -”రిపో రిభిః వ్యాజ్జిత వృద్ధే ఋత్యానమేవ ప్రధమం నిరోధ్యం -నఖ ప్రభేద్యే తు తరు ప్రరోహే కాలేన కృష్టా హి కుఠార ధారా ”
అర్ధాంతరన్యాసాన్నికూడా శరదృతు వర్ణనలో సమర్ధవంతంగా ప్రయోగించాడు .లక్ష్మణుడు రామునితో యుద్ధానికి వస్తానన్నాడు -పెద్దలను అనుసరిస్తే ఈ లోకం లోను ,పైలోకం లోను మంచిఫలితాలుంటాయి -”అను వృత్తి ర్గురూణాం హి లోకద్వయ ఫలప్రదా ”. మరో చోట హనుమ తో -”నహి కృత్యవతామ్ చేతః ప్రాయహ్ కర్మాంతర క్షమం ”అనిపిస్తాడు ..రాముని మాటలలో ఉత్ప్రేక్ష ను బాగా పలికించాడు ..సీత తనకు దూరమైతే వృక్షాలు కూడా కన్నీరు కారుస్తున్నాయి అని తుమ్మెదల రొద రోదన ధ్వనిలా ఉందని ఉత్ప్రేక్షించాడు -”ఏ తేవత్ ప్రియతమా విహరాపకల్పం మమీ క్షమీ క్షమా లిభిర్విహితా తేనాదః -ముజ్వంతి బాష్ప సలిలాని మహీరుహోపి పుష్పేద రస్రు తమరంద మిషేణ నూనం ”
ఈ మహాకావ్యం లో సంఘటనలు ,పాత్రలు రామాయణం లో ఉన్నట్లే రాశాడు .కొత్తదారి తొక్కలేదు .హనుమ పాత్ర అంటే మల్లినాథునికి చాలా ఇష్టం అని పిస్తుంది .మొదటిసారిగా 8 వ అధ్యాయం లో హనుమ కనిపించి రామునికి అన్నిరకాల సాయం చేస్తానని చెప్పాడు .దీనికి రాముడు పరమాన0దం పొందాడు .హనుమను ధీరోదాత్తుడు,స0యమి అన్నాడు .అతడు అరణ్యం లో ఉండటం రుద్రుని సేవించిన0త సంతోషంగా ఉందన్నాడు .-”సర్వా తీతస్య వశినస్తవ శక్తిమతః ప్రభో-భైక్ష చర్యణా రుద్రస్య శోభతే వనవాసినా ”
రామ హనుమల స్నేహ బంధం అగ్ని సాక్షిగా జరిగింది .రామకార్యాన్ని నిర్వర్తించమని జాంబవంతుడు హనుమకు హితోపదేశం చేశాడు .రాముడు విష్ణు అవతారమని ఆయన పూర్వ అవతారాలు తనకు తెలుసునని చెప్పాడు .సృష్టికర్త మొదటగా రాముని సృష్టించి ,తర్వాతే స్వాయంభువ ,మొదలైన మనువును సృష్టించాడని చెప్పాడు . 1 1వ అధ్యాయం లో హనుమ జన్మకు ముందున్న పరిస్థితుల వివరణ ఉంది .హనుమలో వాయు ,ఇంద్ర ,బ్రహ్మ వామన లక్షణాలు గుణాలున్నాయన్నాడు -”పితురివ బల వేగయో రముష్య స్థితి రామరాధిపతే రివారు తేజహ్ -కమల భావ ఇవోద్యసః సమాధౌ కపట బటోరివ కామ రూపతా ”.హనుమ యొక్క విశ్వాస ధైర్యాలు ,అనుమానాలను గొప్పగా వర్ణించాడు .హనుమ మహత్కార్యాలన్నీ వైభవోపేతంగా మిగిలిన అధ్యాయాలలో సంపూర్ణంగా వివరించాడు మల్లినాథుడు ..ఏతా వాతా తేలిందేమిటి అంటే ఇదిపేరుకి రఘువీర చరితమే కానీ అసలు హనుమ వీర చరితమా అన్నట్లు రాశాడనిపిస్తుంది .హనుమ శక్తి యుక్తులు బలపరాక్రమాలు రామునిపై గల అత్యున్నత భక్తి విశ్వాసాలు చాలా గొప్పగా సూరి వర్ణించాడు .మిగిలిన కావ్యాలలో ఉన్నట్లు వ్యర్ధమైన వర్ణనలేమీ చేయలేదు చక్కని కావ్యమర్యాదను సంయమనాన్ని పాటించి మల్లినాథ సూరి తన కవితాప్రతిభా సర్వస్వ0గా రఘువీర చరితమహాకావ్యాన్ని తీర్చి దిద్ది సెహబాష్ అనిపించుకున్నాడు .
మల్లినాథుని శైలి ,ఊహా శక్తి
మల్లినాథుని శైలి ఊహా శక్తి ఎప్పుడూ ఆడంబరానికి గురికాలేదు కాళిదాస మహాకవిలాగా భారంకాని దీర్ఘ0కాని సంయుక్త పదాలనే వాడాడు కనుక మల్లినాథునిది వైదర్భి శైలి .సరళం గా సూటిగా ఉంటుంది .వాడిన అలంకారాలు తేలికైవై సులభగ్రాహ్యమైనవి కూడా క్లాసికల్ యుగానికి కొద్దీ దూరంగా మల్లినాథుడున్నాడు కనుక ఈ కావ్యం లో కృత్రిమతా ,పదాడంబరాలు లేవు .మల్లినాథుడికి ఆదర్శం కాళిదాసమాహా కవి .రాముని సీతా విరహవేదన రఘువంశం లో ఇందుమతీ విరహ వేదన పొందిన అజుని విరహ వేదన లా ఉంటుంది . సీత పాద భూషణాలు చూసి దుఃఖించటం విక్రమోర్వశీయం లో 5 వ అంకాన్ని గుర్తుకు తెస్తుంది .
కాళిదాసు మానవ భావాలను సహజ విషయాలుగా భావించి చెప్పాడు .ప్రకృతికి ,మానవ ప్రకృతికి ఉన్నభావోద్రేక సంబంధాన్ని తరచి వివరించాడు .మల్లినాథుడు ప్రకృతిని మానవ భాషలో వర్ణించాడు పంపానదినిసుందర కన్యగా అభి వర్ణించాడు .మాల్యవంతుడు స్వర్గానికి తొందరపడి వెళ్లకుండా పంప అడ్డు పడిందన్నారు .ఈ పట్టణం పంపాతీరాన పదభాగం లో ఉంది .అందుకని పర్వత పదాలను తాకి వేగం తగ్గించుకొన్నద ని భావం ..పాద శ్లేష నుపయోగించి పంపానాయకిపాత్రకు ఔచిత్యం ఘటించాడు .నదిపై మంచు ఆమె కనుబొమలఅల్లికలా ఉందట .నదిలోని తామరపుష్పాలుఆమె హస్తాలు ,కాళ్ళు ముఖం ,కళ్ళు .సుడులు ఆమె బొద్దుపై వళులు చక్రవాక ద్వయం ఆమె చనుకట్టు సౌందర్యం .-”ఉద్యతస్య దివం ప్రాప్తం నిరోద్రుమివ సదు గతిం -మహీ భూతొ మాల్యవతః పాదాశ్లేషం వితంవా తీ0 – వీచీ భి ర్భూ లతా0 పా ద్యైహ్ పాణిపాద ముఖ క్షేణ 0 -ఆవర్త నైనాభి విన్యాసం స్థనాశ్రయం” .
లతలు చెట్లను పెనవేసుకొన్నప్పుడు రాముడు మరింత వియోగ బాధ పడ్డాడు .ఇక్కడే రామ లక్ష్మణుల సుదృఢ దేహ సౌష్ఠవ సౌందర్యాలను తనివి తీరా వర్ణించాడు .సాధారణంగా కావ్యనిర్మాతలు అనేక రసాలను కావ్యం లో పోషిస్తారు .ఆలంకారికుల సిద్ధాంతం ప్రకారం ఒకటే రసం శృంగార రసం అంగిరసంగా ,మిగిలినవి అంగ రసంగా ఉండాలి .ఈ కావ్యం లో చాలా దృశ్యాలు యుద్ధ దృశ్యాలే .కనుక వీరరసమే ఇక్కడ ప్రధానం .మిగిలిన రసాలు సందర్భానుసారం పోషించబడ్డాయి .యుద్ధ భూమిలో పీనుగు కుప్పలు భయానకంగా భీభత్స రస ప్రధానంగా వర్ణించబడ్డాయి .రాక్షసులతో యుద్ధాలు భయానక రసాన్ని పోషించాయి ..
రావణ వద్ద తర్వాత అందరు పుష్పక విమానం లో తిరిగి వస్తున్నప్పుడు దారిలో కనిపించిన వాటినన్నిటిని మల్లినాథుడు ఒకే అధ్యాయం లో వర్ణించి ఔచిత్యం పాటించాడు .రాక్షస గణాలు , ,గరుడ వేగ గమనం ,హనుమ ప్రత్యంగ వర్ణన లలో స్వభావోక్తి అలంకారమే ఉపయోగించాడు .వర్ణనీయ వస్తువుకు తగిన పదాలను ఎన్నుకొని సంపుష్ఠి సంతృప్తి కలిగించాడు .. తరువాతకవులలో ఉన్న అతిశయోక్తి పదాడంబరం మల్లినాథునిలో లేదు .కావ్యమంతా అతి నిదానంగా మెత్తగా ,అవసరమైన చోట్ల విగర్ పొగరు లతో సాగుతుంది .కాళిదాసాదుల లాగ మల్లినాథుడు మంచి శుభాషి తాలను ప్రతి వస్తూపమా లేక అర్ధాంతర న్యాసాలతో అందంగా కావ్యం లో చెప్పాడు -1-పరిమా చేతు కరణేషు నాతి కాంక్ష్యా 2-అను వృత్త గురూణాం హి లోక లోక ద్వయ ఫలప్రదా 3-అల్పేనాని నిమిత్తేన సౌభ్రాత్రం క్రియతే నృణాం -పునస్త ప్రతి సంధానం మహాతాపి న లభ్యతే 4-నహి కృత్యవతామ్ చేతః ప్రాయహ్ కారమంటారాక్ష్మమం”
దీనితో మల్లినాథుని ”రఘవీర చరితం”మహాకావ్యం పై విశేష విషయాలు సమాప్తం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—

