హిమాలయ యోగులలో కొందరు నిత్యమౌన వ్రతం ఉంటారు .వారిదగ్గరకు ఎవరు వచ్చినా కన్నెత్తి అయినా చూడరు .అలాంటివారిలో హరి ఓం యోగి ఒకరు .ఒకసారి స్వామిరామా గురువు బెంగాలీ బాబా బద్రికి దగ్గరున్న శ్రీనగర్ వద్ద గుహలో హరి ఓం యోగి దగ్గరచెప్పింది నే ర్హుకోమని పంపాడు .సరే నని వెళ్లి రెండేళ్లు ఆయన సన్నిధిలో ఉన్నాడు .ఆయన కన్నెత్తి కూడా చూడలేదు .ఒకసారి తనగురువుకు ఈ విషయం తెలియజేశాడు ..ఆయన నిన్ను ఆయన గమనించలేదనుకోకు నీ వివరాలన్నీ ఆయనకు తెలుసు”అని చెబితే ” . అదెలా సాధ్యం ఆయనెప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు .ఆయన ఒక జీవం లేని కర్రముక్కో రాయిలాగానో ఉంటాడు చలనం లేదు ”అని ఫిర్యాదు చేశాడు .”కాదులే అక్కడే ఉండు ”అని భరోసా ఇచ్చాడు గురువు .ఒక రోజు హరి ఓం స్వామి కళ్ళు తెరిచి నవ్వుతూ ”నేను కర్రముక్క నా ,రాయినా ?”అన్నాడు .కంగుతిన్నాడు స్వామిరామా .తనగురువుతో చెప్పిన సంగతి ఈయన కెట్లా తెలిసిందని బోల్డు ఆశ్చర్యపడ్డాడు .మళ్ళీ హరి ఓం స్వామి ”కళ్ళు మూసుకొని నేను మీరు కళ్ళు తెరిచి చూసినదానికంటే అద్భుతానందాన్ని చూస్తున్నాను ఆ ఆనందం లో మునిగిపోయే వాడికి ఈ భౌతిక లోకం ఏమానన్దం కలిగిస్తుంది ఆ విశ్వ చైతన్యం లో నేను విహరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తాను అందుకే నిరంతరం కళ్ళు మూసుకొని ఉంటాను ”అన్నాడు .ఈ మాటలు రామా మీద గొప్ప ప్రభావం కలిగించాయి .హరి ఓం కనులు అరమోడ్పుగా చూస్తే చాలు అందులోనుంచి అమృతం పొంగి పొరలుతున్నట్లు ఉందని రామా భావించి అనుభవించాడు .
వీక్షకులు
- 1,182,758 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- అమెరికా స్వర్ణయుగ (గిల్డెడ్ ఏజ్ )సాహిత్య కీర్తిపతాక మార్క్ ట్వైన్ జీవిత చరిత్ర -3
- బయోగాస్ ప్లాంట్ లతో గుజరాత్ జకారియాపుర గ్రామ చరిత్రే మారిపోయింది
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.2 వ భాగం.10.8.26.
- మహాకవి కాళిదాసు రఘువంశ మహా కావ్యం.2 వ భాగం.10.8.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.264 వ భాగం.10.8.26.
- పూర్తిగా నీటిలోనే ఉన్న కేరళలోని 3 వేల ఏళ్ళనాటి శ్రీ నీర్పత్తూర్ శివాలయం, పుత్తూర్
- అత్యాదునిక కాలం లో పచ్చని ప్రకృతి ఒడిలో వైదికపద్ధతిలో వర్ణాశ్రమ ధర్మ విధానం లో 12కుటుంబాలతో ,16మంది విద్యార్ధులతో స్వయం సమృద్ధిగా విలసిల్లుతున్న శ్రీకాకుళం జిల్లాలోని -కూర్మ గ్రామం
- అమెరికా స్వర్ణయుగ(గిల్డెడ్ఏజ్ ) సాహిత్య కీర్తిపతాక -మార్క్ ట్వైన్ జీవిత చరిత్ర -2
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.1 వ భాగం.9.8.26.
- సరస భారతి 202 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,320)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
