గీర్వాణ కవుల కవితా గీర్వా ణం -3 331-జానకీ రామ భాష్య కర్త -ఆనంద రామ బారువా (1850-1889 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

331-జానకీ రామ భాష్య కర్త -ఆనంద రామ బారువా (1850-1889 )

అస్సామ్ లో మొట్టమొదటి ఐ సి ఎస్ ,మొదటి గ్రాడ్యుయేట్ ,లాయ

ర్  సంస్కృతాంగ్లాల లో మహా విద్వా0శుడు  ఆనంద  రామ్ బారువా 1850 లో జన్మించి 39 ఏళ్లకే 1889 లో మరణించాడు .ఆయన 1-భవభూతి మహా విరచితం ,2-సరస్వతీ కంఠాభరణం 3-నామ లింగాను శాసనం 4-జానకీరామ భాష్యం సంస్కృతం లో రచించాడు .ఆంగ్లం లో భవ భూతి అండ్ హిస్ ప్లేస్ ఇన్ సంస్కృత లిటరేచర్ ,ఎ ప్రాక్టికల్ ఇంగ్లిష్ సంస్కృత డిక్షనరీ ,,హయ్యర్ సంస్కృత గ్రామర్ -జెండర్ అండ్ సింటాక్స్ , ఏన్షెన్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ,,ఎ కంపానియన్   టు ది  సాన్ స్క్రిట్  రీడింగ్ అండర్ గ్రాడ్యుయేటస్ ఆఫ్ ది కలకత్తా యూనివర్సిటీ ,కంపా రిసం ఆఫ్ ఎ కాంప్రెహెన్సివ్ డిక్షనరీ ఆఫ్ ఆల్ డ యాలెక్ట్స్  ఆఫ్ బెంగాల్ .

332-నైషధ తిలక కర్త -కృష్ణకాంత హాండీకి (1898-1982)

20-7-1898 న అషోమ్ కుటుంబం లో అస్సామ్ లో కృష్ణకాంత హాండీకి జన్మించాడు .జోర్హాట్ ప్రభుత్వ పాఠశాలలో  చదివి గౌహతికి వెళ్లి 1913 లో కాటన్ కాలేజీలో చేరి రెండేళ్లు చదివి కలకత్తా వెళ్లి కలకత్తా యుని వర్సిటీ లో 1920 నుండి 23 వరకు సంస్కృతం చదివి ,ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మోడర్న్ హిస్టరీలో ఏం ఏ పాసై ,పారిస్ జర్మన్ ఫ్రాన్స్ యుని వర్సిటీలలో విద్య నేర్చి ,గ్రీఎక్ స్పానిష్ జర్మన్ ఫ్రెంచ్ ,ఇటాలియన్ ,లాటిన్ ,రష్యన్ భాషలలో మహా ప్రావీణ్యం పొంది ,ఆ భాషా సాహిత్యాలకు చెందిన 2 వేలకు పైగా అరుదైన గ్రంధాలను తనతో అస్సామ్ కు తెచ్చుకున్నాడు

 టీ ప్లాంటర్స్ కుటుంబానికి చెందిన వాడవటం తో తండ్రికున్న టీ  ఎస్టేట్స్ నిర్వహణలో నూతన సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టి అభి వృద్ధి చేశాడు .హేమలత ఐదియి ను వివాహమాడి ప్రభుత్వ ఉద్యోగం చేయటానికి ఇష్టపడక ,జోర్హాట్ లో జె బి కాలేజీ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ అయ్యాడు .అస్సామ్ లో అదే మొట్టమొదటి ప్రయివేట్ కాలేజీ ఈనాటికీ సమర్ధవంతంగా వర్ధిల్లుతోంది .ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గా 17 ఏళ్ళు పనిచేసి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఇండాలజిస్ట్ గా  అస్సామ్ లో అత్యంత విశిష్ట విద్యా వేత్తగా గుర్తింపు పొందాడు.

 హాండీకి అనేక వ్యాసాలూ చాలా విషయాలపై పత్రికలకు రాశాడు -ఔబాదర్ కథ ,స్పానిష్ సాహిత్యత్ రోమియో జూ లియట్ ,జర్మన్ సాహిత్యత్  సపోన్  నాటక ,గ్రీక్ నాటకార్ గణ్ ,సోక్రటీసర్ మతే క్వీర్ ప్రకృతి మొదలైనవి .గ్రంథాలుగా వచ్చినవి నైషధ చరిత ,యశస్తిలక సంస్కృతం లో ,ఆంగ్లం లో సేతు బంధూస్  ప్రవర సేన  .ఈ మూడు ఆయన పరిణత మేధో వికాసనానికి తార్కాణాలు అంటారు వేత్తలు

 1948 లో హాండీక్ ను గౌహతి యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ గా నియమించారు.  ఇందులో 9 ఏళ్ళు1957 వరకు  గొప్ప సేవలందించారు  . తన భార్య స్మ్రుతి చిహ్నంగా జోర్హాట్ లో ‘’హేమలత హాండీకి మెమోరియల్ ఇన్ స్టి ట్యూట్ ‘’నెలకొల్పాడు   గౌహతి యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్  గా సేవలందించి తనకున్న అత్యంత విలువైన11 భాషలలోని    స్వంత లైబ్రరీ గ్రంధాలను గౌహతి యుని వర్సిటీకి సమర్పించి అందరికి ఉపయోగం లో ఉండేట్లు చేసిన త్యాగ మూర్తి హాండీకి . 1937 లో అసోం సాహిత్య సభకు ప్రెసిడెంట్ గా 39 ఏళ్ళ అతి తక్కువ వయసులో నియమింప  బడి చరిత్ర సృష్టించాడు .1951  లో లక్నో లో 1961 లో శ్రీనగర్ లో జరిగిన అఖిలభారత సంస్కృత పరిషత్ సభలకు కృష్ణ కాంత హాండీకి అధ్యక్షులుగా వ్యవహరించాడంటే ఆయన సమర్ధత ఏమిటో మనకు తెలుస్తుంది

 హాండీకి గొప్ప సంస్కృత విద్వావంసుడు  మేధావి మాత్రమే కాదు గొప్ప వితరణ శీలి ఇండాలజిస్ట్ లకు మార్గ దర్శి .అంకిత భావం తో అత్యున్నత విలువలతో  జీవించిన ఆదర్శ మూర్తి .అస్సామ్ లో విద్యా వ్యాప్తికి అవిరళ కృషి చేసినవాడు 7-.-6-1992 న94 ఏళ్ళ పరిపూర్ణ జీవితాన్ని గడిపిన మహా విద్యావేత్త కృష్ణకాంత హాండీకి అమరుడయ్యాడు .ఆయన గౌరవార్ధం 7-10-1983 న భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలాబిళ్ళను విడుదల చేసింది .అస్సామ్ ప్రభుత్వం ‘’కృష్ణకాంత హాండీకి స్మారక పురస్కారం ఆయన సంస్కృత విద్యావ్యాప్తికి ‘’ గౌరవార్థంగా ఏర్పాటు చేసింది .ఎనిమిది విదేశీ భాషలో ,అయిదు స్వదేశీ భాషలో మహా పండితుడు ,కీర్తి, పదవి,అధికారం,ప్రచారాల కోసం తాపత్రయ0 పడని  అరుదైన వ్యక్తిత్వం దార్శనికత ,సాంఘిక నైతిక నిబద్ధత తో అస్సామ్ సర్వతోముఖాభి వృద్ధికి యెనలేని కృషి చేసిన చిరస్మరణీయుడు కృష్ణకాంత హాండీకి .

333-నాగాలాండ్  మిజోరాం  మేఘాలయ ,మణిపూర్ త్రిపుర,సిక్కిం  రాష్ట్రాలలో సంస్కృత వ్యాప్తి

నాగాలాండ్ ,మిజోరాం రాష్ట్రాల యుని వర్సిటీలలో సంస్కృత డిగ్రీ  కోర్సు లేదు కానీ సెంట్రల్ యుని వర్సిటీలో సంస్కృత బోధనఉంది .నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలో భాగమైన వీటిలో సంస్కృతం లేదు .మేఘాలయ రాష్ట్రం లో షిల్లాంగ్ గొప్ప విద్యా కేంద్రం .ఇక్కడి నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ అనే సెంట్రల్ యుని వర్సిటీలో సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ లేదు కానీ అనుబంధ కాలేజీలలో డిగ్రీ వరకు సంస్కృత బోధన ఉంది .పాళీ భాషకు పాళీ టోల్ మాత్రం ఉంది .అరుణాచల్ ప్రదేశ్ లో యూనివర్సిటీలో సంస్కృతం లేదు .త్రిపుర లో సంస్కృత సంప్రదాయం ఉంది .మణిపూర్ లో ఒకప్పడు సంస్కృతాన్ని రాజులు బాగా పోషించారు .మహా గ్రంధాలు వెలువడ్డాయి కూడా . వైష్ణవం బాగా వృద్ధిలో ఉండేది .కానీ ఇప్పుడు కొన్ని సంస్కృత పాఠశాలలు మాత్రమే సంప్రదాయ పద్ధతిలో నడుస్తున్నాయి .పరీక్షలను అస్సామ్ సంస్కృత బోర్డు ,ఎంగల్ సంస్కృత బోర్డు నిర్వహించి సర్టిఫికెట్లను జారీచేస్తాయి .పాణిని కౌముది బదులు కొత్తగా ముగ్ధ బోధ వ్యాకరణం బోధిస్తున్నారు .కొత్తగా హరినామామృత వ్యాకరణం ను ముగ్ధ  బోధ వ్యాకరణం బదులు వైష్ణవ పాఠశాలలో బోధిస్తున్నారు .ఇంఫాల్ లోని సంస్కృత టోల్  సంస్కృత విద్యా వ్యాప్తికి మొదటినుంచి గట్టి కృషి చేస్తోంది .ఇంఫాల్ యూనివర్సిటీలో సంస్కృతం లేదు .కానీ కొన్ని అనుబంధకాలేజీలలో డిగ్రీ వరకు సంస్కృతం ఉంది .

 సిక్కిం రాష్ట్రము లో నేపాలీల మెజారిటీ ఎక్కువ .కొన్ని సంస్కృత టోల్స్ లో సంస్కృత బోధన జరుగుతోంది .ప్రాధమిక విద్యలో సంస్కృతం సబ్జెక్ట్ గా ఉండదు విద్యార్థులకు అభిరుచి ఉంటె ప్రభుత్వం సంస్కృత ఉపాధ్యాయుని నియమించి నేర్పిస్తుంది .గాంగ్ టాక్ లో చాలా సంస్కృత పాఠశాలలున్నాయి .ఇవి సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం నేర్పుతాయి ..కనుక ఈశాన్య రాష్ట్రాలలో పెద్దగా ఇప్పుడుసంస్కృత  సాహిత్య 0 రావటం లేదు .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గ ప్రసాద్ -30-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 Inline image 1

అనంతరాం బారువా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.