గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
361- శైవాగమ గ్రంథ పరిశోధకుడు -ఎస్ సంబంధ శివాచార్య (1927
పాండిచ్చేరిలో ఫ్రెంచ్ ఇన్ స్టి ట్యూట్ లో రీసెర్చర్ గా ఉన్న 89 ఏళ్ళ జ్ఞాన వయో వృద్ధుడు ఎస్ సంబంధ శివాచార్య సంస్కృత సేవకు శైవ మత సిద్ధాంత వ్యాప్తికి రాష్ట్రపతి ప్రశంసా పత్ర0 అందజేశారు . .తాళగ్రంధ వ్రాత ప్రతులను చదవటం లో నిష్ణాతుడు .శైవాగమాలలో అనన్య సామాన్య ప్రతిభా సంపన్నుడు శైవాగమనాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ప్రచురించాడు .శైవ సిద్ధాంత పరిణామ చరిత్రను ఆమూలాగ్రంగా మధించి రాశాడు . పురాతన శైవ గ్రంధాలను 300 కు పైగా క్రోడీకరించి ,అనువదించిన మహా విద్వా0సుడు .రాష్ట్ర పతిపురస్కారం తోపాటు 5 లక్షల నగదు పారితోషికాన్ని స్వీ కరిస్తున్నప్పుడు ఆయన అతి వినయంగా ‘’నేను పూర్వ జన్మలో చేసుకొన్న పుణ్యఫలితమే ఈ సంస్కృత ప్రశంసా పత్ర0 పారితోషికం ‘’అన్నాడు .
1969 లో ఈ రీసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో చేరిన ఈ ఆచార్య కు ఫ్రెంచ్ ప్రభుత్వం అత్యుత్తమ సివిల్ అవార్డు ను2008 లో అందజేసింది .ఆలిండియా ఆది శైవ శివాచార్య సేవాసంఘం 2011 లో ‘’ఆగమ భూషణ ‘’పురస్కారమిచ్చింది .అర్చక కుటుంబలో 6-1-1927న జన్మించిన శివాచార్య ఏడవ ఏట నుంచి దేవాలయం లో అర్చనాదులు చేయటం లో సిద్ధ హస్తుడయ్యాడు .తండ్రి డి సుబ్రహ్మణ్య గురుక్కళ్ వద్ద వేదం శాస్త్రాలు వివిధ పండితులవద్ద నేర్చి మధురాంతకం లోని అహోబిల మఠ సంస్కృత పాఠశాలలో , తిరువయ్యారు ,మైలాపూర్ సంస్కృత కాలేజీ లలో చదివి చెన్నైలోని థియ సాఫికల్ సొసైటీ వ్రాత ప్రతుల డిపార్ట్ మెంట్ లో ,ప్రభుత్వ మన్యు స్క్రిప్ట్ లైబ్రరీ లో పనిచేసి తంజావూర్ సరసవతిమహల్ లైబ్రరీ తో సంబంధంకలిగి ,మైసూర్ ఓరియంటల్ లైబ్రరీలో పని చేసి తరువాత పాండిచ్చేరిలో ఈ రీసెర్చ్ సంస్థలో చేరారు . 8400 తాటాకు గ్రంధాలు ఈ ఇంస్టి ట్యూట్ లో ఉన్నాయని .అందులో ఎక్కువగా శైవాగమాగ్రంధాలేనని మిగిలినవి జ్యోతిష ,దక్షిణ భారత దేశ వైద్యగ్రంధాలు ,సంస్కృత సాహిత్య గ్రంధాలు ,తమిళ ఆధ్యాత్మిక గ్రంధాలు ఉన్నాయని చెప్పాడు
ఈ వ్రాతప్రతులు తమిళలిపి లో రాయబడిన సంస్కృతమే ఉందని మిగిలినవి శారదా ,నందినగరి , నెవారి తిలగరి గ్రంథ ,తమిళం తెలుగు ఒరియా ,తుళు గ్రంధాలు .ప్రతి తాళపత్ర కట్టలో అతి చిన్న అక్షరాలలో అనేక గ్రంధాలున్నాయని సంబంధ శివాచార్య చెప్పారు .దాదాపు 5 దశాబ్దాలుగా శివాచార్య రోజుకు 10 గంటలకు పైగా పనిచేస్తున్నారు .దేశం లోని వివిధ ప్రదేశాలనుంచివివిధ భాషలలో ఉన్న వ్రాత ప్రతులను తెప్పించి పరిశీలించి శుద్ధ ప్రతి తయారు చేసి ప్రచురిస్తున్నారు .ప్రస్తుతం ‘’సూక్ష్మా గమం ‘’పై కృషి చేస్తున్నారు .క్రిందటి శతాబ్దం లో సంస్కృతం గ్రంథ లిపి నుంచి దేవనాగరి లిపి లో రాయబడుతూ బాగా ప్రాచుర్యం లో ఉందని చెప్పారు స్వ0త ప్రింటింగ్ ప్రెస్ ను గ్రంథ ,దేవనాగరి లిపులతో ఏర్పాటు చేసుకొని ఎన్నెన్నో శైవాగమ గ్రంధాలు ప్రచురించారు .ప్రస్తుతం పంచాంగాలు ,తిరుకొయిల్ ,అనుష్టాన వాక్య పంచాంగం పై కృషి చేస్తున్నారు . స్యయ0 గా 15 ఏళ్ళనుంచి పబ్లిషింగ్ కంపెనీ నడుపుతున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17-కాంప్-షార్లెట్-అమెరికా
—

