గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
357-శౌనక శిక్ష కర్త -కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి (b. 1906)
కేరళలో కోతకార దగ్గర నంది కులం లో కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి1906 లో జన్మించాడు .త్రిపుంతూర్ సంస్కృత కాలేజీ లెక్చరర్ . శాస్త్ర దివాకర ,శాస్త్ర రత్న బిరుదులూ పొందాడు .శంకరాచార్య చరితం శౌనక శిక్ష ,వర్ణోచ్ఛరణ దీపికా ,ఋగ్వేద జ్యోతిషం సంస్కృతం లోను ఆది శంకరాచార్య అండ్ కాలడి ఇంగ్లిష్ లోను రచించాడు
358-జాతకాదేశ కర్త -శంకరం నంబూద్రిపాద్ కానిప్పయ్యూర్(1891
శంకరం నంబూద్రిపాద్ కానిప్పయ్యూర్ గొప్ప వాస్తు శిల్ప శాస్త్ర వేత్త .జ్యోతిష పండితుడు ,సంస్కృత విద్వామ్సుడు,సాంఘిక సంస్కర్త . 1891 లో త్రిచూర్ జిల్లా కున్నాంకులం లో జన్మించాడు .గురుకులం లో శాస్త్రాధ్యయనం చేశాడు .పంచాగమ ప్రెస్ పెట్టాడు యోగక్షేమ సభ నిర్వహించాడు .కోచి మహారాజు ‘’పండిత రత్న ‘’బిరుదునిచ్చాడు .జాతకాదేశం ,పంచ బోధ0 ,మనుష్యాలయ భాష ,తంత్ర సముచ్చయం సంస్కృత మళయాళ నిఘంటు ఔషధ నిఘంటు వంటి సంస్కృత గ్రంధాలు ,అనేక మళయాళ గ్రంధాలు రాశాడు .
359-వాసుదేవ కర్ణామృత కర్త -వాసుదేవన్ నంబూద్రి (1891-1947 )
1891 లో జన్మించిన వాసుదేవన్ నంబూద్రి కవి ,వక్త .ఆయన భాగవత ప్రవచనం ఆపాత మధురం .వేదం సకలశాస్త్రాలు కావ్యాలు నేర్చాడు .హరివిలాసం లో సంస్కృత విద్యాలయం స్థాపించాడు .ఈయన భాగవత కథా ప్రశస్తికి మెచ్చిరెండు చేతులకు కోచ్చిరాజు బంగారు వీర శృంఖలాలు బహుమానం ఇచ్చాడు.రవి వర్మ ‘’భక్త శిరోమణి ‘’బిరుదునిచ్చాడు .సంస్కృతం లో వాసుదేవ కర్ణామృతం ,భాగవత సంగ్రహం ,భాగవత సంగ్రహ గాధ ,శ్రీధరాచార్య భాగవత మకరందం రాధా మొదలైనవి రచించాడు .సామాన్యుడిని భాగవతం వైపుకు ఆయన లాగా ఆకర్షించేట్లు చేయగలిగిన నేర్పున్న వారెవరూ లేరు . ఆయనపై పి .హెచ్ డి చేశారు .మహా భాగవతోత్తముడు వాసుదేవన్ నంబూద్రి 1947 లో చనిపోయాడు .
360-భాష సౌందర్య లహరి స్తోత్ర కర్త -శ్రీధరన్ నంబూద్రి చ0ద్రమన (1917
1917 లో పుట్టిన శ్రీధరన్ నంబూద్రి చ0ద్రమన అసమనూర్ వాసి .ఆయన ‘’మాస్టర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ ‘’ జ్యోతిషం తో సహా ఆయనకు రాని శాస్త్రమే లేదు .కధాకళీ నేర్చి ప్రదర్శనలిచ్చారు .సంస్కృతం లో భాషా సౌందర్య లహరి స్తోత్రం ,కిరాతావాసిష్ఠం ,విశ్వా మిత్ర మేనకా రాశాడు .కవన కౌతూహలం మేగ జైన్ లో ఎక్కువగా రచనలు చేశాడు ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—

