బ్లండరే  బ్లండర్ 

బ్లండరే  బ్లండర్

ప్రఖ్యాత ఆస్ట్రో ఫిజిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్ 20 వ శతాబ్ది సైన్స్ గతి మార్చేశాడని అందరికి తెలిసిన విషయమే ఆయన ప్రయోగ శాలలో గడిపిన కాలం ప్రయోగాలు చేసిన కాలం చాలా చాలా తక్కువే .చెప్పిన సిద్ధాంతాన్ని రుజువు చేసిందీ లేదు  ఆయన ఒక థియరిస్ట్ మాత్రమే ఆయన మెదడే ఆయన ప్రయోగ శాల . ఆయనది ”థాట్  ఎక్స్పెరిమెంట్ ”పధ్ధతి .విషయాలను,ఊహలను  ఆలోచనబద్ధంగా విశ్లేషించి చెప్పటం అన్నమాట .జర్మనీలో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ప్రయోగ శాలా ప్రయోగాలకంటే బుద్ధి సూక్ష్మ ప్రయోగాలే ఎక్కువ ..జ్యు రిస్ట్  సైన్టిస్ట్ లు అరుదుగా ప్రయోగాలు చేసేవారు . అయిన్ స్టీన్ బుద్ధి బలం తో ఆలోచించి ఒక సిద్ధాంతం చెప్పేవాడు .అది నిజామాకాదా అని శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి నిజమే అని రుజువు చేసేవారు .మన దార్శనికులైన మహర్షులు చెప్పినట్లు” విజ్ఞాన మహర్షి ”అయిన్ స్టీన్ చెప్పేవాడు అదీ ఆయన ప్రత్యేకత ..ఆయన చెప్పిన జనరల్ ధీరీ ఆఫ్ రిలేటివిటీ కూడా ఇలా వచ్చిందే ఆయన చెప్పాకే పరిశోధనలో ఆయన చెప్పింది సత్యమని రుజువు చేసి చెప్పారు . 1916 లో విశ్వం లో ప్రతిదీ గ్రావిటీ ఆధారంగా కదులుతుంది అని చెప్పాడు .సైన్టిస్ట్ లు బుర్రలు బద్దలుకొట్టుకొని లాబ్ లో మోడల్స్ తయారు చేసి రుజువు చేసి ఎస్ బాస్ అన్నారు .  ..ఇలాంటిదే మరో గొప్ప విషయం గురించి ఇప్పుడు తెలుసుకొందాం 1926 లో ఆయన ప్రవచించిన గ్రావిటేషనల్ తరంగాల నిర్ధారణ కోసం ఒక ప్రత్యేక అబ్జర్వేటరీ  తయారు చేశారు . ఈ తరంగాలు అలలలాగా కాంతి వేగం తో స్పీడ్ టైంఅనే వస్త్రం లో అత్య0త తీవ్ర గ్రావిటేషనల్ డిస్టర్బన్స్స్ అంటే కల్లోలాలవల్ల  అంటే రెండు బ్లాక్ హొల్స్ అంటే కృష్ణ బిలాల  ఘర్షణ వలన ఉత్పన్నమౌతాయని ఆయన ఊహించి చెప్పింది నిజమేనని రుజువు చేశారు

   మనకు 1. 3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం లో ఉన్న గెలాక్షీ లోని బ్లాక్ హొల్స్ ,భూమిపై అప్పటికి ఇంకా ఏకకణ జీవరాశిమాత్రమే వృద్ధి చెందుతున్నకాలం లో ఢీకొనటం  వలన గ్రావిటేషనల్ తరంగాలు ఏర్పడ్డాయి .ఆ అలలు అంతరిక్షం లో అన్ని వైపులకు కదులుతూ ,ఇంకా 8 మిలియన్ల సంవత్సరాలకు భూమి సంక్లిష్ట జీవాన్ని ఏర్పరచే కాలానికిఅంటే పుష్పాలు , డైనోసార్లు ,ఎగిరే పక్షులు క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువులూ  ఏర్పడినప్పుడు ఈ తరంగాలు  ఏర్పడ్డాయి ఈ జీవరాశిని ప్రాధమిక జీవరాశి అంటాం ..వీటిలోంచి క్రమ పరిణామం జరిగి మాట్లాడే హోమో సేపియన్  లు వచ్చి వ్యవసాయం నాగరికత కల జీవులేర్పడ్డారు ..ఇదంతా చివరి 10 వేల  సంవత్సరాల క్రమ పరిణామ ఫలితమే. చివరికి 20 వ శతాబ్ది సైన్టిస్ట్ లు సాపేక్ష సిద్ధాంతాన్ని ఊహించి సిద్ధాంతపరచి గ్రావిటేషనల్ వేవ్స్ ఉన్నాయని చెప్పారు .వందేళ్ళతర్వాత టెక్నలాజి పెరిగి ఈ తరంగాలున్నాయని రుజువు చేసి ఆ ఊహకు నిజరూపం గా  తెలుసుకొన్నారు  .ఈ తరంగాలు గత 1. 3 బిలియన్ సంవత్సరాలనుండి భూమిని ఉతికి పారేస్తుంటే ఇప్పుడు మనం గుర్తించగలిగాం .అవును నిజంగాఅందరు అనుకున్నట్లు  అయిన్ స్టీన్ ఒక  చెడ్డ  గాడిదే -బాడ్ యాస్  .
   16 వ శతాబ్దపు వాడైన గణిత శాస్త్ర వేత్త  కోపర్నికస్ సూర్యు ని  చుట్టూ గ్రహాలూ క్రమ కక్ష్యా మార్గాలలో  తిరుగుతాయని మొదటి సారిగా చెప్పాడు  ..వర్తులాకార కక్ష్య కాదని దీర్ఘ వరుల అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అని తర్వాత తెలిసింది .ఇందులో కోపర్నికస్ చెప్పిన మూల విషయం పూర్తిగా సత్యమే అని రుజువైంది .ఇంతకంటే ఖచ్చితంగా చెప్పటానికి ఎక్కువ కాలం పట్టింది అంతే . అలాగే అయిన్ స్టీన్ సిద్ధాంతాలు కూడా కాలక్రమేణా రుజువై నిజమై ఆయన దార్ననికతకు జొహార్లుగా నిలిచాయి . 1931 లో వచ్చిన ”వన్ హండ్రెడ్ ఆధర్శ్ ఎగైనెస్ట్ అయిన్ స్టీన్ ”అనే పుస్తకం లో రచయిత ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు .-”నిజంగా అయిన్ స్టీన్ తప్పు చెప్పి ఉంటె వందమంది ఎందుకు ఒక్కడు చాలుకదా ”అన్నాడు .భావం ఐన్ స్టీన్ ను తప్పు పట్టె సాహసం వద్దు అని ..క్రమం గా సైన్స్ చరిత్రలో సరసమైన  బ్లండర్స్ ఎన్నో చోటు చేసుకొన్నాయి .
  గ్రావిటీ సిద్ధాంతాలలో ని సమీకరణాలలో అయిన్ స్టీన్ ”కాస్మ లాజికల్  కాన్ స్టెంట్”అనే పదాన్ని చెప్పి, దానికి గ్రీకు భాషలోని ”లాంబ్డా ”గుర్తును ఉపయోగించాడు .దీనివలన విశ్వ స్థిరత్వాన్ని తెలియ జెప్పాడన్నమాట .. అప్పటిదాకా మన విశ్వం క్రమంగా వ్యాప్తి చెందటం తప్ప ఇంకేపనీ  చేయదని  విశ్వ సించేవారు ..ఆ పైన ఊహించటం అసాధ్యం అనుకొనే వారు .కనుకలాంబ్డా ముఖ్యమైన పని అయిన్ స్టీన్ మోడల్ లో గ్రావిటీ ని వ్యతిరేకించటమే నని అందువలన విశ్వం సమతుల్యం లో ఉందని ,గ్రావిటీకి ఉన్న సహజమైన ఆకర్షణవలన విశ్వమంతా ఒక పెద్ద ద్రవ్యరాశిలోకి చేర్చబడింది అని భావించారు  .ఈ సందర్భం లోనే అయిన్ స్టీన్ ”విశ్వం వ్యాప్తి చెందదు ,సంకోచమూ చెందదు ”అని దార్శనికత  తో స్పష్టంగా చెప్పాడు
  దీనిపై రష్యా భౌతిక శాస్త్ర వేత్త అలెక్సాఅండర్ ఫ్రీడ్ మన్ కొంతపరిశోధన చేసి అయిన్ స్టీన్ చెప్పిన విశ్వం సమతుల్యం లో ఉన్నప్పటికీ అది అస్థిరంగా ఉంటుందని గణిత శాస్త్ర ఈక్వేషన్లద్వారా తెలియ జేశాడు ..ఒక శిఖరాగ్రాన కొనపైఉన్న బంతి ఏమాత్రం ఒడిదుడుకు వచ్చినా జారీ ఏదో ఒక ప్రక్కకు ఒరిగి పడిపోయినట్లులేక పెన్సిల్ ముక్కుమీద ఏ చిన్న పదార్ధం పెట్టినా అస్థిరంగా ఉన్నట్లు విశ్వం ఉంది అంటాడు . కనుక అయిన్ స్టీన్ విశ్వం వ్యాప్తికి ,పతనానికి మధ్య డోలాందో దోళనలో ఉందని  భావించాడు .  .అయిన్ స్టీన్ చెప్పింది కొత్తసిద్ధాంతం ,దానికేదో పేరు పెట్టినంత మాత్రాన అది సత్యం కానేరదు అనీ దబాయించాడు .కానీ  -లాంబ్డా అనేది ప్రకృతిలో ఉన్న నెగటివ్ గ్రావిటేషనల్ ఫోర్స్  అనీ  భౌతిక ప్రపంచం లో దీనికి సంబంధిన మరొక సమాన హోదాగల దేదీ(కౌంటర్ పార్ట్  ) లేదని  అయిన్ స్టీన్ కి బాగా తెలుసు .
   సశేషం
    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-17- కాంప్-షార్లెట్-అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.