గుగ్గురు దర్శనం -5(చివరిభాగ0 )
సౌర శాస్త్రం (సోలార్ సైన్స్ )యోగ శాస్త్రాలలో అత్యాధునికమైనది .మానవ బాధానివారణకు ఉపయోగపడేది ..పరమగురువు చెప్పినప్రకారం అదొక ప్రత్యేక ధ్యాన విధానం.మానవుని లోని సౌరవలయం (సోలార్ ప్లెక్సెస్ ) పై ఆధార పడి ఉంటుంది . భౌతిక మానసిక వ్యాధుల నివారణకు అత్యుత్తమ విధానం . మానవ శరీరం లో సౌర వలయం అతిపెద్ద జాలం దాని కేంద్రాన్ని మణిపూరకచక్రం అంటారు . ఈ చక్రం పై ధ్యానం చేయటానికి అనేక పద్ధతులున్నాయి ,కానీ ఆధునిక ప్రాణాయామం సౌర శాస్త్రాన్ని ఉపయోగించి చేస్తే ప్రాణశక్తికంటే ఉన్నతమైన ఒక గొప్ప శక్తి స్థాయికి చేరుస్తుంది .ఈ స్థాయిలో శక్తి లయలను ఉదయ సూర్యుని పైగాని ,ఉదరాగ్ని పై కానీ ధ్యాస ఉంచి అధ్యయనం చేయాలి ..ఈ నివారక విధానం ఉపనిషత్తులలో వివరించబడినది ,. అతికొద్ది మంది పండితులకు వేత్తలకు మాత్రమే ఇది తెలుసు . ఈ శాస్త్రాన్ని తెలుసుకొంటే భౌతిక ,ప్రాణిక ,మానసిక స్థాయిలపై ఆధిపత్యం ,నియంత్రణ లభిస్తుంది .దీనీపై ప్రవీణుడైనవాడు ఆశక్తిని ప్రసారం చేసి ఎవరి రోగాలనైనా,యెంత దూరం లో ఉన్నా నివారించి ఆరోగ్యం చేకూర్చగలడు .
తనగురువు బెంగాలీ బాబా నుండి స్వామిరామా అన్నిశాస్త్రీయ విద్యలలో గొప్పదైన ‘’శ్రీ విద్య ‘’ను పొందాడు . ఇది టిబెట్ లోని అన్నిమండలాల లోను ,భారతీయ సాహిత్యం లోను తల్లి విద్య లాంటిది .ఆధునిక సాధనలో సాధకుడు శ్రీ యంత్రం లోని వివిధ భాగాలపై ద్రుష్టి కేంద్రీకరించే విధానాలు తెలుసుకొని అప్పుడు కేంద్రం పై దృష్టినిలిపే ప్రయత్నం చేస్తాడు .ఇది ఆధ్యాత్మిక శక్తికేంద్రమైన బిందువు ఇక్కడే శివుడు, శక్తి(శివా శివులు ) కలిసి ఐక్యమై ఉంటారు . మలబారు కొండలపై ఈ విద్యను తనకు గురువు నేర్పినా ‘’బిందు భేదనం ‘’సాధన మాత్రం బోధించలేదు .ఈ పర దేవత ఆరాధనా విధానం లో మహర్షులు చెప్పిన విజ్ఞానం అంతా ఉంటుంది . దీనికోసం గ్రంధాలు చదవాల్సిందే .కానీప్రజ్ఞానిధియైన గురువే మార్గ దర్శకత్వం చేయాలి .అప్పుడే సార్ధకమవుతుంది .ఈ ఉన్నత విద్య తెలిసినవారు వేళ్ళమీద లెక్కింపతగినంత మందిమాత్రమే ఉన్నారు .మన సంప్రదాయం శ్రీ విద్యను బాగానే బోధిస్తుంది .పరమగురుదర్శనం ఆయన బోధించిన ఆధునిక యోగం వలన తాను టిబెట్ కు వచ్చిన పని సార్ధకమైందని సంతృప్తి చెందాడు స్వామి రామా ..
పరమగురువు వద్ద టిబెట్ లో నెలన్నర ఉండి అధ్యయనం చేసిన తర్వాత ఒక రోజు గుహ బయట కూర్చుని తన యాత్రానుభవాలను రాస్తున్న డైరీ జ్ఞాపకం వచ్చి అది ఇక్కడ తనదగ్గర ఉంటె ఎంతబాగుండును ఈ విషయాలన్నీ అందులో రాసుకొనే వాడినికాదా అని మనసులో అనుకొన్నాడు ..లోపలున్న పరమగురువు చిరునవ్వుతో లోపలి రమ్మని పిలిచి ‘’నీ డైరీ నీకోసం తెప్పించగలను .దాని అవసరం లేదా ?’’అని అడిగితె ఆశ్చర్యపోయినా ఇలాంటి అద్భుతాలు మహాత్ములకు చాలా సునాయాసం అని గ్రహించి ,ఇలాంటివి తానూ చాలాచూశాడుకానుక అద్భుతం అనిపించలేదురామాకు …’’అవును స్వామీ కొన్ని పెన్సిళ్లు కూడా కావాలి ‘’అన్నాడు ..స్వామిరామా తాను రాస్తున్న డైరీని ఉత్తరభారతం లోని నైనిటాల్ కొండలలో ఉన్న భవాలీ శానిటోరియం లో వదిలేసి వచ్చాడు . అకస్మాత్తుగా 475 పేజీలతో ఉన్న పెద్ద డైరీ మూడు పెన్సిళ్ళతో అక్కడ ప్రత్యక్షమయ్యాయి .రామా సంతోషించాడుకాని ఆశ్చర్యపడలేదు .తనకు ఆధ్యాత్మికంగా ఏదైనా కొత్త విషయం బోధించమని అడిగాడు .
నవ్విన పరమగురువు ‘’నీకు అది అంతా బోధించాను .దాన్ని పునశ్చరణ చేస్తూ మనసులో నిలుపుకోవాలి .నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి .నువ్వు ఇప్పుడు లాసాకు వెళ్లి అక్కడనుండి ఇండియా వెళ్ళు .అనగా ‘’నేను ఇండియా వెళ్ళటం కుదరదు వెడితే నన్ను అరెస్ట్ చేస్తారు ‘’అన్నాడు .వెంటనే గుగ్గురువు ‘’త్వరలో ఇండియాకు స్వతంత్రం రాబోతోంది .నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే విపరీతమైన మంచు హిమానీ నదాలు నిన్ను అడుగుకూడా ముందుకు వేయనియ్యవు ‘’అని హెచ్చరించి పంపాడు . మళ్ళీ ఆయన దర్శనం కాలేదు .కానీ కొద్దికాలం తర్వాత ఆయన శిష్యులకు వీడ్కోలు పలికి అదృశ్యమై పోయాడని విన్నాడు .కొందరు ఆయన తా నక్ పురా వద్ద ప్రవహించే కాళీ గంగానదిపై పుష్పహారాలతో తేలుతూ ఉండటం చూశామని చెప్పారు . తన గురువు బెంగాలీ బాబాను పరమగురువు బ్రతికి ఉన్నారా అని అడిగితె చిరునవ్వు నవ్వి ‘’అది నీ అంతట నువ్వే తెలుసుకోవాలి ‘’అని మాత్రమే అన్నాడు .
ఏమి జరుగుతుందో అనే భయంతో లాసా చేరి పూర్వపు లామా కు అతిధిగా ఉండి జూన్ 1947 న ఇండియా కు బయల్దేరాడు ..రెండు కంచరగాడిదలు ఇద్దరుగైడ్ ల సాయం తో ఒక నెల ప్రయాణించి దట్టంగా మంచు తో నిండిన కనుమలకు దాటి సిక్కిం రాజధాని గాంగ్ కాక్ చేరాడు అక్కడికి చేరటానికి మూడురోజుల ముందే భారత దేశానికి స్వతంత్రం వచ్చింది .గాంగ్ కాక్ లో ఈశాన్యాన ఇప్పటికీ ఉన్న ఒక మొనాస్టరీ లో ఉన్నాడు .అక్కడ బౌద్ధ యోగి బుద్ధగయ లో చాలాకాలం ఉండి సంస్కృతం అభ్యసించిన ఒక ప్రసిద్ధ లామాను దర్శించి .ఆయనతో ఉన్నాడు .సాధారణంగా బౌద్ధం శంకరాచార్యులవారిని విమర్శిస్తుంది .కానీ ఈ మహా పండితుడుమాత్రం భారతీయ గ్రంథాలనుండి అనేక ఉదాహరణలిస్తూ సంభాషిస్తాడు బౌద్ధం శంకరాద్వైతం లను సమన్వయ పరచి చక్కగా మాట్లాడతాడు .ఈ లామా ‘’పరమోన్నత సత్య0 విషయం లో ఈ రెండు సిద్ధాంతాలలో భేదం ఏమీలేదు . ఉన్నభేదం శబ్దాలకు మాటలకు సంబంధించిమాత్రమే .. ఈయన ఇండియా టిబెట్ జపాన్ చైనా దక్షిణాసియా లోని బౌద్ధ అనుయాయుల గురించి బాధపడుతూ ‘’వీళ్ళు బౌద్ధ ధ్యాన పధ్ధతి ,ఆత్మజ్ఞాన సమ్పత్తిని పూర్తిగా వదిలేసి కర్మకాండలలో కూరుకు పోయారు .ఇదిగౌతమబుద్ధుడు బోధించిన అసలైన బౌద్ధ విధానం కాదు. ఈ ఆధునిక పోకడల ను నివారించటానికి కల్తీ లేని అసలైన బౌద్ధం అదృశ్యమై పోయింది .వేలాది బౌద్ధ దేవాలయాలు బౌద్ధాలయమాలు పూజారులు సన్యాసులు కర్మ కాండలకే పరిమితమై పోవటం బాధ కలిగిస్తోంది .బుద్ధుడు చెప్పిన ‘’మీ దీపం మీరే వెలిగించుకోండి .ఎవరూ మీకు విముక్తిని ఇవ్వలేరు .మిమ్మల్ని మీరు తెలుసుకోండి .నిర్వాణం పొందండి అప్పుడు మీరే బుద్ధులౌతారు ‘’అని బోధించినదానికి పరమ విరుద్ధంగా ఉంది ‘’అని ఆ లామా ఆవేదన చెందాడు .
ఈ లామా ఆత్మజ్ఞానం మరచి కర్మకాండలలో కూరుకు పోయిన సరైన అద్వైతాన్ని బోధించని శంకర అనుచరులైన అద్వైతులనుకూడా విమర్శించాడు .’’ఇలాంటి బోధనలు మనుషులను గందర గోళ పరుస్తాయి ..శంకరుల వేదాంతం వేద బౌద్ధ వేదాంత సమన్వయము .’’అసగ్రా ఇదం అగ్ర అసిత్ ‘’అంటే దృశ్య ప్రపంచం శూన్యం లో నుంచి ఉద్భవించింది ‘’మొదలైన సంస్కృత శ్లోకాను మాండూక్య ఉపనిషత్ ,బౌద్ధ విద్వాన్సుడు ఈశ్వర కృష్ణుని సాంఖ్య కారిక ల నుండి ఉదహరిస్తూ తన భావాలను వ్యక్తం చేసి చెప్పాడు స్వామి రామాకు.అనేక రోజులు రామాకు వేదాంత బోధ చేసి స్వామిరామాను హిమాలయాలలో ఉన్న తన బెంగాలీ గురువు ను త్వరగా కలుసుకోమని చెప్పి వీడ్కోలు పలికి పంపించాడు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—

