గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
382-సంస్కృత అంతర్జాలం ప్రవేశపెట్టిన -వి.ఆర్.పంచముఖి (1936
వాడిరాజాచార్య రాఘవాచార్య పంచముఖి లేక వాచస్పతి పంచముఖి 17-9-1936 న కర్ణాటకలోని ధార్వార్ లో జన్మించాడు . తండ్రి వైద్య రత్న ఆర్ ఎస్ .పంచముఖి .తల్లి కమలాబాయి .తండ్రి ప్రసిద్ధ ఎపిగ్రఫిస్ట్ ,ఆర్కియాలజిస్ట్ ఇండాలజిస్ట్ చారిత్రాత్మక పరిశోధనలో జీవితమంతా గడిపినవాడు .దాస సాహిత్య పరిశోధనలో పండిపోయినవాడు .తండ్రివద్దనే వాడిరాజు సంస్కృతం తత్వ శాస్త్రం అభ్యసించాడు . 1956 లో కర్ణాటక యుని వర్సిటీ నుండి సంస్కృతం గణితం లలో 82. 5 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ రాంక్ సాధించాడు .రెండేళ్ళతర్వాత బాంబే యుని వర్సిటీనుండి ఎకనామిక్స్ లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రాంక్ తోపాటు గోల్డ్ మెడల్ పొందాడు . 1963లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ‘’అప్లికేషన్ ఆఫ్ గేమ్ ధీరీ ఆఫ్ ఎకనామిక్స్ పాలిసీ పై దిసీస్ రాసి పిహెచ్.డి .అందుకొన్నాడు .
ఆర్ధిక రంగం లో పంచముఖి సేవలు నిరుపమానమైనవి .నోబెల్ లారయట్ జాన్ టిన్ బెర్జిన్ తో ను జెనీవాలో టా0జానియా మాజీ ప్రెసిడెంట్ జూలియస్ నైరేరీ తోను కలిసి పనిచేశాడు .అలీన దేశాల అభివృద్ధి చెందుతున్న దేశాలకు రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టం తయారు చేసిన ఘనత సాధించాడు .ఇండియా ప్లాంయింగ్ కమిటీ సెక్రెటరీగా 1977లో పనిచేశాడు .దీనివలన ఆర్ధిక సరళీకరణ విధానం ధ్రువ పడటానికి సహకరించాడు .
ఆర్థికరంగం లో దూసుకు పోతున్నా సంప్రదాయంగా వచ్చిన సంస్కృతం లోనూ అద్వితీయ ప్రతిభ ప్రదర్శించి అనేక పుస్తకాలు కవితలు సంస్కృతం లో రచించాడు పంచముఖి .తిరుపతి సంస్కృత విద్యాపీఠానికి 1998 నుండి 2008 వరకు రెండుసార్లు ఛాన్సలర్ అయ్యాడు .శ్రీ వెంకటేశ్వర వేదం విశ్వ విద్యాలయ రాజ్యాంగ నిర్మాణం లో స్థాపనలో విశేష కృషి చేశాడు .సంస్కృత -సైన్స్ ఎక్సిబిషన్ నిర్వహణలో ,సంస్కృత నెట్ ఏర్పాటులో ,ప్రాచీన సంస్కృత గ్రంధాల డిజిటలీకరణలో ఆయన సేవ అపారం .భగవద్గీత పైనా మేనేజ్ మెంట్ పైనా విశేష కృషి చేశాడు .సంస్కృతాన్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో బోధించే ఆలోచన చేసి అమలులోకి తెచ్చాడు .
పంచముఖి సంస్కృతం లో -1-భారతీయ ఆర్ధిక సర్వేక్షణ 2-కావ్య కుసుమాకర 3-బ్రహ్మ సూత్ర దీపికా 4-విచార వైభవం 5-భారతీయ అర్ధ శాస్త్ర మొదలైనవి 12రాశాడు .
ఎకనామిక్స్ లో -ట్రేడ్ పాలిసీస్ ఆఫ్ ఇండియా ,ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ ,టీచింగ్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా ,ఫిస్కల్ మేనేజ్ మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ టు వార్డ్స్ యాన్ ఏషియన్ ఎకనామిక్ ఎరా మొదలైన 15 గ్రంధాలురాశాడు .ఆయన ప్రతిభకు తగిన పదవులు వరించాయి -ఇండియన్ కౌన్సిలాఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ చైర్మన్ గా ,ఇండియన్ ఎకనామిక్స్ జర్నల్ మేనేజర్ గా ,8 వ వరల్డ్ ఎకనామిక్స్ కాంగ్రెస్ కన్వీనర్ గా ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కు ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా అఖిలభారత మధ్వ సమ్మేళనం ప్రెసిడెంట్ గా ఇవికాక మరో 30సంస్థలలో సభ్యుడుగా సలహాదారుగా గౌరవాధ్యక్షుడుగా ఉన్నాడు .
2003 లో భారత రాష్ట్ర పతి నుంచి సంస్కృతం లో ప్రతిభా పురస్కారం ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ -ఢిల్లీ నుంచి విశిష్ట సంస్కృత సేవా వ్రతి ,ఢిల్లీ లాల్ బహదూర్ యుని వర్సిటీనుండి వాచస్పతి పురస్కారం ,విశ్వేశ్వ రయ్య ప్రశస్తిపురస్కారం ,కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం ,గురుసార్వ భౌమ రాఘవేంద్ర అనుగ్రహపురస్కారం ,విశాఖ లోని గీతం యుని వర్సిటీ పురస్కారం వంటివి ఎన్నో బహుముఖ సేవకు పంచముఖిని వరించాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-17- కాంప్-షార్లెట్-అమెరికా
— ![]()

