రెండేళ్ల క్రితం ఫోన్ ద్వారా పరిచయం అయిన శ్రీమతి గబ్బిట గిరిజ తరచూ ఫోన్ చేసి మాట్లాడుతూవుండటం ,నన్ను బాబాయి గారు అనీ మా ఆవిడను పిన్ని గారూలని సంబోధించి పలకరించడం అమెరికా లో ఉన్నా రెండుమూడు సార్లు వాట్స్ అప్ లో మాట్లాడటం ఇండియా వచ్చాక మూడు సార్లు ఫోన్ చేయట0 ,తాను ఆర్ధోపెడిక్ పేషేంట్ అవటం ,82 ఏళ్ళ అత్తగారి సేవ లో ప్రతిక్షణం ఉండటం ,మన బ్లాగులను చదువుతూ ఉండటం వలన ఆమె మా గబ్బిట వారి ఆడబడుచు అవటం కూడా కారణమై ఈ రోజు 11-10-17 బుధవారం సాయంత్రం 4-30 కు మా దంపతులం మా పెద్దకోడలు శ్రీమతి సమత కాబ్ లో నాగోలు లోని వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు కాలక్షేపం చేసాం . ఆమె అత్తవారింటిపేరు రాయలసీమ ”గుత్తి అగ్రహారం ”. భర్త శ్రీ రిషీకేశ్ ఐబి ఏం ఉద్యోగి . గిరిజ కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరున్న యలమర్రు లేక కూరాడ కు చెందిన గబ్బిట వారి ఆడబడుచు .గుత్తి అగ్రహారం వారి కోడలు .గుడివాడ దగ్గర బేత వోలు లోని రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ పచ్చళ్ళ శర్మ గారి మేనకోడలు . శర్మగారి ద్వారా నా సంగతి తెలుసుకొని ఆయన ఎప్పుడూ నా గురించి చెపుతూ ఉండటం తో బ్లాగ్ లో గుర్తుపట్టి అభిమాని అయి తరచూ పలకరించేది . అందుకే ఇవాళ వాళ్ళ ఇంటికి ప్రత్యేకంగా వెళ్లాం ఆమె పై ఉన్న అభిమానం తో .
—

