మనవి మాటలు మూడు
మనవి-1-నేను రచించి సరసభారతి ప్రచురించిన ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం’’ఆవిష్కరణ సందర్భంగా ‘’గీర్వాణ భాషా వైభవం ‘’శీర్షికతో 4-12-2016 న నిర్వహించిన” పద్య కవి సమ్మేళనం” లోని కవితలను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మూడవ భాగం’’ లో చివర” అనుబంధం”గా చేర్చి ముద్రిస్తున్నామని ., .కవులు తమ అమూల్య భావాలను పద్య సుమ మాలగా రూపొందించి గీర్వాణ భాషా సరస్వతి కి అమూల్యా భరణం గా సమర్పించారు . వారందరికీ సరసభారతి కృతజ్ఞతలు తెలియ జేస్తోంది .
ఈ సురభిళ సుమమాలను సరస్వతీ పుత్రులు ,నడయాడే దైవం కంచి జగద్గురువులు ,పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ మహా స్వాములకు సవినయంగా అంకితమిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .
2-సరసభారతి 26-3-17 ఆదివారం నిర్వహించిన శ్రీ హేవిళంబి ఉగాది వేడుకల సందర్భం గా””వసుధైక కుటుంబం ”శీర్షికగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం లోని కవితలను పుస్తకరూపం లో తెస్తున్న సంగతి మీకు తెలుసు .ఇందులో ప్రసిద్ధ అనుభూతికవి కీ శే దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ”వసుధైక గీతం ”కవితను కూడా చేర్చికవితా సంకలనాన్ని శ్రీ తిలక్ కు అంకితమిస్తున్నామని తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది .
3– సరసభారతి అమెరికాలోని షార్లెట్ లో 1-10-17 ఆదివారం 108 వ కార్య క్రమంగానిర్వహించిన ”దసరా సరదా సాహితీ కదంబం ”లో ఎల్లలు లేని జగతి పై శ్రీ తిలక్అద్భుతంగా రాసిన ‘వసుధైక గీతం ”చదివి ఆయన ఫోటో ను వేదికపై అలంకరింపజేసి శ్రీ తిలక్ కు ఆ కార్యక్రమం అంకితం చేసిన సంగతి మీకు జ్ఞాపకం ఉండేఉంటుంది . శ్రీ తిలక్ కు ఈ రకమైన ఘన నివాళి అర్పించటం సరసభారతి అదృష్టం గా భావిస్తున్నాం –
దీపావళి శుభాకాంక్షలతో –
దుర్గా ప్రసాద్
—

