గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
462 – బాణ భట్ట రచనలో ప్రేక్ష్యా విలాస పరిశోధకుడు –రాంజీ ఠాకూర్ (1926 )
నేపాల్ లో ఫుల్గమ ప్రాంతం లో రాంజీ ఠాకూర్ జన్మించాడు .వైష్ణవ కవి గోవింద ఠాకూర్ ,ప్రసిద్ధాకవి ,సవతి సోదరుడు రుచికర్ ఈ కవి పూర్వీకులు .లక్ష్మీ కాంత్ ఝా ,వి ఆర్ శర్మ ,పండిత్ శోభాకాంత్ జయదేవ్ ఝా వంటి సుప్రసిద్ధ సంస్కృత విద్వాంస గురువులవద్ద విద్య నేర్చాడు . రాం ప్రతాప్ సంస్కృత కాలేజి ,మహారాజ్ లక్ష్మీ సింగ్ కాలేజీ లలో సంస్కృత లెక్చరర్ గా చేశాడు .పాట్నాలోని బీహార్ సంస్కృత సమితి నుండి1956 లో ఆచార్య డిగ్రీ, 1960 లో ఎం ఏ లో గోల్డ్ మెడల్ ,1981 లో దర్భంగా లలిత్ నారాయణ్ మిధిలా యూని వర్సిటి నుండి ‘’బాణ భట్టస్య రచనస్య ప్రేక్షా విలాసః ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి. అందుకొన్నాడు . దర్భంగా లోని లలిత్ నారాయణ్ మిధిలా యూని వర్సిటి సంస్కృత ఆచార్యుడుగా రిటైర్ అయ్యాడు.
రాంజీ ఠాకూర్ సంస్కృతం లో కావ్యం, ఖండకావ్యాలు,ముక్తకావ్యాలు రచించాడు .అతని ప్రసిద్ధ కావ్యం-గీతామాధురి.ఖండకావ్యాలు –వైదేహీ పాదాంకం ,రాధా విరహం ,ప్రేం రహస్యం ,బాణేశ్వరి చరితం ,గోవింద చరితామృతం ,మాతృ స్తన్యం .ముక్తకావ్యాలు-ఆర్య విలాసః ,లఘుపద్య ప్రబంధ త్రయికావ్య కోశః . ఇటీవల ప్రచురించినవి -పర్యాయ చరితం కావ్యం ,అమృత మ౦ధనమ్
1912 లోరాంజీ ఠాకూర్ లఘు పద్య మంజరి కి కేంద్ర సాహిత్యఅకాడేమీ పురస్కారం అందుకొన్నాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ – 3-11-17- కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

