– ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు గ్రంథ ప్రాయోజకులు సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ జననం –విద్యా భ్యాసం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపం లోని కుమ్మమూరు గ్రామం లో శ్రీ మైనేని వెంకట నరసయ్య ,,శ్రీమతి సౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935న ఆరవసంతానం గా జన్మించారు .వీరి అన్నగార్లు స్వర్గీయ సూర్య నారాయణ ,స్వర్గీయ తాతయ్య అనే రాజ శేఖర్ ,అక్కయ్యలు శ్రీమతి అన్నపూర్ణాదేవి ,స్వర్గీయ శ్రీమతి కనక దుర్గా దేవి,శ్రీమతి భారతీదేవి .చెల్లెళ్ళు శ్రీమతి హేమలతా దేవి ,శ్రీమతి సత్యవాణి .బాల్యం లోనే పిల్లల చదువుకోసం తండ్రిగారు కుటుంబాన్ని ఉయ్యూరు కు మార్చారు .ప్రాధమిక విద్య ను గోపాలకృష్ణ గారు కీ శే కోట సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద నేర్చారు .కోటమాస్టారు అంటే మైనేని వారికి అమితమైన గౌరవం భక్తీ .వారి పేరు చెబితే పులకి౦చి పోతారు ..1950వరకు తాడంకిస్కూల్ లోచదివి ఎస్. ఎస్. ఎల్. సి .పాసై ,తరువాత విజయవాడ ఎస్ .ఆర్ .ఆర్ .కాలేజి లో ఇంటర్ చదివి 1954లో ఉత్తీర్ణులయ్యారు .కొంతకాలం నాటకాలు ,సోషలిస్ట్ పార్టీ సభలతో కాలేజీకి డుమ్మా కొట్టారు ..బెజవాడ హోటల్ వర్కర్స్ యూనియన్ తో చేరి ,వర్కర్ల జీవన పరిస్థితులను మెరుగు పరచటానికి వారిని యాజమాన్యం గౌరవం గా చూడటానికి కృషిచేశారు . ఉన్నత విద్య –వివాహం –మొదటిసారి అమెరికా ప్రయాణం 1953-54లో ఉయ్యూరులో డ్రమాటిక్ అసోసియేషన్ స్థాపించి ఆత్రేయ గారి యెన్ .జి.వో నాటికను ప్రాక్టీస్ చేశారు .1955-58కాలం లో విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీమెయిన్ సబ్జెక్ట్ గా ఎడ్యుకేషనల్,సోషల్ అండ్ చైల్డ్ సైకాలజీ మైనర్ సబ్జెక్ట్ లుగా తీసుకొని చదివి 1959లో ఏం.ఏ .సెకండ్ క్లాస్ లో పాసైనారు .1960లో గుంటూరు జిల్లా రేపల్లెతాలూకానల్లూరు గ్రామవాసి కీ శే .పరుచూరి భావ నారాయణ చౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి సత్య వతి ని వివాహం చేసుకొన్నారు .1960-61లో అమెరికా వెళ్లిమిన్నియా పోలీస్ లోని మిన్నెసోటా యూని వర్సిటి లో ఎడ్యుకేషన్ సైకాలజీ ,స్టాటిస్టిక్స్ లో కొంత కోర్సు వర్క్ చేశారు .గోపాల కృష్ణ గారు 1961-62లో మాడిసన్ లోని విస్కాన్సిన్విశ్వ విద్యాలయం లో ఇండియన్ స్టడీస్ కు అనుబంధం గా ఉన్న తెలుగు గ్రంధాలను కేటలాగ్ చేయటానికి సహాయ పడుతూ ,కొన్ని లైబ్రరీ కోర్సులు పూర్తి చేశారు . .1962లోఇండియా తిరిగి వచ్చికొంతకాలం .చిరు ఉద్యోగాలు చేస్తూ ,కొంతకాలం నిరుద్యోగి గా ఉంటూ ,కొంతకాలం ఉయ్యూరు కే సి పిలో అతి చిన్న ఉద్యోగం చేసి,స్థిరమైన రాబడి లేకకుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ 1968వరకు ఆరేళ్ళు గడిపారు . తలపు తట్టిన అదృష్టం లైబ్రరీ సైన్స్ కోర్స్ –ఉద్యోగం అదృష్టం తలుపు తట్టగా 1969లో అమెరికా వెళ్లి టెన్నేసిలో లైబ్రరీ సైన్స్ లో ఎం..ఎస్..చేసి,,అందరి ఆదరాభిమానాలు పొంది డిగ్రీ తీసుకొని సంతృప్తి చెందారు .సుమారు ఏడేళ్ళుపడిన మానసిక వేదనకు ,శారీరక శ్రమకు విముక్తికలిగింది . కోర్సులో ఉండగానే కెంటకీలోని లూవిల్ యూని వర్సిటి లో కేటలాగర్ అండ్ ఇన్ స్త్రక్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కు ఎంపికై,పదవీ బాధ్యతలు చేబట్టారు .అమెరికన్ లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ ,న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరి ,ఇతర విశ్వ విద్యాలయాల లైబ్రరీలను సందర్శించారు . .మెషీన్ రీడబుల్ కేట లాగింగ్ కు ఇన్హౌస్ ట్రెయినింగ్ ఇచ్చారు .ఆంగ్లో అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు .ఆబ్ స్ట్రాక్ట్ ఆఫ్ అకడేమిక్ ప్లాన్ అండ్ బిల్డింగ్ ప్రోగ్రాం కు సహకరించారు .లాంగ్ రేంజ్ బడ్జెట్,పర్సనల్ అండ్ రిసోర్సెస్ ప్రొజెక్షన్ కు సహాయకుడిగా సేవలందించారు .యూనివర్సిటి ఆఫ్ లూయీ విల్ లైబ్రరి సిస్టం కు టెక్నికల్ సిస్టం అందించటం లో ప్రముఖ పాత్ర పోషించారు .మైనేనిగారి బాస్ ప్రోత్సాహం తో కేటలాగింగ్ కన్సల్టంట్ గా 1974నుంచి 76వరకు రెండేళ్ళు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్ట్ నాక్స్ లైబ్రరీ ,నేషనల్ ఆర్కైవ్స్ ,సన్స్ఆఫ్ అమెరికన్ రివల్యూషన్ లో 1976-78 వరకుసలహా దారుగా ,కెంటకీ లోని లూయీ విల్ లో ఉన్న లైబ్రరీ ఆఫ్ వరల్డ్ ఫెయిత్ సెంటర్ లో 1980-82 వరకు ఏంతో సంతృప్తిగా సేవలందించారు . తనపై బాస్ కున్న నమ్మకానికి ఎంతో కృతజ్ఞత చూపిస్తారు శ్రీ గోపాల కృష్ణ ..,పై ఉద్యోగులచేత ప్రశంసలు ,సహోద్యోగుల చేత ఆత్మీయ మిత్రులుగా అభినందనలుపొందారు .1997లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ స్పెషల్ అసిస్టంట్ టు యూని వర్సిటి లైబ్రేరియన్ గా పదవీ విరమణ చేశారు . కుటుంబం మొదటి నుండి సత్యం ధర్మం న్యాయం లపై మక్కువ ఉన్న గోపాల కృష్ణగారు కెంటకీ సదరన్ బాప్టిస్ట్ దియలాజికల్ సెమినరి,ముర్రె స్టేట్ యూని వర్సిటీలలో హిందూ ధర్మం పైప్రసంగాలు చేశారు .లూయీవిల్ యూని వర్సిటి లో రెలిజియన్ స్టడీ డిపార్ట్ మెంట్ ఆహ్వానం పై బౌద్ధ ధర్మం పై దార్మికోపన్యాసమిచ్చి అందరి మన్ననలు అందుకొన్నారు .అతిధులనుగౌరవం గా ఆదరించటం .బాధితులకు సాను భూతి సహవేదనలనుచూపటం మైనేని వారికి తలిదండ్రుల నుండి సంక్రమించిన గొప్ప సుగుణం .గోపాల కృష్ణ దంపతులకు ఇద్దరుకుమారులు .పెద్దకుమారుడు శ్రీ కృష్ణ –కోడలు శ్రీమతి రమ.మనుమ రాళ్ళు ఛి శ్రేయ ,సెరీన.చిన్న కుమారుడు శ్రీ రవి .కోడలు శ్రీమతి కవిత .మనుమడు ఛి కిరణ్ .మనుమరాళ్ళు ఛిరియా ,కరీనా . మనసాంప్రదాయం ప్రకారం వివాహాలు చేసుకొని సంతానం పొంది ,అమెరికాలోనే తాము ఎంచుకొన్న వృత్తిలో రాణిస్తూ ,తలిదండ్రులను కనిపెడుతూ ఆదర్శంగా ఉంటూసంతోష పెడుతున్నారు .గోపాల కృష్ణ గారు భార్య శ్రీమతి సత్యవతి గారితో అనుకూల దాంపత్యం వలన సుఖ సౌఖ్య ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు . ఉయ్యూరుపై అభిమానం –వితరణ అమెరికాలో ఉన్నా గోపాల కృష్ణ గారికి ఉయ్యూరు పై అభిమాన ,మమకారాలు ఏ మాత్రమూతగ్గ లేదు .ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకొంటూనే ఉంటారు .దక్షిణ భారతదేశం లోనే మొట్ట మొదటి సారిగా ఏర్పడిన ఉయ్యూరు ఏ .సి .లైబ్రరీకి వారి తలిదండ్రులు కీ శే మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతి సౌభాగ్యమ్మ గార్ల పేరు మీద 5లక్షల రూపాయలు భూరివిరాళం ఇచ్చి మరో లక్ష రూపాయల విలువైన రిఫరెన్స్ గ్రంధాలను బహూకరించి ,లైబ్రరీ ప్రారంభోత్సవ సభకుమరో లక్ష రూపాలు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించారు . .మచిలీ పట్నంకృష్ణా