1-సెల్ ఫోన్ లకు ఆధార్ కార్డు తో లింక్ చేయమని మెసేజి లపై మెసేజ్ లు వస్తున్నాయి . సీనియర్లు లింక్ చేయటానికి సెల్ డీలర్స్ దగ్గరకు వెడితే వాళ్ళ దగ్గరున్న వ్రేలి ముద్రల మెషీన్ 10 వ్రేళ్ళతో ఏ వ్రేలి ముద్రనూ యాక్సెప్ట్ చేయటం లేదు .అందుకని సుమారు 70 ఏళ్ళు దాటిన వారికి లింక్ చేయించుకొననే అవకాశం లేకుండా పోతోంది .దీనిపై ప్రభుత్వాలు స్పందించి మరేదైనా మార్గం త్వరలో ఆలోచించి అమలు చేయాలని కోరిక .
2-పెన్షనర్ అసోసియేషన్ లో ఇటీవల బయట పడిన అవకతవకలకు ఝడిసి ప్రభుత్వం పెన్షనర్లు నవంబర్ లో ఇవ్వాల్సిన లైఫ్ సర్టిఫికెట్ఇచ్చేటప్పుడుతప్పని సరిగా వ్రేలి ముద్ర నమోదు చేయటం ఈ సంవత్సరం ఖచ్చితంగా అమలు చేస్తోంది లైఫ్ సర్టిఫికెట్ దాఖలు చేయటానికి ట్రెజరీ ఆఫీస్ కు వెడితే ఇక్కడకూడా వ్రేలి ముద్ర మెషీన్లుసుమారు 70 ఏళ్ళు దాటిన పెన్షనర్ల వ్రేలి ముద్రలు తీసుకోవటానికి మొరాయిస్తున్నాయి అంటే అంగీకరించటం లేదన్నమాట .కనుక ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ మార్గం అమలు చేయాలి ట్రెజరీ ఆఫీస్ వారు ఏమీ చేయలేక మళ్ళీ డిసెంబర్ లోనో జనవరి లోనో కొత్తవిధానం అంటే కంటి గుడ్డు ఫోటో ఐరిస్ ఫోటో వస్తుంది అప్పుడు మరల రమ్మని బ్రతిమాలి చెబుతున్నారు
కనుక పై రెండు విషయాలను ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాను . అతి త్వరలో ప్రత్యామ్నాయ మార్గం ప్రవేశ పెట్టి పెన్షనర్ లకు ,సెల్ వినియోగ దారులకు న్యాయం చేయవలసినదిగా కోరుతున్నాను
గబ్బిట దుర్గాప్రసాద్
సెల్ వినియోగ దారుడు మరియు రాష్ట్ర పెన్షన్ దారుడు
ఉయ్యూరు -కృష్ణా జిల్లా -సెల్ 9989066375
—

