50 వ గ్రంథాలయ వారోత్సవాలలో విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 15-11-17 బుధవారం సాయంత్రం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో ప్రముఖ కధానిక రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి నానీల సంకలనం ”పూలతోట ”ను డా శ్రీ గుమ్మా సాంబశివరావు ఆవిష్కరణ ,అనంతరంకవి విశ్లేషకుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ సారధ్యం లో ;;కృష్ణాజిల్లా వైభవం ”కవి సమ్మేళనం జరిగింది .కవి సమ్మేళనం లో నాకవిత ”మాధుర్య పాత్ర ”చదవండి –
మధుర్యపాత్ర
మన్మధ చాపం చెరకు గడ -మాకు ఏడుగడ
కవి కర్షక కార్మిక హృదయ మాధుర్యం మాకు శిరోధార్యం
విద్యా వైద్య ఆధ్యాత్మిక కేంద్రస్థానం మా ఊరు
ఆటు పోటులేని జీవన మాధుర్యం మాది
మా చేలల్లో తీపి చెరకే కాదు
వరిలోనూ మాధుర్య రస ఝరులున్నాయి
మా పుల్లేరు నీరు రష్యా వోల్గాను చేరింది
నూనెలో నూతనావిష్కరణ కు దారి చూపింది
మా కేమోటాలజిపిత” కొలాచల సీతారామయ్య”
మా వూరి విద్యామాణిక్యం మాకు గర్వకారణం
ఇండో- సోవియెట్ శాస్త్ర సాంకేతిక స్నేహ వారధి
మా కెసీపి దృఢానికే కాదు మధుర చక్కెరకూ కాణాచి
జిల్లాలో మా రాజకీయ౦ బలవత్తరం ,దిశా నిర్దేశం కూడా
మాది ఆదర్శప్రాయ అనుసరణీయ జీవన విధానం
మా క్షేత్రాలు పాడిపంటలకే కాదు
మాదుర్య సాహిత్య సస్య కేదారాలు కూడా
సిరి సంపదలకు ,వితరణ శీలతకు
సంస్కృతీ సంప్రదాయాలకు మార్గ దర్శి మా వూరు
ఆధ్యాత్మికత వెల్లి విరిసిన మాధుర్య సీమమాది
అందుకే ”కృష్ణాజిల్లా వైభవం ”లో
మా ఉయ్యూరు ది ”మాధుర్య పాత్ర ”.
గబ్బిట దుర్గా ప్రసాద్ -15-11-17 -ఉయ్యూరు
—

