గీర్వాణకవుల కవితాగీర్వాణ౦ -4
291-అపర ప్రవాస నాటక కర్త –రుద్ది నాధ ఝా (1890-1970)
1890 లో పుట్టి 1970లో మరణించిన రుద్ధినాద ఝా,మహామహోపాధ్యాయ హర్ష నాద ఝా కుమారుడు .దర్భంగా జిల్లా ఉజానా వద్ద శారదాపుర వాసి .శాకారాధి వంశీకుడు .అయిదు సంస్కృత నాటకాలు -1-శశికళా పరిణయ నాటకం 2-పూర్నకామ ౩-ప్రసాద నాటకం 4-దక్షిణామూర్తి నాటకం 5-అపర ప్రవాస నాటకం రాశాడు .వీటిలో మొదటి రెండు ముద్రితాలు మిగిలిన మూడు అముద్రితాలు .మొదటి నాటకాన్ని కుమార జీవేశ్వర సింహా రాజు ఉపనయన మహోత్సవ సందర్భంగా ప్రదర్శించటానికి రాశాడు .రెండవదాన్ని కతిహార్ కు చెందిన ఉమానాద మిశ్రా మనవడు జన్మ దిన సందర్భంగా రాశాడు .
శశికళ నాటకం ఏడు అంకాలు .మొదటింకానికి ‘’నాయికా హృదయగత భావ ప్రకాశం .అని రెండవదానికి ‘’స్వస్వదూత ప్రస్తాపన మూడవ దానికి కాశీ ప్రస్తానం ,నాల్గవదానికి ‘’పరిణయ సముద్యోగం ,చివరిదానికి’’వర ప్రాప్తి ‘’అని సార్ధక నామాలు పెట్టాడు . నాయిక శశికళ నాయకుడు సుదర్శనుడు వీరి ప్రేమ వివాహమే కధ.
పూర్నకామం ఏకాంకిక అద్భుత రస ప్రధానం .శృంగారాది రసాలతో అద్భుతరసాన్ని పండించాడు .పూర్ణ కామ అనే యువ యోగి తపస్సులో ఉంటె ఇంద్రుడు విఘ్నాలు కలిగిస్తే,అతని ముందు పప్పులు ఉడక్క ఇంద్రుడు మాతలిని పంపి స్వర్గానికి ఆహ్వానిస్తాడు .స్వర్గ సుఖాలేవీ అతనిని ఆకర్షించక మందాకినీ నదీస్నానం ధ్యాన యోగాలతో అక్కడ గడిపాడు.ఇంద్రుని గర్వం ఖర్వమై పగబట్టాడు .నారద విష్ణువులు ప్రత్యక్షమై పూర్నకాముడిని వైకుంఠానికి సాదరంగా తీసుకు వెళ్ళటం కధ .
మూడ౦కాల ‘’ప్రసాద నాటకం ‘’భారత స్వాతంత్ర్య సిద్ధికోసం పోరాటం అందులో బాబూ రాజేంద్ర ప్రసాద్ పోషించిన ముఖ్య పాత్ర ఉన్నాయి .శివుడు దక్షిణామూర్తిగా ఆవిర్భవించే నాటకమే దక్షిణామూర్తి నాటకం .చివరిదైన’’అపర ప్రవాస నాటకం ‘’శ్రీరాముడు అయోధ్యలో పట్టాభి షిక్తు డైనతర్వాత మొదటి సారిగా మామగారిల్లు జనక పురం మిధిలకు వెళ్ళటం కద .హాస్యభరిత నాటకం .
గిరిజానంద ఝా ‘’ద్వికుసుమ’’నాటకం ,గంగేశ మిశ్రా గురుదక్షిణ ,రఘు చరిత్ర నాటకాలు ,రాశాడు కౌత్సుకుడు గురువు వరతంత్రునికి గురు దక్షిణ చెల్లించటం మొదటి నాటక ఇతి వృత్తం ఏడు అంకాల నాటకం .రెండవదిరఘుమహారాజు అనిర్వచనీయ త్యాగం ఇతి వృత్తంగా కలది .
అలాగే ఆనంద ఝా కవి మూడు నాటకాలు –హ్రుత్పరివర్తన ,పునస్సంగమం ,దాహ్య ప్రతోన్మీలనం రాశాడు .మొదటి నాటక కధ భోజమహా రాజు ఆయన మామ ముంజ కు మధ్య జరిగిన విషయం .భోజుని చంపటానికి ముంజ కిరాయి మనుషులను పంపుతాడు .భోజుని విశుద్ధ ప్రవర్తనకు వాళ్ళ మనసులు మారి ముంజ కు తెలియజేస్తే అతని ప్రతీకారేచ్చ నశించి కూతురునిచ్చి పెళ్లి చేసి అల్లుడిని చేసుకుంటాడు .పూర్ణ సంగమనాటక ఇతి వృత్తం పార్వతీపరమేశ్వరుల ప్రణయ పరిణయాలే .
గంగాధర మిశ్ర ఏడు ఏకాంకికలు రాసి ‘’సప్తలా ‘’పేరుపెట్టాడు .మతినాద మిశ్రా గుజరాత్ లోని సోమనాధ దేవాలయ నిర్మాణ నేపధ్యంగా అయిదు అంకాల ‘’రాష్ట్ర బంధు ‘’నాటకం రాశాడు .
292-పాంజి ప్రబంధ నాటకకర్త –డా.శశినాద ఝా (1954)
1954లో మధుబని జిల్లా దూపాలో పుట్టిన శశికాంత ఝా దర్భంగా కే ఎస్ డి ఎస్ యూని వర్సిటి లో వ్యాకరణం బోధించాడు . .అచ్చుకాని గ్రంధాలను ,పునర్ముద్రణ గ్రంధాలను ప్రచురించాడు .మిధిలలో పాంజీ రికార్డ్ లను భద్ర పరచటం నేపధ్యంగా ‘’పాంజీ ప్రబంధం ‘’అనే నాటకం రాశాడు .ఇదికాక బాణకవి పార్వతీ పరిణయం పై విపుల వ్యాఖ్యానం రాశాడు. తన కవితలను’’మధుధార ‘’ సంపుటిగా ప్రచురిద్దామనుకున్నాడుకాని సాధ్యం కాలేదు
మిధిలకు చెందిన 35 మంది విమర్శక కవులు అనేక సంస్కృత నాటకాలపై వ్యాఖ్యానాలు రచించారు అందులో కొందరి గురించిమాత్రమే తెలియ జేస్తా –
హనుమన్నాట కానికి బలభద్రుడు దీపిక ,అనర్ఘ రాఘవానికి భావనాద మిశ్రా ,వేణీ సంహారానికి ధీరసిమ్హుడు సుబోధ జనికా ,ముదితమదాలసకు స్వయంగా గోకులనాదుడే టిప్పణ౦ ,ముద్రారాక్షసానికి ముద్రాదీపికను గ్రహేశ్వరుడు ,అభిజ్ఞాన శాకున్తలానికి వివ్రుతి పేరుతో అన్ఖిఝా ,మాలతీ మాధవానికి ప్రజాపతి ,ప్రబోధ చంద్రోదయానికి దుర్నిరూప నపదార్ధ వివేక ను రుచికార , అమృతోదయ సుఖ బోధినికి ‘’సరళా ‘’పేరుతో వ్యాఖ్యానాన్ని ముకుంద ఝా బక్షి రాశారు .కనుక మిధిల జానకీ మాతకే కాక కవిత్వ నాటక చంపు లకు వ్యాఖ్యానాలకు కూడా పుట్టినిల్లె .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-18- ఉయ్యూరు

