గీర్వాణ కవుల కవితా గీర్వానం -4
293 –అలంకార శేఖర కర్త –కేశవ మిశ్రా (1592 )
మిధిల కవి పండితుడైన కేశవమిశ్రా ‘’అలంకార శేఖర ‘’రాశాడు .మహామహోపాధ్యాయ నరహరికి కొడుకు ,మహామహోపాధ్యాయ పరమగురు వాచస్పతి కి మనవడు సంమిశ్ర గిరిపతి కి మునిమనవడు.పాళీ కుటుంబం లో సామౌతి శాఖవాడు .వత్స గోత్రీకుడు .తాత వాచస్పతి రాసిన ద్వైత నిర్ణయ కు ‘’ద్వైత పరిశిష్ట ‘’రాశాడు .అలంకార శేఖరం రాయకముందే ఏడు అలంకార శాస్త్రాలు రాసినట్లు చెప్పుకున్నాడు .అయితే ఇవి మహా పండితులకే కొరుకుడు పడనట్లున్నాయని గ్రహించి పద్ధతిమార్చి శులభ విధానం లో శేఖరం రాశాడు .ఆ ఏడూ అలభ్యాలే .కోట –కాంగ్రా పాలకులు మహారాజా రామచంద్ర మనవడు మహారాజా ధర్మ చంద్ర కొడుకు అయిన మహా రాజా మాణిక్య చంద్ర ఆస్థానకవి .ఈ ఆస్థానం లో ఉన్నప్పుడే పై అలంకార శాస్స్త్రం రాశాడు .
ఈ అలంకార శాస్త్రం లో ఏడుభాగాలున్నాయి .వీటికి రత్న అని ,ఉపవిభాగాలైన 22 లను ‘’మరీచి ‘’అని పిలిచాడు .దీని కారికలను సౌద్దోదనుడు వృత్తులను కేశవ మిశ్రాయే రాశాడు .
రామచంద్ర దక్కూర రాసిన రసతరంగిణిలో ఏడు తరంగాలున్నాయి .నాయక నాయిక భేదాలను చెప్పటానికే రాశాడు .ఉదాహరణలను తనకావ్యాలనుంచీ ఇతరకావ్యాలనుండి ఇచ్చాడు .ముగ్ధ నాయిక ను కొత్త విధానం లో ఆవిష్కరించాడు రామ చంద్ర .ఆమెను జ్ఞాతాజ్ఞాతస్వయోవన అన్నాడు .
కవేంద్ర గంగానంద 1-కర్ణ భూషణ 2-కావ్య దాకిని,అలసామోదిని శృంగార వనమాల , అనే నాలుగు అలంకార గ్రంధాలు రాశాడు.కర్ణ భూషణలో 5 పరిచ్చేదాలున్నాయి .మొదటి భాగాలలో రస చర్చ చేశాడు .మిగిలినవాటిలో భావాలను చర్చించి శ్రీ కృష్ణ భక్తీ పులకా౦కితమ్ చేస్తూ వర్ణించాడు .కావ్యదాకిని పూర్తిగా అలంకార చర్చ .దీనిలోని భాగాలకు ద్రిస్టి అని పేరుపెట్టాడు .శృంగార మణిమాల శృంగార రసాను సారంగా రాసింది .నాయికను ఆగచ్చత్ పతిక అన్నాడు .అలసామోదిని అలంకార శాస్త్రం నేర్చుకొనే వారికి కరదీపిక .ఇది ఈకవి ఇతర రచనలకు ఉపకరణం .
గోకులనాధుని రస మహార్ణవం లక్షణ విభాగానికి చెందినది .అభిద వ్యంజన భేదాల చర్చ ఉన్నది.
294-పేరు లేని అలంకార శాస్త్ర కర్త –ఇంద్రపతి (18 వశతాబ్దం )
కే ఎస్ డి ఎస్ యూని వర్సిటిలో భద్రపరచబడిన వ్రాతపటిగా ఒక అలంకార శాస్త్ర గ్రంధం ఉన్నది దీనికర్త మహామహోపాధ్యాయ ఇంద్రపతి .మధ్యలో కొంతపోయి ఇరవై రెండు భాగాలే ఉన్నాయి .ఇంద్రపతి ‘’మీమాంస పల్లవం ‘’రాశాడు .రుచిపతి కొడుకు ,నీలకంఠ మనవడు కరమహా కుటుంబం వాడు .గ్రంధం అలంకార చర్చకు కేటాయించాడు .
మిధిలకు చెందిన వేణీ దత్త ,చిత్రధర కూడా అలంకార గ్రంధాలు రాసినట్లు తెలుస్తోంది .
295-రస కౌస్తుభ కర్త –వేణీ దత్తుడు (18 వ శతాబ్దం )
వేణీదత్తుడు సాదుపాధ్య కుమారుడు ,కవి జయ కృష్ణ మనవడు .కరమహా వంశస్తుడు .ఇతని చివరి చెల్లెలు సతీ మహారాణి 17 39లో 14 వ ఏట’’ సతి ‘’అయింది .మరొక సోదరిని మహారాజా మాధవ సింహ తండ్రి ఏకనాధ దక్కూరా పెళ్లి చేసుకున్నాడు .ఈ దంపతుల కుమారుడు మహారాజా మాధవ ఆస్థానం లో వేణీ దత్తుడు ఉన్నాడు ఇతను రాసిన రస కౌస్తుభం ,అలంకార మంజరి ప్రసిద్ధాలు .మొదటి దానిలో నాయికా నాయక భేదాలను రెండవది అలంకార శాస్త్రం లో తప్పటడుగులతో ప్రవేశించే వారికోసం రాసింది .రస కౌస్తుభ విరుదావలి లనుంచి అనేక ఉదాహరణలు ఇచ్చాడు
చిత్రధరుని శృంగార సరణి శృంగార ,రతి,కామదశ ,నాయికా నాయకుల విషయాలను చర్చించింది .వీర తరంగిణి లఘు గ్రంధం .వీరరస విభాగాలను చర్చించింది .లేఖనాధ ఝా రసచంద్రిక అనే చిన్న అల౦కార గ్రంధం రాశాడు .స్వంత నిర్వచనాలు ,ఉదాహరణలు ఇచ్చాడు .కవి శేఖర బదరీనాధ ఝా’’సాహిత్య మీమాంస ‘’రాశాడు .
296- వ్యంజన వాదకర్త –యదునాధ మిశ్ర (18 85)
18 8 5 లో పుట్టిన యదునాద మిశ్ర వ్యన్జనవాద వ్యాప్తికోసం వ్యంజన వాద గ్రంధం రాశాడు .సోదరపుర వంశం లో సారిసవ శాఖకు చెందినశ్రోత్రియ బ్రాహ్మణుడు .పండిత జయనాద మిశ్రా కుమారుడు మధుబని జిల్లా లాలాగంజ్ లో నివాసం .వ్యంజనా వృత్తిని సమగ్రంగా ఆవిష్కరించాడు .
బాలకృష్ణ మిశ్ర లక్షణ పరీక్ష ,వ్యక్తి నిరాశా అలంకార పుస్తకాలూ రాశాడు .అనంత ఝా ధ్వనికల్లోలిని రాయగా ,గిరిజానంద ఝా అలంకార కుసుమ రాశాడు .హాటక మిశ్రా కొడుకు భావమిశ్రా శృంగార సరసి,సభ్యాలంకరణ రాశాడు .సుఖదేవ మిశ్రా ‘’శృంగారలత ,శ్రీకర మిశ్రా అలంకార తిలకం శంకర మిశ్రా సాహిత్య కలిక రాశారు ..హిరణ అనేకవి ఉపమాకంతుక ,రాశాడు .
వీరేకాక అలంకార శాస్త్రాలకు వ్యాఖ్యానాలు రాసిన వారూ చాలామందే ఉన్నారు మిదిలలో . కొందరి పరిచయం-కావ్యప్రకాశకు అచ్యుతధక్కూర ,వ్యంగ్యార్ధ కౌముదికి అనంతుడు ,ధ్వన్యాలోకానికి ‘’దీధితి ‘’వ్యాఖ్యను బదరీనాధుడు ,కావ్యాదర్శానికి భాగీరధ కావ్యప్రకాశికకు సాహిత్య దీపికను భాస్కర మిశ్రా ,సాహిత్య దర్పణానికి లక్ష్మి అనే వ్యాఖ్యను కృష్ణమోహన దక్కూర ,దీనికే ఖుద్దూ ఝా వంటివారు సంస్కృత వ్యాఖ్యానాలు రాసి గీర్వాణవాణిని ప్రచారం చేయటమేకాదు అలంకార గ్రంథ వ్యాప్తికి దోహదమూచేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –26-2-18 –ఉయ్యూరు
—

