గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
297-పింగళ ఛందస్సూత్ర కర్త –హలయూద (11 వ శతాబ్దం )
మిధిలకు చెందిన హలయూద 11 వ శతాబ్దపు కవి .’’పింగళఛందస్సూత్ర౦ ‘’రాశాడు .ఇదికాక ‘’బ్రాహ్మణ శాస్త్రం ‘’అనే పేరు మోసిన గ్రంధాన్ని కూడా రాశాడు. అనేక ధర్మశాస్త్ర గ్రంధాలు హలయూదను ,రచనలను పెర్కొన్నాయి .
298- ప్రాకృత పింగళ శాస్త్ర కర్త –రవికార మిశ్ర (12 వశతాబ్దం )
12 వ శతాబ్ది రవికార మిశ్ర దీర్ఘ ఘోష వంశీకుడు .దామోదర మిశ్రాకు పూర్వీకుడు .రవికార వృత్త రత్నావళి ,ప్రాకృత పి౦గళశాస్త్రం అనే ఛందో గ్రంధాలు రాశాడు .ఇది పింగళసార వివేక శైలిలో ఉంటుంది .
299-వాణీభూషణ కర్త –దామోదర మిశ్ర (14 వ శతాబ్దం )
14 వ శతాబ్ది ఉత్తరార్ధం 15 వశతాబ్ది పూర్వార్ధపు కవి దామోదర మిశ్ర వాణీభూషణంఅనే ఛందో శాస్స్త్రాన్ని రాశాడు .1402 -1410 వరకు పాలించిన కీర్తి సింహ రాజు ఆస్థానకవి.
హరిహర కవి ‘’పింగళరంగిణి’’అనే వ్యాఖ్యానాన్ని పింగళ ఛందస్సూత్రానికి రాశాడు .
300-వృత్తిసార కర్త –రమాపతి ఉపాధ్యాయ (15 వ శతాబ్దం )
కవి శేఖర యశోధరునికుమారుడే రమాపతి ఉపాధ్యాయ .పాళీ వంశం లోమంగరౌని శాఖవాడు .వృత్తి సార ఛందస్సు గ్రంధం రాశాడు తానె దీనికి వ్రుత్తిసారాలోకం అనే వ్యాఖ్యానమూ రాసుకున్నాడు .
దామోదర మిశ్ర కొడుకు పద్మసార మిశ్ర ‘’ఛందో రత్న ‘’స్వతంత్రంగా రాశాడు .యితడు దిఘవాయ వంశీకుడు .
301-చందోమంజరికర్త –గంగదాసు (16 వ శతాబ్దం )
వైద్య గోపాలదాస కొడుకు గంగదాసు 16 వ శతాబ్దివాడు చందోమంజరి రాశాడు .
వ్రుత్తి రహస్యం ను దిగంబర దక్కూర రాశాడు
302- వృత్త ముక్తావళి కర్త –దుర్గాదత్త మిశ్ర (16 వ శతాబ్దం )
16 వశతాబ్దానికి చెందిన దుర్గా దత్త మిశ్ర వృత్త ముక్తావళి రాశాడు .
303-శ్రుత బోధ కర్త –కాళిదాసమిశ్ర (16 వశతాబ్దం )
కాళిదాస మిశ్ర 43శ్లోకాల శ్రుత బోధ రాశాడు .దీనిపై చాలామంది వ్యాఖ్యానాలు రాశారు .అందులో మనోహర రాసిన సుబోధిని ,లక్ష్మీ నారాయణ రాసిన మనోరమ ముఖ్యమైనవి .
304-వృత్త దర్పణ కర్త –భీష్మ మిశ్ర (18 వ శతాబ్దం )
మహామహోపాధ్యాయ భీష్మ మిశ్ర 18 వ శతాబ్దివాడు తండ్రి మహోపాధ్యాయ ధీరమిశ్ర ..బాలీశ వంశీకుడు ‘’వృత్త దర్పణం ‘’అనే ఛందో గ్రంధం రాశాడు
305-చందః కల్పతరువు కర్త –రాఘవ ఝా
తరౌరి గ్రామవాసి రాఘవ ఝా చందః కల్ప తరు రాశాడు .
306-విద్వన్మనోరమ వ్యాఖ్యాత –విద్యానంద మిశ్ర
పింగళ చ్చంద సూత్రానికి విద్యానంద మిశ్ర విద్వన్మనోరమా వ్యాఖ్యానం రాశాడు
జానకేనందన కవీంద్ర వృత్తదర్పణం రచించాడు
307-చందః సిద్ధాంత భాస్కరః కర్త –కేశవ
కేశవ కవి చందః సిద్ధాంత భాస్కరః రాశాడు .మధుసూదనకవి మాత్రా వృత్తం రచించాడు .
308-వృత్తరత్నావళి కర్త-చిరంజీవ
మిధిలకు చెందిన చిరంజీవకవి వృత్త రత్నావళి రాశాడు ‘
309- ఛందస్సుదాకరం కర్త –బాబూజన ఝా (19 వ శతాబ్దం )
19 వ శతాబ్దికి చెందిన మహామహోపాధ్యాయ బాబూజన ఝా ఛందస్సుదాకరం రచించాడు .ఈయన తండ్రిదీనబందు అలియాస్ నేనన ఝా .ఖనాల వంశం లోసుఖేట శాఖవాడు .నివాసం మధుబని దగ్గర పిలఖ వార.
310-చందోలత కర్త –వసంత మిశ్ర (19 వ శతాబ్దం )
చందోలత అనే ఛందో గ్రంధాన్ని రచించిన వసంత మిశ్ర 19 వ శతాబ్దికవి .సమస్తిపూర్ జిల్లా తబక గ్రామవాసి 291నుండి 310వరకు ఆధారం ‘’Contribution O f Mithila To Sanskrit ‘’
మనవి-ఇప్పటికి అచ్చైన గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ 1,2, 3భాగాలలో 1090మంది సంస్కృత కవులను గురించి రాసి ,ఇవాల్టికి గీర్వాణ౦ -4 లో 310మంది గీర్వాణ కవులను గూర్చి రచించి నాలుగు భాగాలలో మొత్తం 1400మంది దేవభాషా కవుల గురించి రాసిన అదృష్ట వంతుడనయ్యాను .. ప్రస్తుతానికి విరామ చిహ్నం అంటే కామా పెడుతున్నాను .వీలుని బట్టి మిగిలిన వందలాది కవుల గురించీ త్వరలో రాయటం ప్రారంభిస్తాను.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-18 –ఉయ్యూరు

