గురు –శిష్య -2
గురు –ఎపి లో పాలన ఎలా ఉందిరా ?
శిష్య –అదుర్స్ గురు –ముప్పై యుటర్న్ లు ,పది మానభంగాలు ,పదహారు దోపిళ్ళు ,అన్తెవేగంగా కూల్చివేతలూ గా దినదిన ప్రవర్ధమానంగా ఉంది .
గురు –అరేయ్ ఆయనోచ్చి పాపం నెల కూడా కాలేదు .అప్పుడే బేరీజు వేసి ఇన్ని అభా౦ డాలా ?నాకేం నచ్చలేదు .
శిష్య –రచ్చ రచ్చ గా ఉన్నా నీకు చీమకుట్టినట్లైనా లేదా ?
గురు –నాకు అంతా బాగా ,ప్రశాంతంగా నే కనిపిస్తోందే .
శిష్య –కళ్ళు మూసుకొన్నావా ?అరకంటి తో చూస్తున్నావా ?నాకేమీ నీ ధోరణి అర్ధం కాటం లేదు గురవా .
గురు-సరేకాని నవరత్నాల పంపిణీ బాగా జరుగుతోందా ?
శిష్య –ఇంకా సాగినట్లు లేదు .ఆఫీసర్లు బుర్రలు పగలకొట్టుకు౦టున్నారు ,జుట్లు పీక్కుంటున్నారు .వీటికి మనీ ఎక్కడ అని !మోడీ ఏమీ ‘’చేపేట్లు’’లేడు .పైగా ఇప్పటికే ‘’కుర్రాయన ‘’మీదసానుభూతిపోయి కారాలు మిరియాలు నూరుతున్నాడని అనుకొంటున్నారు .ప్రస్తుతం నవ రత్నాల బదులు రూపాయికి ఒకటిచ్చే ‘’నవరత్న ఆయిల్ పాకెట్స్’’ ప్రజలకు ఇస్తే చిరంజీవి యాడ్ లో చెప్పినట్లు ‘’చల్లచల్లగా కూల్ కూల్ గా’’ ఉంటారేమో?
గురు –అరే!అప్పుడే యు టర్నా? కొత్త జంట ఎలా నడుస్తున్నార్రా ?
శిష్య –అంటే జగన్ కెసిఆర్ లనేగా నీ ఉద్దేశ్యం .ఆరు కౌగిలింతలు ,పదహారు ఇకిలింతల్లా ఉంది వాళ్ళ అన్యోన్యం .
గురు-కాళేశ్వరం పై తాజా వార్తలే౦ట్రా?
శిష్య –ఆ ఏముంది గురవా !మసి పూసి మారేడుకాయ .బుడ్డాడిని బుట్టలో వేసుకొని ఆటలాడే చాణక్యం .మనకు బొక్క ,వాళ్లకు నక్క తొక్కుడు .మనకు నష్టం వాళ్లకు బోల్డు లాభం .
గురు –ఎక్కడున్న ఆస్తులు అక్కడి వాళ్ళవే అన్నాడట గులాబీ సామి ?
శిష్య –అవును గురూ .అందుకే భవిషత్తులో గోదారి -శ్రీశైలం అనుసంధానం తమదే అంటే ‘’అన్నీ మూసుకు కూర్చోవాల్సిందే ‘’అని గోలగా ఉంది ఆంధ్రాలో .
గురు –మరి ఆంధ్రాజనం గాజులు తొడుక్కుని కూర్చుంటారా ?
శిష్య –కూర్చోరు .ఇప్పుడిప్పుడే’’ సన్నాయి నొక్కుడు ‘’ప్రారంభమైంది .దీనికి సరైన నాయకత్వం కావాలి.
గురు –‘’అమిత’’ బలుడు’’ షా’’ కొత్తపాచికలే౦టిరా?
శిష్య –గులాబీ దండుపై చాణక్య ప్రయోగం లో ఉన్నాడని ,గులాబీ లో ఒకబాచ్ అధినేతకు తెలియకుండా ,ఆయన చెంత చేరి చెవిలో జోరీగల్లా రొద పెడుతున్నారని గులాబీ నేత లూప్ హోల్స్ అన్నీ వాళ్ళే అందిస్తున్నారని ,అందులో మొన్నటి ఇంటర్ పరీక్షాఫలితాలు విద్యార్దులమరణాలు కూడా ఉన్నాయని మీడియాలో జోరుగా ఊహాగానాలు హల్ చల్ చే స్తున్నాయి .పైగా మోడీని పిలవకుండా కాళేశ్వరం ఓపెన్ చేయించి శనీశ్వరం చుట్టి౦చు కున్నాడని బలంగా అనుకొంటున్నారు .
గురు –మేనల్లు డే౦ చేస్తున్నాడు ?
శిష్య –సమయం కోసం కాచుక్కూచున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు .
గురు –ఇక్కడ అలాంటి ప్రమాదం లేదుకదా ?
శిష్య –ఓరి నాపిచ్చ గురూ ! కింగ్ మేకర్ ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఇక్కడొక కన్ను వేసి ఉంచుతూ టైంకోసం ఎదురు చూస్తున్నాడని అంటున్నారు .
గురు –అరే!ఇంకా నెలలు నిండని పసిగుడ్డు పాలన .అప్పుడే అంత ప్లాన్ వేస్తారా ?
శిష్య –మనకు కొత్తేమీకాదుకద గురూ ,నమ్మిన నాదెండ్ల అన్న ఎన్టి వోడిని ముంచేసింది మర్చావా ?అధికారం దక్కించుకోవటం లో ఉచ్చనీచాలు ఉండవు గుర్వా.
గురు –సరేరా . మోడీ సెంట్రల్ లో ,జగన్ రాష్ట్రం లో అన్ని సీట్లు ఎలా సంపాదించారని నాకు ఇంకా అనుమానంగానే ఉందిరా !
శిష్య –నీకేనేమిటి ?ప్రజలు కూడా అసలు మేము వాళ్లకు వోట్లు వేయనేలేదు ఎలాగెలిచారబ్బా ఇన్ని సీట్లు ?అని ఇప్పుడు లబోదిబో మంటున్నారట .
గురు –అదేరా నాకూ మిలియన్ డాలర్ల సందేహం .
శిష్య –ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ ఇలాగే భారీ మెజారిటీ సీట్లు, వోట్లతో గెలిచాడట .ఎలెక్షన్ అయిన కొన్నినెలలకు’’ వాటర్ గేట్ కుంభ కోణం ‘’బయటపడి ,తలవాచి, పరువు గంగలో కలిసి రాజీనామా చేసిన ఉదంతం ఇప్పుడు బాగా వైరల్ అయింది గురూ .ఏ బొక్కలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక ?
గురు –ఒకేదేశం ఒకే ఎన్నిక బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు గదరా మోడీ ?
శిష్య –అవును గురూ .2022-23లో ఒకేసారి దేశం లో ఎన్నికలు అన్నాడు పిఎం .జ్యోతిష్కులు పంచా౦గ కర్తలు టివిలలో ‘’శని ప్రభావం అధికంగా ఉన్న సమయం లో దేశం లో ప్రదాని,ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు .ఇది మూన్నాళ్ళ ముచ్చటే .అయిదేళ్ళూ అధికారం లో ఉండరు .శని మార్పుకు కూడా కారకుడు .కనుక ఏదో ఒక కారణం తో మధ్యంతర ఎన్నికలు దేశం లోనూ , మనరాష్ట్రంలోనూ వస్తాయని ఢంకా బజాయించి చెబుతున్నారు .అయినా మోడీకి కేదార్ నాథ్ గుహ ,జగన్ కు స్వరూపానంద స్వామి ఉన్నారు .భయమేల గురు ?అయినా మళ్ళీ నాతోనే రహస్యాలన్నీ చెప్పించి చల్లగా జారుకొంటున్నావు గురూ .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-19-ఉయ్యూరు
