డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే జాబ్ రష్
మా బామర్ది బ్రహ్మం పరుగెత్తుకొచ్చాడు వగర్చు కొంటూ
” ఏంట్రా విశేషాలు ?”అడిగా .
”బావా ! ఒకప్పుడు కాలిఫోర్నియా లో గోల్డ్ రష్ జరిగిందని లక్షలాది జనం బంగారం కోసం ఇల్లూ వాకిలీ వదిలి అక్కడికి వెళ్లి బంగారం కోసం ప్రతి అంగుళం త్రవ్వారని విన్నావా ?”అన్నాడు
”విన్నాను ”అన్నాను .
”మళ్ళీ ఇన్ని శతాబ్దాల తర్వాత మన రాష్ట్రం లో గోల్డ్ రష్ లాగా జాబ్ రష్ వచ్చి జాబులే జాబులు బావా . యెంత అదృష్టమో మన రాష్ట్రానికి పట్టింది తేనే తుట్టెలాగా అన్నాడు
”తలా తోకా లేని ఈ కమామీషు ఏంట్రా ?” అన్నా
”పేపర్ చదవవు. చానల్స్ చూడవు. ఇంటర్వ్యుల జోలికి పోవు. నువ్వు బావ అని చెప్పుకోటానికి కూడా సిగ్గుగా ఉంది లోకజ్ఞానం ఎలావస్తుంది బావా .?”అన్నాడు నిస్సిగ్గుగా
”అసలు విషయం ఏడవక ఈ నాన్చుడేమిట్రా?”అన్నాను గద్దించి
”పాకీ పని చేసేవారు రోజుకు గంటమాత్రమే పని చేస్తారని ,ఆపని తానుకాని చీఫ్ సేక్రేటరికాని లక్షరూపాయలిచ్చినా చేయరని కనుక వారిజీతం భారిగా 18వెలరూపాయలుఇవ్వాలని సిఎం ఆదేశంట ఇది లీక్ అయి అందరికీ ”డిగ్నిటి ఆఫ్ లేబర్ ”గుర్తుకొచ్చి జనం కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలకోసం అప్లికేషన్లు పెట్టటం పైరవీలు చేయటం సాగించారట .
”పోన్లేరా మంచి ప్రోగ్రెసివ్ ఐడియా బాగుంది పాపం కిందతరగతి వాళ్లకు ఇప్పటిదాకా ఆపనే చేస్తూ ఎదుగూ బోదుగూలేనివారికి గోల్డెన్ ఆపర్ట్యూనిటి”అన్నాను
”నిజమే నేనూ అలానే అనుకొన్నా -కానీ ”అన్నాడు
”ఈ కానీ, అర్ధణాలేమిట్రా ”?అడిగా
”అక్కడే ఉంది తిరాకాసు దీనికి క్వాలిఫికేషన్ యెస్. సి పెట్టారు
”మంచిదేగా ఎస్సీలైనా బాగుపడతారు ”అన్నా
”అక్కడే తప్పులో కాలేశావు . యెస్. సి లంటే వేరే అర్ధం ఉందిలే . నీకు తెలీదు ”అన్నాడు
”మరి రష్ ఎందుకురా ?”
ఆప్రత్యేక యెస్. సి ప్రజాప్రతినిధులు ,అన్ని వర్గాలవారు గంట పనికి 18వేలు అనగానే డిగ్నిటి ఆఫ్ లేబర్ గుర్తుకొచ్చి ,పార్ట్ టైం జాబ్ కదా అని పరి గెత్తుకోస్తున్నారని,సెలెక్షన్స్ కూడా వాళ్లవాళ్లేకనుక జాబ్ గ్యారంటి అనీ అంతగా అవసరమైతే ”ఉత్తరాయణం దక్షిణాయనం ” ఉన్నాయి అనే ధీమా గా ఉన్నారని చెవులు కోరుక్కొంటున్నారు బావా ”అన్నాడు
”విలేజ్ వర్కర్లుగా వాళ్ళ వాళ్ళనే సెలెక్ట్ చేసి తీసుకొన్నారని అంటున్నారు కదా మళ్ళీ ఈ కక్కూర్తి ఏమిట్రా ?”అన్నాను
”డబ్బెవరి చేదుబావా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటేనే కదా ఎన్నికలలో తాము పెట్టింది అంతా పూడ్చుకోగలుగుతారు ”
”మంచి విషయాలు చెప్పి నాకు జ్ఞానబోధ చేశావు . మంచి జరుగుంతోందేమో అని ఆశించిన నా ఆశలపై నీళ్ళు కుమ్మరించావు ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి అన్నాను
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-19-ఉయ్యూరు

