శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు
శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు
ఆంద్ర ప్రదేశ్ భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,బందరు హిందూ హైస్కూల్ లెక్కలమేస్టారు ,ఆర్ఎస్ ఎస్ ,,ఆనాటి జనసంఘ్ ఇప్పటి బిజెపి లో కీలక సభ్యులు ,ఆర్గనైజర్ జాగృతి వారపత్రికల కాలమిస్టు వీటికి మించి మహా గొప్ప కథా రచయితా జాగృతి లో ప్రతివారం సినిమాలపై హాస్య స్పోరకంగా సమీక్ష రాసేవారు, సరస సంభాషణా చతురులు మర్యాదా పురుషోత్తములు ,నాకు మార్గదర్శి ,రోల్ మోడల్ ,మా కుటుంబానికి అత్యంత ఆప్తులు మా మేనల్లుళ్ళు అశోక్ ,శాస్త్రి లకు ,మా అన్నయ్యగారబ్బాయి రామనాద్ కు బందరులో లెక్కల గురువు , R.S.K.గా అందరూ పిలిచే స్వర్గీయ శ్రీ రాజనాల శివ రామ కృష్ణ మూర్తి గారు 10-4-1996 న అంటే 23 ఏళ్ళ క్రితం నాకు బందరునుంచి రాసిన కార్డ్ శిధిలమై చీకి చినిగి అంచులు కనిపించని స్థితిలో ఇవాళ దేనికోసమో వెతుకుతుంటే దొరికింది . ఇది నాకు గొప్ప” ట్రెజర్ ”అని పించింది . కార్డు లోనే సర్వ విషయాలు సరిపుచ్చారు వారికి నా యెడల ఉన్న ఔదార్యానికి ఇది నిదర్శనం. వారి రాజకీయ పరిజ్ఞానానికి దర్పణం . -మీ దుర్గాప్రసాద్ -21-7-19-ఉయ్యూరు


