దశావతారాలు అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన ప్రముఖులకు శ్రద్ధాంజలి
సుమారు నెలరోజుల కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు శ్రద్ధాంజలి గా
సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని అక్షర నివాళి అర్పించవలసినది గా ప్రార్ధన .
1-ప్రముఖ నవలా ,కథా రచయిత్రి న్యు ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూని వర్సిటి లైబ్రేరియన్
శ్రీమతి అబ్బూరి ఛాయా దేవి
2-మాంటిస్సొరి ప్రిన్సిపాల్ అని పిలువబడి ,అనేక విద్యా సంస్థలను నిర్వహిస్తూ, బహు గ్రంధ కర్త , సాంఘిక సేవా కార్యకర్త ఐన పద్మశ్రీ –డా .వి.కోటేశ్వరమ్మ
3- నాలుగు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించి , అలుపెరుగని రాజకీయ పోరాట యోదురాలుగా గుర్తింపు పొందిన శ్రీమతి షీలా దీక్షిత్
4- బాలనటి గా చిత్ర రంగ ప్రవేశం చేసి ,44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందిన అరుదైన నటనా ,దర్శకమాణిక్యం –శ్రీ మతి విజయ నిర్మల
5-జ్ఞాన పీఠ పురస్కారం అందుకొన్న కన్నడ రచయిత ,నటుడు ,ప్రయోక్త, దర్శకుడు ,పత్రికా స్వేచ్చకు నిరంతరం పోరాడిన పద్మ భూషణ్ శ్రీ గిరీష్ కర్నాడ్
6-సాహిత్యమే ఊపిరిగా జీవించిన తెలుగు ,ఆంగ్లభాషల సవ్య సాచి ,నిరంతర సాహితీ శ్రామికుడు విశాఖ కు చెందిన శ్రీ రామ తీర్ధ
7-నాటకాలలో నటనతో పండి , వెండి తెరపై స్వచ్చ తెలుగు హాస్యం పండించిన కేరక్టర్ నటుడు శ్రీ రాళ్ళపల్లి
8-దిగంబర కవులలో తనకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న మానవ హితైషి శ్రీ మహాస్వప్న
9-‘’సీమ’’సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన డా యెన్ .రామ చంద్రరావు
10-ఆంధ్రజ్యోతి దినపత్రిక , ,ఆంధ్రప్రభ వార్తాపత్రికల సంపాదకులు , విజయవాడఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ ,అనేక సంస్కృత కార్యక్రామాల రూప శిల్పి ,లలిత ,సినీ గీత రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
ల అకాల మరణానికి అక్షర నివాళి అర్పించి ధన్యులమవుదాం .
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
మాదిరాజు శివ లక్ష్మి – ‘’కార్య దర్శి .
ఉయ్యూరు -26-7-19 ఉయ్యూరు
