పరమాచార్యులు పరమాత్ములే
శ్రీ పళ్ళెం పాటి వెంకటేశ్వర్లుగారు హైదరాబాద్ లో రెండు దేవాలయాలు నిర్మించి అనేక పుణ్యకార్యాలు చేసి ,18పురాణాలకు తెలుగు అనువాదం చేసిన వారు .1962లోపరమచార్యులవారిని మొదటి సారి దర్శించారు ..’’భవిష్యత్తులో ఉన్నత స్థితి కి రాగలవు ‘’అని ఆశీర్వదించారు స్వామి .
1968లో స్వామి హైదరాబాద్ లో ఉన్నప్పుడు స్కంధగిరి పద్మారావు నగర్ లో కంచికామ కోటితరఫున ‘’శంకర మఠం’నిర్మించ టానికి సంకల్పించారు .హైదరాబాద్ లోఎంతో అనుభవమున్న నిర్మాణ సంస్థలున్నా స్వామివారు పళ్ళెం పాటి వారికి కబురు చేసి ,నెలరోజుల్లో మఠం నిర్మాణం పూర్తి చేయాలని వెంటనే ప్రతిష్ట జరగాలని ఆదేశించారు .
మర్నాడే స్వామి వారితో శంకుస్థాపన చేయించి మందిర నిర్మాణం ప్రారంభిచారు పల్లెంపాటి .స్వామి అనుగ్రహం తో నిర్మాణం 21 రోజుల్లోనే పూర్తయి ,వైభవంగా ప్రతిష్ట జరిగింది .ఇదంతా తన కృషి కాదని శ్రీ వారి సంకల్పబలం అనీ వారు సాక్షాత్తు దైవ స్వరూపులని ఆయన నమ్మారు .కొన్ని రోజులతర్వాత శ్రీ వెంకటేశ్వర దేవాలయం నిర్మాణం చేద్దామని ప్రారంభించిన ధర్మకర్తలు పునాదులవరకే కట్టి ఇక కట్టలేకపోయారు .అప్పుడు శ్రీవారు మళ్ళీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారిని పిలిపించి ,15రోజులలో తాము హైదరాఆద్ నుండి వెళ్ళిపోతున్నామని ఆలోపల నిర్మాణం పూర్తి అవ్వాలని ఆదేశించారు .వారి ఆదేశం పై వెంటనే పని ప్రారంభించి 14రోజులలో గర్భగుడితో సహా ఆలయం అంతా కట్టేశారు .శ్రీ వారి సంకలసిద్ధికి ఇది మరొక ఉదాహరణ .
1981 శ్రీవారి ఆశీర్వాదం తో పల్లెంపాటి వారు నల్గొండ జిల్లాలోకాకతీయ సిమెంట్ ఫాక్టరీ నిర్మాణం ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేశారు .యెన్ జే ఎఫ్ కంపెనీ నుంచి 600 హార్స్ పవర్ ఉన్న2 మోటార్లు 12 లక్షలకు కొనాలని భావించారు .కాని అంత డబ్బు చేతిలో లేదు .ఫాక్టరీ పని ప్రారంభించాక డబ్బు చెల్లిస్తానని చెప్పారు .కానీ ఆ కంపెని ఒప్పుకోలేదు .మార్చి 1 ఫాక్టరీ ప్రారంభోత్సవ ముహూర్తం కూడా పెట్టుకొన్నారు .’’శ్రీవారే నన్ను కాపాడాలి ‘’అని మనసులో బలంగా ప్రార్ధించారు . రెండు రోజుల తర్వాత కంపెనీ ముందుగా డబ్బు చెల్లించాలి అన్న షరతును వదిలేసి ,స్వంతఖర్చులతో తామే రెండు మోటార్లను తీసుకు వచ్చి డెలివరి చేసి ఆశ్చర్యం కలిగించారు . ఇదంతా స్వామి అనుగ్రహం కాక మరొకటి కాదు అని గ్రహించారు. అనుకోన్నముహూర్తానికి ఫాక్టరీ ప్రారంభమైంది. మూడు నెలలలో 12లక్షలు చెల్లించే శారు .
హైదరాబాద్ అశోక్ నగర్ లో పల్లెంపాటివారు శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం కట్టాలని సంకల్పించి కంచి పరమాచార్యులవారిచే శంకుస్థాపన చేయించారు .ఆ కాలనీ వాసుల తరఫున ముగ్గురు వచ్చి అక్కడ గుడికడితే నిరంతర ఘంటా రావంవలన ప్రజలకు నిద్రా భంగామౌతు౦దని ,అడుక్కు తినేవారు ఆలయం చుట్టూ మూగుతారని కనుక నిర్మాణం ఆపించవలసిందని ,ఆపకపోతే కోర్టుకు వెడతామని నిష్టూరంగా స్వామి వారిని బెదిరించారు ,స్వామి విని, నవ్వి, మౌనంగా ఉండిపోయారు .ఆలయ నిర్మాణం అనుకొన్నట్లు దివ్యంగా జరిగి ప్రతిష్ట కూడా పూర్తయి ,అనునిత్య పూజలతో సత్యనారాయణ వ్రతాలతో వర్ధిల్లుతోంది.
ఎవరైతే వచ్చి ఆలయనిర్మాణం ఆపమని స్వామివారి తో నిష్టూరంగా బెదిరించారో వారు కొద్దికాలానికే తమకర్మఫల౦ అను భవించి తీవ్రంగా నష్టపోయారు .కామకోటి స్వామి సాక్షాత్తు భగవంతుని నిస్వరూపులే అని తాను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నానని శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు ‘’సాక్షాత్తు భగవంతుడే ‘’అనే వ్యాసం లో రాశారు .
పల్లెంపాటి వారి పెద్దకుమార్తె లక్ష్మీ నళిని భర్త గారే సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి శ్రీ జాస్తి చలమేశ్వర్ .పల్లెంపాటివారు 90 ఏళ్ళు సార్ధక జీవితం గడిపి మరణించారు
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-19-ఉయ్యూరు

