ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3
ఘర్షణ పై గాంధీ అభిప్రాయం
ఘర్శణపై గాంధీ జీ అభిప్రాయం’’Emphathy ‘’దృష్టి గా ఉంటుంది .ఇరుపక్షాలవారు కనీసం కొంతైనా ఒప్పుకోవాలి అప్పుడే పరిష్కారం సాధ్యం .ఎదిరిపక్షం దాన్ని’’ కేరే ఝాట్’’ కింద భావిస్తుందని ఆయన గుర్తించాడు .క్విట్ ఇండియా ఉద్యమం లో ‘’బ్రిటిషర్ లకు నిజంగా ఉండాల్సిన స్థానం బ్రిటన్ మాత్రమె’’ అని స్పష్టం చేశాడు .అదే సమయం లో భారత ఉపఖండానికి బ్రిటిష్ సర్కార్ రోడ్ల నిర్మాణం దగ్గర్నుంచి ,ఆఫీస్ పరిపాలన దాకా చేసిన మంచిపనులను మెచ్చాడు .
పరిష్కారం ఊహించాక ,రెండవ దశ పోరాటం దాన్ని సాధించటం గురించి .అంటే పోరాటమే .ఐతే అది స్థిర పరిష్కారం కోసమే అవ్వాలి .’’లక్ష్యం సాధన ను సమర్ధిస్తుంది ‘’అనేదాన్ని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించాడు .సాదనా ,లక్ష్యమూ చివరికి ఒకటిగా నే ఉంటాయి అని వాదించాడు .హింసతో పోరాటం చేస్తే ,ఉత్తమ లక్ష్య సాధనకూ హింసా విధానమే శరణ్యం అనే తప్పుడు భావన కలుగుతుంది .’’టెర్రరిస్ట్ లు బ్రిటిష్ వారిని తరిమేసి విజయం సాధిస్తే వారి బదులు దేశాన్ని ఎవరు పాలిస్తారు ?”’అని ప్రశ్నించాడు .ఆయనే సమాధానం చెప్పాడు ‘’బహుశా ఇండియా విముక్తికి హంతకు లైనవారు పాలిస్తారేమో ?,అలా అయితే హంతకుల వలన ఇండియాకు ఏమీ లాభం ఉండదు ‘అని ఖచ్చితంగా చెప్పాడు .
పోరాటం శక్తి మంతంగా తరచుగా ప్రదర్శనలతో మొదలవ్వాలి .అవమాన పరచే వాటికి నిరభ్యంతరంగా సహకరణకు తిరస్కరించాలి .అయినా హింసాత్మకంగా ఉండకూడదు .ఈ నాశనకర విధానాలు ఘర్షణ పరిష్కార విజయానికి ధనాత్మక ఫలితాలు ఇవ్వక పోవచ్చు.పోరాటం సత్యమార్గం లో మొదలైతే, అది క్రమంగా అది వ్యక్తీ శీలాన్ని ,విధానాన్ని క్రమంగా పెంచుతుంది ఆలోచనాపరిది విస్త్రుతమౌతుంది .ఉదాత్త లక్ష్యసాధనకోసం మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోయి దిగజారి ప్రవర్తి౦చకూడదు అని అభిప్రాయ పడ్డాడు .ఇదే ఉగ్రవాదానికి ఆయన సమాధానం . మొదలు పెట్టటానికి ఏదో రకమైన ప్రతిస్పందన రావాలని గట్టిగా కోరాడు .ఏమీ చేయకు౦ డాచేతులు కట్టుకొని కూర్చోమని ఏనాడూ ఆయన చెప్పలేదు ‘’ అగ్ని ప్రమాదం లో క్రియా శూన్యత క్షమి౦చరానిది ‘’అన్నాడు.
దిక్క్కారం అడుగున
‘’ధిక్కారం అడుగున పిరికి తనం ఉంటుంది .హింసలేని పోరాటం అనైతికం ఎన్నడూ కాదు .కాని పిరికితనం అనైతికమే ‘’అన్నాడు గాంధీ .’’ పిరికితనానికి హింసకు మధ్య దేన్ని ఎంచుకోవాలి అని నన్ను అడిగితె నేను హింసనే ఎంచు కోవాలి గట్టిగా చెబుతాను అన్నాడు ఒక్కోసారి హింస మాత్రమే పరిష్కారం అనిపిస్తుంది .పిచ్చి కుక్క వల్ల సమాజానికి ప్రమాదం దాన్ని అదుపులోనైనా పెట్టాలి లేదా చంపనైనా చంపాలి .వేరే దారి లేదు .దారుణ మానభంగాలు చేసిన ‘’మృగాడు .’’ స్పాట్ లో దొరికితే ,నిర్దాక్షిణ్యంగా వాడిని హతం చేయాలి . వీరోచిత హింస ,పిరికివాడి అహింస కన్నా తక్కువే అన్నాడు మహాత్ముడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-19-ఉయ్యూరు

