ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -5(చివరి భాగం )
ఉగ్రవాదం భయోత్పాతం
‘’టెర్రరిజం టెర్రరైజ్ ‘’చేస్తుంది .అంటే భయోత్పాతాన్ని కలిగిస్తుంది .ధనిక ,పేద దేశాలలో కూడా అది ఒక వృత్తిగా మారింది .నిరుద్యోగులకు ,అసంతృప్త ధనిక ,బీద వ్యక్తులకు ,గుంపులకు ,దేశాలకు కూడా అకస్మాత్తుగా అధికారం పొందాలనే ఆరాటమే దీనికి ముఖ్య కారణం .అది తక్షణమే ద్రవ ధనాన్ని ,మందుగుండు సామగ్రిని ,చంపటానికి లైసెన్స్ లతోపాటు ప్రపంచమంతా దమ్మిడీ ఖర్చులేకుండా పర్య టి౦చటానికి పాస్ పోర్ట్ లు, వీసాలు అవకాశాలు పుష్కలంగా సమకూరుస్తుంది .
ముఖ్యమైన వాటి నిర్వచనాలు
ముఖ్యంగా మూడు రకాల ఉగ్రవాదాలున్నాయి .అవి 1-తిరుగుబాటు(ఇన్సర్జెంసి ) 2-తీవ్రవాదం(మిలిటెన్సి ) 3-ఉగ్రవాదం (టెర్రరిజం) .ఇందులో తిరుగుబాటు లో విప్లవం ,గెరిల్లా కార్యక్రమాలు దేశ మిలిటరీ శక్తిపై జరపటం ఉంటాయి .మిలిటెన్సి అనే తీవ్రవాదం, పైదానికన్నా చాలా శక్తి వంతమైన ఒక పార్టీ విభాగం .దీని లక్ష్యం దేశ మిలిటరీ ,పారామిలిటరీ ,యంత్ర సామగ్రి ,సాయుధ సైనికులు ,పోలీస్ సిబ్బంది పై దాడులు .తమ లక్ష్య సాధనకు యెంత కైనా తెగించే తీవ్ర లక్షణం .టెర్రరిజం అనే ఉగ్రవాదం అమాయక ప్రజా సమూహాలను నిర్దాక్షిణ్యంగా నిర్హేతుకంగా సంహరింఛి అంతటా భయోత్పాతం కలిగించి పాలకుల దృష్టిని ఆకర్షింఛి, తాము అనుకొన్న కొన్నిటిని సాధించటం .ఈ మూడు విధానాలు వినాశ కారణాలైన హింసాత్మక చర్యలే . సందేహం లేదు ఈ నిర్వచనాలను ఇండియాలోని సీనియర్ ఎయిర్ ఫోర్స్ ,సైనిక పోలీస్ ఆఫీసర్ల తోనూ , దేశ విదేశాలలోని అనేక అకాడమీ, యూని వర్సిటీ లతో ఎన్నో ఏళ్ళు జరిపిన ఇంటర్వ్యూల ఫలితం గా ఇవ్వబడినవే .
కార్య కలాపాలు
ఈ రోజుల్లో టెర్రరిస్ట్ లు ఫైవ్ స్టార్ హోటళ్ళలో దర్జాగా అన్నీ సుఖాలు అనుభవిస్తూ ,టెర్రరిస్ట్ కార్య కలాపాలు జరుపుతున్నారు తప్ప భయంకర అడవులలోనో , లోయలలోనో ఉండి కాదు అని గ్రహించాలి .పోలీస్ ,సైన్యం ,ఎయిర్ ఫోర్స్ ,ఇంటలిజెన్స్ సర్వీసులు (నిఘా విభాగాలు )రోజు రోజుకూ తీవ్రమౌతున్న తీవ్ర వాదాన్ని అదుపు చేయ లేక పోతున్నాయి అన్నది పూర్తి యదార్ధం.
సంఘటిత వ్యూహం (ఫెడరేటేడ్ నెట్ వర్క్ )
టెర్రరిస్ట్ ల నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా ,సమర్ధ వంతమైన శాఖలతో ,కేంద్రాలతో ప్రతి దేశం నుంచి పకడ్బందీ వ్యూహం తో జరుగు తోంది .టెర్రరిస్ట్ లు లెక్కలేనంత నకిలీ కరెన్సీ కలిగి మాంచి ఆర్ధిక పరి పుస్టితో బాగా బలిసి ఉన్నారు .అమెరికా డాలర్లు ఇండియా,రూపాయలు బ్రిటిష్ పౌండ్లు ,ఒక టేమిటి అన్ని దేశాల కరెన్సీని కొన్ని వంచక(రోగ్) దేశాల సాయంతో క్షణాలమీద అచ్చుగుద్దేసి వినియోగం లోకి తెస్తున్నారు .ఇంతేకాదు మాదక ద్రవ్యాల సరఫరా అండర్ వరల్డ్ యాక్టివిటీస్, స్మగ్లింగ్ ,అనైతిక ఆయుధ వ్యాపారం ,కిడ్నాపింగ్ , దోపిడీ ,డాన్ గిరీ మొదలైనవాటితో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సమకూర్చుకొంటున్నారు .వీటిని అదుపు చేసే నాధుడే లేడు .
ఉగ్రవాద దీవులు
ఇప్పుడు టెర్రరిస్ట్ లు జాతీయ ,అంతర్జాతీయ బాంక్ సేవలను ఆపేస్తున్నారు .సామూహిక హనన ఆయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్ర క్షన్-W.M.Ds)కూడా సమకూర్చుకొని దేశాలను భయపెడుతూ ,ఎదుర్కోవటం ఒక సమస్యగా మార్చి ,.ప్రపంచమంతా ఉగ్రవాద దీవులుగా మార్చేశారు .
సామూహిక వినాశనం
ఈరోజుల్లో టెర్రరిజం ఒక ఫాషన్ ,ఒక వృత్తి ,ఒక సంస్థ అయింది .జోసెఫ్ కాన్రాడ్ దీనిపై తీవ్రంగా స్పందించి ‘’బాంబు దౌర్జన్యం ప్రజాభిప్రాయం పై ఎలాంటి ప్రభావం కలిగించదు.దీని పరిధిని దాటి ప్రతీకారం ,ఉగ్రవాదాల ఉద్దేశ్యం వైపు తిరిగి ఆలోచించాలి .ప్రభుత్వాలు కొత్త ఆయుధాలు సమకూర్చుకొంటే ఉగ్రవాదులుకూడా అదే వేగంతో వాటిని తమ స్వంతం చేసుకొంటున్నారు .ఇప్పుడు టెర్రరిస్ట్ లు బాధ్యతారాహిత్యంగా అణ్వాయుధాలను సమకూర్చుకొంటే ప్రభుత్వాల పరిస్థితి ఏమిటి ?ఇది చాలా కల్లోలం రేపే సమస్య అయి౦దిప్పుడు.వాస్తవం ఏమిటంటే చాలా టెర్రరిస్ట్ గ్రూపులు కెమికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడాయి .1995 జపాన్ లోని టోక్యో సబ్ వె సిస్టం లో ‘’సిన్రిక్లియోస్ ‘’ను వాడారు . ‘’క్వాడే నెట్ వర్క్ ‘’క్వేడా ఇన్ స్పైరేడ్ గ్రూప్ ‘’లు కొత్త తరహా యుద్దానికి సన్నద్ధం అవుతున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి .
టెర్రరిస్ట్ లు ప్రపంచ వ్యాప్త నెట్ వర్క్ సమాచారాన్ని కలిగి ఉన్నారు .దేశం యెంత భద్రంగా ఉంటుందో వాళ్ళు కూడా అంతర్జాతీయంగా ఎవరికీ కనిపించకుండా తమ తీవ్రవాద చర్యలు చేస్తూ భద్రంగా ఉన్నారు .దేశం, అది స్పాన్సర్ చేసే టెర్రరిజం గ్రూపులు ,,కౌంటర్ టెర్రరిజం సూటిగా ,రహస్యంగా ఒక దాని ఆధారంగా ఒకటి నడుస్తున్నాయి ,బతుకు తున్నాయి .ఇదొక పెద్ద విషవలయమైపోయింది .దీని నియంత్రణ ఎలా అన్నది అనూహ్యం గా మారింది .వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే టెర్రరిజ అంతమొందాలి అంటే అహింసా శక్తిపై తిరుగు లేని విశ్వాసం పెరగాలి .ఈ విశ్వాసం ప్రతి వ్యక్తిలో,సమాజం లో, ప్రతి సంస్థలోనూ ఏర్పడాలి .
అసలు ప్రమాదం
21 వ శతాబ్దం ప్రపంచీకరణ ఫ్లడ్ గేట్ లను టెర్రరిజాన్ని తెరచుకొని దూకి వచ్చింది .అమెరికాలో సెప్టెంబర్ 11 విషాదం సామూహిక హింస ,సామూహిక హనన ఆయుధ ఫలితమే .ఇది ఒక దృష్టాంతమై ,చర్యలకు దారి తీసింది .ఐతే ట్రెండ్ సెట్టర్ లు ఇందులోని యదార్ధం గమనించలేదు .ఈ రకమైన హింస ఒక అంటువ్యాధి గామారి ,క్రమంగా చాలావరకు ప్రొఫెషనల్ అయి పోయింది .మహాత్ముడు చెప్పినట్లు ఉగ్రవాదాన్ని ,దానిపై అత్యంత సహనం తోనే ఎడుర్కొవాలే తప్ప వేరే గత్యంతరం లేనే లేదు .
సమాప్తం
ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ అండ్ టెర్రరిజం ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-19-ఉయ్యూరు
.

