దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -6
1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –6(1759-1847)
త్యాగరాజ శిష్య పరంపర -4
31-శ్రీ కంఠయ్య(1870-1914)
కరూర్ భాస్కర పండిత వంశీకుడు.చిన దేవుని శిష్యుడు .మద్రాస్ లో ఫిడేల్ స్కూల్ నడిపాడు .కొడుకు పాప వెంకట్రామయ ఫిడేల్ లో దిట్ట
32-చిన్నాస్వామి –
దేవుడయ్య శిష్యుడు .ఫిడలర్ .త్యాగరాజ భక్తి సంగీతః పోషకుడు .ఘన గాత్ర విద్వాంసులు పుష్పవనం ,కోనేరు రాజాపురం ,వైద్యనాధం ,పూచయ్య౦ గార్,ప ల్లడం ,సి౦గ పట్టిఆచార్యులకు ఫిడేల్ సహకారం అందించాడు.
33-పాప వేంకటరామన్
తిరువాన్కూర్ రాజాస్థానగాయకుడు .తండ్రివద్ద గానం నేర్చి గోవిందస్వామి పిళ్ళై దగ్గర ఫిడేల్ అభ్యసించాడు .స్వంత బాణీ కూర్చాడు .కచేరీ అయిపోయాకకూడా ఇతని వాద్యం ప్రతిధ్వనిస్తుంది .మద్రాస్ రేడియో ఆర్టిస్ట్
34-వెంకటరామ శాస్త్రి (1870)
వైణికుడు.చాలాకృతులు , ‘’సంగీత స్వయం బోధిని ‘’గ్రంథం రచింఛి ముద్రించాడు
35-పట్టుకోట శ్యామ భాగవతార్ (1872-1924)
గురువు శయ్యం వెంకటస్వామి .గొప్ప హరికథకుడు.భక్తరామదాస్ హరికధ స్పెషలిస్ట్ .త్యాగరాజ కృతులను సభాపతయ్య ప్రవచనాలను బాగా చెప్పేవాడు .వేంకటేశ్వరుని భక్తుడుకనుక శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా చేసేవాడు
36-పుదుచ్చేరి రంగస్వామి (1888-1920)
ప్రవేశ పరీక్ష దాకా ఫ్రెంచి భాషలో చదివి ,ఎట్టియాపురం రామ చంద్ర భాగవతార్ వద్ద గాన విద్య నేర్చి ,ప్రవీణుడై పిఠాపురం ,విజయనగరం, కాకినాడ ఆస్థానాలలో పాడి,వెంకటగిరిమహారాజు చేత స్వర్ణకంకణం అందుకొన్నాడు .తిరుక్కోడి కావాల్ కృష్ణయ్య ,గోపాలకృష్ణయ్యలు ఫిడేల్ పై ,అలగానంబి మాముండియపిళ్లే ,దక్షిణామూర్తి మృదంగ సహకారం అందించేవారు .కంచిలోని నైన పిళ్లే ఇతనితో తరచూ సంప్రదింపులు జరిపేవాడు .కుంభ కోణం వాసి అయ్యాక పంచాపకేశి తో పరిచయమైంది .పంచాప కీర్తనలకు చిట్ట స్వరాలు రాశాడు .ఎన్నో త్యాగారాజ కృతులు గానం చేసేవాడు .శుద్ధబాణీలో సాహిత్యభావం తో పాడేవాడు .విశిష్ట స్వర నిర్మాత .త్యాగరాజ వర్ధంతి సంబరాల్లో పాల్గొనేవాడు .శిష్యుడు సాకోట రంగయ్య .
37-ప్రతాపం గోపాలకృష్ణయ్య (1886-1944)
కారూరు వాసి టైగర్ వరదా చారి శిష్యుడు .అభినయం ,గాత్రం, వీణ, ఫిడేల్ కన్జీరాలలో నిపుణుడు .పూనా బొంబాయి మొదలైన పట్టణాలలో కచేరీలు చేశాడు .12గ్రహరాసులకు 12 స్వరాలు కూర్చివీటి ఆధారంగా జాతకం చెప్పటం ఇతని ప్రత్యేకత .త్యాగరాజ కీర్తనలలో బీజాక్షరాలున్నాయని కనుక సాహిత్య దోషం తోపాడితే కీడు వాటిల్లుతుందనిసాహిత్య ప్రయోజనాన్ని చెప్పాడు .
38-ప్రతాపం నటేశయ్య
గోపాలకృష్ణయ్య శిష్యుడు .వానమామల్ తోటాద్రి,అరియకుడి శిష్యరికం చేసి గానం నేర్చాడు .రసికరంజని సభ గాన పాఠశాలలో అధ్యాపకుడుగా ఉన్నాడు
39-చల్లగాలి ఆదిమూర్తయ్య
కృష్ణయ్య సోదరుడు తంజావూర్ ఆస్థానగాయకుడు .
40-స్వరగత్తు నారాయణ స్వామి
పుదుక్కొట నివాసి .చిట్టినారాయణస్వామి శిష్యుడు .స్వరకాడు సుబ్బయ్య వంశీకుడు ‘’స్వరగత్తు ‘’వాద్య నిపుణుడు . అగాధ సంగీతజ్ఞానమున్నవాడు .మహావైద్యనాథన్ ,శరభశాస్త్రిలకు ప్రక్కవాద్యం వాయించేవాడు.తంజావూర్ ఆస్థాన విద్వాంసుడు .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,
సశేషం
మీ- గబ్బిటదుర్గాప్రసాద్ -2-1-20-ఉయ్యూరు

