ప్రపంచ దేశాల సారస్వతం
10- ఐరిష్ సాహిత్యం -1
ఐర్లాండ్ దేశం లో ఐరిష్ ,లాటిన్ ఇంగ్లిష్ భాషలలో వచ్చిన సాహిత్యమే ఐరిష్ సాహిత్యం .పశ్చిమ యూరప్ లో గ్రీకు లాటిన్ లతర్వాత చాలాప్రాచీనభాష ఐరిష్ భాష .5వ శతాబ్దిలో క్రైస్తవం వచ్చాక బాగా వ్యాప్తి చెందింది .అంతకు ముందు చాలాసరళమైన ‘’ఒఘన్ ‘’భాష శాసనాలలో ఉండేది .లాటిన్ భాషప్రవేశించాక లాటిన్ వర్ణక్రమం అమలులోకి వచ్చి కొంత సాహిత్యం వచ్చింది .ఐరిష్ సాహిత్యం లో మొదటి రచనలు వచన గాధలకు గేయాలుగా వచ్చాయి .6వ శతాబ్దం లో ప్రకృతిపైకవిత్వ రచన ప్రారంభమై ఒక్కోసారి ‘’ఇల్ల్యూమినేటేడ్ వ్రాతప్రతుల మార్జిన్ లలో రాయబడేవి .9వ శతాబ్దిలో ప్రారంభమైన .’’డి బ్లాక్ బర్డ్ ఆఫ్ బెల్ఫాస్ట్ లో’’ను చూసి ప్రభావితమై జాన్ మాంటేగ్,జాన్ హివిట్ ,సీమాస్ హార్నే,క్లారాన్ కార్సన్ ,ధామస్ కిన్సేల్లా మొదలైనవారు కవిత్వం రాయగా,ఆధునిక ఐరిష్ భాషలో టోమాస్ఓ ఫ్లాయిన్ కవిత్వం రాశాడు .
9వ శతాబ్దిలో లాటిన్ భాషలో వచ్చిన ‘’బుక్ ఆఫ్ ఆర్మఘ్ ‘’అనే సచిత్ర వ్రాతప్రతి సెయింట్ పాట్రిక్ ,మొదలైన పాతతరం రచయితలు పాత ఐరిష్ భాషలో రాసిన దానికి పూర్తి మేలు ప్రతిగా వచ్చింది .ఇదే అతిప్రాచీన వ్రాతప్రతిగా గుర్తింపుపొందిన న్యు టేస్టమేంట్ .దీన్ని845లో చనిపోయిన ఫెర్దోమ్నాక్ ఆర్మఘ్ రాసినట్లు చెబుతారు.ఇందులోని మొదటిభాగాన్ని ఆయన 807-08లో రాశాడని ,తర్వాత వారసులు పూర్తి చేశారని ఇదే ఆర్చిబిషప్ ఆఫ్ ఆర్మాఘ్ ఆఫీసు లో ఉన్నదని తెలుస్తోంది .
431-1540కాలం లో ‘’యాన్నల్స్ ఆఫ్ అల్స్తర్స్’’ ఇప్పటి ఉత్తర ఐర్లాండ్ గా పిలువబడే ప్రాంతంలో వచ్చిందని ,15వ శతాబ్దిలో రువాల్ద్రి ఓలూనిన్ తనరాజు కాధాయ్ఒఘ్మాఘ్ మాగ్నూసా ప్రాపకంలో రాశాడని ఇది బెల్లి ఐల్ ఆన్ లో యెర్నే లో రచి౦ప బడిందని అంటారు 12వ శతాబ్దిలో వచ్చిన ‘’ఉస్టర్ సైకిల్ ‘’రచన లో మధ్యయుగ ఐరిష్ హీరోల వీరోచిత గాధలున్నాయని ,తూర్పు ఉల్ల స్టర్లోని ఆర్మాఘ్ ,దౌన్ ,లౌత్ ప్రాంతాల సంఘటనలు చరిత్ర కధలు గా ఉన్నాయని ఇవి ఓల్డ్ మిడిల్ ,మిడిల్ ఐరిష్ భాషలలో రాయబడినాయని అంటారు .ఇవి వచనంలో ఎనిమిదేసి లైన్ల రూపం లో ఉంటాయి .ఇది 8వ శతాబ్దిభాష .వీటిలోని కధలు కవిత్వ విషయాలు 7వ శతాబ్దికి చెందినవి .
ఓల్డ్ ఐరిష్ పీరియడ్ తర్వాత రినైసన్స్ కాలంలో ఐరిష్ కవులుతమస్వంత భాషలో క్లాసిక్ రచనలు విస్తృతంగా చేశారు 12వ శతాబ్దికి శైలి లో గొప్ప మార్పు వచ్చి,17వ శతాబ్దిదాకా పెద్దగా మార్పు లేకుండా రచనలు వచ్చాయి .మధ్యయుగ ఐరిష్ రచయితలూ లాటిన్ భాషలో రాశారు .దీన్ని హిబర్నో లాటిన్ అంటారు .గ్రీకు ,హీబ్రూ అన్యభాషాపదాలు బాగా వచ్చి చేరాయి.ఇదే భాష మధ్యయు గాలలో యూరప్ అంతటా ఉండేది .
క్లాసికల్ ఐరిష్ గా ఇంగ్లిష్ వచ్చాక ,వైవిధ్యమైన కవిత్వభాష ఏర్పడి బోధనాభాషగా ఐర్లాండ్ స్కాట్లాండ్ లలో అమలైంది .దీని ఫలితంగా చరిత్ర ,న్యాయం ,సాహిత్యం లో రచనలు జరిగి పోషకుల చేత ఆదరణపొందటం జరిగింది .ఇప్పుడు వచ్చినాదంతా పాట్రన్స్ ను వాళ్ళ కుటుంబాలను పొగిడే సాహిత్యమే వచ్చింది .కాని దీనికి విరుద్ధంగా గోఫ్రేడ్ఫలాన్ ఓ డలాఘ్ ,తేదింగ్ ఓగ్ ఓహుగినా యూనోక్లైద్ ఓ హింగూసాలు 14,15,16శతాబ్దాలలో తమ ప్రత్యేకత చాటుకొని అద్భుత కవితా సృష్టి చేశారు .ప్రతి ఉన్నతకుటుంబానికివారి మూలాలు వంశ కర్తల చరిత్రలు మహాకవులతో రాయించి భద్రపరచారు. కవులతో బొర్దిక్ స్కూళ్ళల్లో పాఠాలు చెప్పించారు .ఈఅనువంశ రాజరిక వ్యవస్థలో ప్రత్యేక నైపుణ్యం మేధస్సు ఉన్న కవులు హెచ్చుగా పోషి౦పబడ్డారు .వీరికి ప్రాచీన మాజిక్ పవర్స్ కూడా ఉండేవని నమ్మకం .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-1-20-ఉయ్యూరు

