ఈడో యుగం లో 31అక్షరాల టంకా పద్యం కంటే చిన్నదైన ‘’హైకూ ‘’లేక హొక్కుపద్యం బాగా ప్రచారం లో ఉంది .టంకా లోని చివరి 14 అక్షరాలూ తీసేస్తే హైకూ ఏర్పడుతుంది .ఒక రుతువునుకాని ,పరాశ్రయభావాన్నికాని వర్ణించటానికి దీన్ని వాడుతారు .జపాన్ సారస్వత గుణ సంపన్నత టంకా ,హైకూ లలో గోచరిస్తుంది .ప్రకృతి బాహ్య సౌందర్యాన్ని వర్ణించటానికి అత్యత్తమ కవితా రీతి హైకూ .మట్సు ఓ బషో (1644-94),అతని శిష్యులు హైకూ కు గొప్ప ప్రచారం తెచ్చారు .ఎనోమోటోకొకకు,కగనోచియో(1703-1775),టని గుచి బుసన్ , కొబయషి ఇస్సా(1763-1828)ఉత్తమహైకూ రచయితలు .
18 వ శతాబ్ది లో కరైసేన్ ర్యు(1718-90)అనే హైకూ కవి కొత్తకవితామార్గాన్ని రూపొందించాడు .ఇదులొ17అక్షరాలే ఉండి,’’సేన్ ర్యూ’’గా పిలువబడింది .ఇందులోరుతు వర్ణనకు ప్రాధాన్యం ఉండదు .మానవుని ,మానవ జీవిత నిశిత పరిశీలనానికి ఉపయోగిస్తారు .ఈ యుగం లో నవలకూడాకొత్త దారి లో నడిచింది .ఇబారా సైకకు(1642-93)సమకాలీన జీవితం పై నవల రాశాడు .విషయ సుఖ విషయాలు ఉండటం చేత నీతిబాహ్యాలనిపింఛి ని౦ద్యాలయ్యాయి . ఇటీవలికాలం లో వాటిలోని వాస్తవికత అందర్నీ ఆకర్షిస్తోంది ఫుడోకొరొనొసుజురి ,కోషాకు ఇచ్చిదై ఒటోకో,కోషాకుఇచ్చిడైఒమ్న,కోషాకుగొనిన్ఒమ్నఅనే నవలలు కూడా ఆయనే రాశాడు .
టోకోడై మార్గం లోనే యిజిరోబే,కిటహచిఅనే వారిద్దరూ హాస్య పాత్రలు చేసిన యాత్రలను వర్ణిస్తూ జిప్పెంషా ఇక్కు(1766-1831)’’హిజు కురిగె’’అనే మనోహర గ్రంథం రాశాడు . షికి టేయ్ షన్బా(1766-1832)సామాన్య జన వాస్తవిక జీవితాన్ని వర్ణిస్తూ ‘’ఉకియో బురో ,ఉకియో డొకో ,షుజూహచి కుశే,కోకోన్ హ్యకునిన్ బకా అనే రచనలు చేశాడు. కోకు పెయ్ జకిన్ చైనా ప్రాచీన నవలల లాంటి శృంగారం దట్టించిన నవలలు రాశాడు. వీటిలో యుమిబరిచికి ,సటోమి హక్కెండం,సు ఇకో డెన్అనే చాలా ముఖ్యమైనవి .ఇతని ‘’చు అన్’’అనే చైనాభాషలోని రచనకు అనువాదం కూడా చేశాడు .
ఆధునిక యుగం (1868నుంచి నేటి వరకు )-దీనిలో1-మెయిజి యుగం (1868-1912),2-టైషోషోవా అనే రెండుభాగాలున్నాయి .
మెయిజి యుగం –ఈయుగం లో 1868లో రాజ ధాని క్యోటో నుంచి ఈడో కు మారి విద్య ,పరిశ్రమ రాజకీయాలలో చాలామార్పులొచ్చాయి .యువత ప్రయోగ విజ్ఞానం ,స్వాతంత్ర్య సమత్వం ,ప్రేమ,మానవత్వ విషయాలపై మక్కువ పెంచుకొన్నారు .సాహిత్యంలో పాశ్చాత్యవాసన వెంటనే అంటలేదు .కొంతకాలం పూర్వగ్రంథాలపై ఆపేక్ష నిలిచింది .జిప్పెంషారాసిన హిజు కురిగే కు అనుకరణగా భావించే సీయో హిజకురిగె అనే 15 భాగాల గ్రంథం కనజవా రోబాన్ (1829-94)రాశాడు .19వ శతాబ్ది చివర్లో పరభాషా వ్యామోహం హెచ్చి , ఆ రచనల అనువాదాలు బాగా వచ్చాయి.రూసో వోల్టైర్ ,మాన్ టేస్క్యు, మిల్ మొదలైనవారి రచనలు ఆకర్షించాయి .దేశీయ రచయితలూ ఈ ప్రభావంతో సామాన్యులకోసం రాజకీయ నవలలు రాశారు .యానో ఫ్యుమియో(1850-1931)రాసిన కైకోకు బిడన్ (1883)నవల మంచి పేరు తెచ్చుకొన్నది .ఫుకు జావా యుకిఛి(1834-1901)పాశ్చాత్య నాగరకత, సంస్కృతుల వివరాలతో చాలా రచనలు చేశాడు .
సశేషం
రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-20-ఉయ్యూరు
