మహా భక్త శిఖామణులు
22-కూర్మ దాసు -2(చివరి భాగం )
కడప, వేమవరం,నరసరావు పేట సప్తాహాలు
కడప సప్తాహం లో ఒక రోజు గజోతోవం జరుగుతుంటే ,భక్తుల హారతులతో చలువ పందిళ్ళు ఒక్క సారిగా అంటుకొని మండగా ,ఒక కొత్త యువకుడు గజవాహనం నుంచి అవతరించి ,మంటలను ఆర్పేసి అదృశ్యమయ్యాడు .భగవదనుగ్రహం గా భావి౦చారందరూ .
వేమ వరం సప్తాహం లో సప్తాహం చివర జరిగే అవభ్రుద స్నాన సమయం లో ,కూర్మ దాసు కు దగ్గరగా ఉన్న తాడేపల్లి రత్తయ్య మనవడు తటాకం లో పడి చని పోబోతుంటే ,ఆయనకు ఆ జన్మ విరోధి అయిన ఒకాయన వచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడి రత్తయ్యకు ఆనందం కలిగించాడు .తను ఒక నూతన పురుషుని ప్రోద్బలం తో ఈపని చేశానని అతడు చెప్పాడు .నరసరావు పేట సప్తాహం నియోగి వైదీకి తగాదాలు లేకుండా సవ్యం గా సాగిపోయింది .అన్నదమ్ముల్లా అంతా కలిసి క్రతు విజయానికి తోడ్పడ్డారు .
రామకోటి సమర్పణ
రామకోటి ని భద్రాద్రి రాముడికి సమర్పించటానికి బయల్దేరితే ,చాప రాళ్ళ పల్లి ,మొలకలపల్లి మధ్యలో భక్తులు ఒళ్లుమరచి భజనలు చేస్తుంటే మృదంగ ధ్వనులు మిన్ను ముట్టాయి .రామ ప్రభువు దాసు గారికి సాక్షాత్కరించగా ఆయన స్తుతి తో సాయంకాలం దాటింది క్షుత్పిపాసలు మరచిపోయి భక్త యాత్రికులు పరమానందం పొందారు .మర్నాడు ఉదయం భద్రాద్రి చేరి సంరంభంగా శ్రీరామకోటి సమర్పించి కృతార్దులయ్యారు .
ఇతర సత్ర యాగాలు
సికందరాబాద్ సప్తాహం లో గుండా మహారాజు దగ్గర శ్రీ పాండురంగ మంత్రోప దేశం పొంది ,ఆప్రభావం తో లింగ గూడ,గొసవీడు లలో సప్తాహాలు చేసి ధన్యుఅలయ్యారు దాసు .గొసవీడు సత్ర సమయం లో యాత్రికులకు దాసు గారు ఒక్కొక్క లడ్డు మాత్రమె వడ్డించే ఏర్పాటు చేశారు .మారు అడిగితె ఎవరూ మాట్లాడటం లేదు ఇంతలో ఒక తేజో మూర్తి వచ్చి దాసుగారితో ‘’లడ్డూలు చాలవని అను కొంటున్నావా ?దైవానుగ్రహం తో కావలసినన్ని వస్తాయి .అడిగినవారందరికీ ఎన్నికావాలంటే అన్ని వడ్డించమని చెప్పు ‘’అని చెప్పి అంతర్హితుడయ్యాడు .ఇది శ్రీరామ మహిమాప్రభావమే .ఎన్ని లడ్డూలు వేసినా రాసి తరగటం లేదట .గొప్ప వింతగా చెప్పుకొన్నారు .
దాసుగారి ఇతర సేవాకార్యాలు
లింగ గూడసత్రం లో మగవాళ్లు వెంక బడగా ముందు వచ్చిన ఆడవారు ఆకలికి ఆగలేక భోజనాలు చేస్తుంటే ,కమ్మగా వంటవారు వండి వడ్డిస్తుంటే ఒక లావు పాటి ఆయన వచ్చి ఆకలి అని గోల చేస్తే దాసుగారు ప్రత్యేకంగా కూర్చోపెట్టి వడ్డింప జేయగా ,అతుడు భోజనం చేస్తూ –‘’పరులు ని౦ది౦చు పట్ల గోపంబు గొనక –శాంతమును బూని వినయపుష్కలత నూని –విహిత సంభాష ణంబుల వెలువరించి –స్వా౦తమున వారి సంతస పరపు సతము ‘’అనే పద్యం చాలాసార్లు పాడి గోవింద గోవింద అని భోజనం చేసి అంతర్ధానమయ్యాడు .దాసు గారు ఆయన సాక్షాత్తు భగవంతుడే అని ,తనకోపాన్ని తగ్గించుకొన్నారు .జీవితకాలం లో దాసుగారు 20 సప్తాహాలు నిర్వహించి ,యాత్రిక సౌకర్యార్ధం నాలుగేళ్ళు గోసవీడులో ఒక ఏడాది బూర్గం పహాడ్ అనే బూరగొమ్మలపాడు ,కొత్తగూడెం లో నాలుగేళ్ళు ,పండరి క్షేత్రం లో తొమ్మిదేళ్ళు అన్నసత్రాలు నిర్వహించారు .చీరాలలో పాండురంగాపురం లో పాండు రంగ ప్రతిష్ట చేసి ,దీనికి అనుబంధంగా నిరతాన్న సత్రం నిర్వహించారు .
భక్తి ప్రచార కార్యక్రమం లో గుంటూరు నుంచి బయల్దేరి మధ్యలో మజిలీలు చేసి షోలాపూర్ స్టేషన్ లోమకాము చేయగా ,అమావాస్య చీకటి లో ,అర్ధరాత్రి ఇద్దరు దొంగలు దాసుగారి రెండుమూటలు ఎత్తుకుపోగా ఇద్దరు యువకులు వారిని అడ్డగించి సొమ్ము వారి నుంచి తీసుకొని పోలీసు డ్రెస్ లో వచ్చి అప్పగించి చోరీ విషయం అందరికీ చెప్పి అదృశ్యమయ్యారు .పండరి చేరి రంగని దర్శించి గుంటూరు చేరారు .చీరాల పాండురంగాపుర పాండురంగ దేవాలయం లో నిష్కామ సౌభాగ్య దురంధర ,సమయోద్దండ ,కోలాహల మొదలైన బిరుదులున్న శ్రీమదద్దంకి తిరు వేంకటాచార్య దేశికోత్తముల ఆధ్వర్యం లో ప్రతిష్టి౦ప బడిన స్వామికి కైంకర్యం మహా వైభవంగా జరుపుతున్నారు.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-20-ఉయ్యూరు