కేరళపాణిని రాజరాజ వర్మ -2
ఉన్నత విద్య
మెట్రిక్ తేలిగ్గా పాసై రాజరాజ వర్మ విశ్వ విద్యాలయం లో చేరేసమయం లోతల్లి మరణం తో ఒక ఏడాదిపాటు క్షురకర్మ చేయిన్చుకోకుండా కర్మకాండలు పూర్తీ చేయాల్సి ఉన్నందున విద్య సాగలేదు . చదవాలని ఉన్నా పెద్దలు అంగీకరించలేదు రాజు కి తెలిసి తనకుమారుడు నారాయణ తంపి మద్రాస్ యూని వర్సిటిలో ఎఫ్ ఏ.పరీక్ష రాయటానికి ఇంటి వద్ద ఉండటం తో ,అతనికి రాజప్రాసాద౦లోనే ట్యూషన్ ఏర్పాటు చేసి వర్మను కూడా అక్కడే చదువుకోమని ఆహ్వానించాడు .రాజావారు యూని వర్సిటి పర్మిషన్ కూడా వచ్చేట్లు చేశారు రూపాయి ఖర్చు లేకుండా ఉత్తమ విద్య లభించింది రాజావారి పరిష్కారం తో .విశాఖం తిరునాళ్ మరణించాడు .వర్మ 1886లో ఎఫ్ ఎ పాసై మహారాజావారి కాలేజిలోనే చేరాడు .
అక్కడే బియ్ చదివి క్రీడలలో కూడా ఆసక్తి కనబరచి ,చదువేకాక ,ఉత్తమ కావ్య పఠనం కవిత్వం రాయటం ,అక్షరశ్లోక పోటీలలో పాల్గొనేవాడు .అన్నిట్లో వేలుపెట్టటం తో చదువు తగ్గి మొదటి ఏడాది పరీక్ష తప్పి తర్వాత పాసయ్యాడు .సంస్కృత ప్రశ్నలకు సమాధానాలు శ్లోకాలో రాసి ఆశ్చర్య పరచేవాడు.పరిక్ష మొదటి సారి తప్పినందున బాగా వ్యాకులం చెంది తన మనో వేదనను సంస్కృత శ్లోకాలలో ‘’భంగ విలాప కావ్యం ‘’గారాసిన సమర్ధుడు వర్మ .కెమిష్ట్రి పరీక్షకు మద్రాస్ వెళ్ళిన సందర్భంగా ఆ అనుభవాన్ని డైరీలో గ్రంథస్తం చేశాడు .శోరనూరు నుంచి రైలెక్కి ,కొంతదూరం ఎడ్లబండిలో ,మరికొంతదూరం పడవలో ప్రయాణం చేయాల్సి వచ్చింది .
అన్ని అర్హతలు ఉన్న రాజ రాజవర్మ తన కూతురికితగిన వాడని విశాఖం తిరునాళ్ మనసులో భావించాడు .రాజు మరణం తో అది కార్య రూపం దాల్చలేదు . .వర్మ పెద్ద మేనమామ కోయి తంపురాన్ మేనల్లుడికి సంబంధాలు చూసి ,తన మూడవ కూతురు ‘’స్వాతి తిరునాళ్ మహాప్రభ తంపు రాట్టి ‘’ నిచ్చి పెళ్లి చేశాడు .ఆమెకు వర్మపై గొప్ప అనురాగం ఉండేది .26వ ఏట బిఎ పాసై ,మళయాళ క్షత్రియ కులం లో మద్రాస్ యూని వర్సిటి నుంచి మొదటి పట్టభద్రుడు గా రికార్డ్ సృష్టించాడు .దీనికి అనేక బహుమతులతోపాటు రాజా శ్రీమూలం తిరునాళ్ వారి రత్నఖచిత స్వర్ణ కంకణ బహుమానం కూడా పొందాడు .
రచనలు
బాల్యం లోనే కవిత్వం అబ్బటం తో మద్రాస్ విశ్వవిద్యాలయ ఎం ఎ పరీక్ష కూడా రాసి ,వెంటనే ‘’విమానాష్టకం ‘’రాశాడు ఒక యూరోపియన్ మద్రాస్ లో వాయువు నింపిన విమానం లో అంతరిక్షం లోకి ఎగరటానికి చేసిన ప్రయత్నమే ఇందులోని వృత్తాంతం .ప్రేక్షకుల ఉత్కంఠ ,ఉత్తెజాలను అద్భుతంగా వర్ణించాడు .తన రెండవ కూతురు మరణం తో వియోగం పొందిన తండ్రి దుఖాన్ని ‘’పితృవిలాప’’అనే స్మృతి కావ్యం గా ‘’గా రాశాడు .స్నేహితుల ప్రోద్బలం తో పత్రికలకు పంపటానికి రాసిన సరస్వతీ స్తవం ,దేవీ మంగళం ,రాగ ముద్రా సప్తకం ,శ్రీ పద్మనాభ పంచకం ,దేవీ దండకం ఉన్నాయి .ఇంగ్లీష్ కన్నా సంస్కృతం గొప్ప అని తెలిపే ‘’గైర్వాణి’’విజయం రాశాడు .షేక్స్పియర్ ఒథెల్లో నాటకానికి అనువాదంగా ‘’ఉద్దల చరిత్ర ‘’వచన కావ్యం రాశాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-21-కాంప్ -బాచుపల్లి -హైదరాబాద్

