మోపూరు కాలభైరవుడు-1 అనే పుస్తకాన్ని తెలుగు పండిట్ విద్వాన్ రాయరే రచించి మోపూరు కాల భైరవ స్వామికే అంకితమిచ్చి ,2002లో ,జొన్నా ఈశ్వరయ్య వరలక్ష్మి దంపతుల బుజ్జి అనే సుబ్బ లక్ష్మి అకాలమరణానికి జ్ఞాపకార్ధంగా కడప జిల్లా పులివెందుల లోని మమత ఆఫ్ సెట్ ప్రింటర్స్ లో ప్రచురించారు .వెల 10రూపాయలు . సీస పద్యం లో కవి తన వంశాన్ని చెప్పారు .రామి రెడ్డి గంగంమలకు నారాయణుడుపుడితే ,ఈయనకు సూరమామ్బకు కొండ రెడ్డి పుట్టగా ,ఇతనికి సిద్ధమా౦బ చిన్న వీరా రెడ్డి కలుగగ ,ఈయనకు గంగమ్మకు మనకవి సంస్కృతాంధ్ర హి౦దీ విశారదుడు ,కర్షక కవి పండిత గాయకుడు రాయరె జన్మించాడు .అసలు పేరు రామి రెడ్డి యల్లారెడ్డి . ఈకవి తన హృదయ వేదనగా యల్లా రెడ్డి గాయాలు ,యల్లారెడ్డి సూక్తి ముక్తావళి ,అభినవాంధ్ర బిల్హ నీయం ,ఆధునికాంధ్ర మేఘ దూతం ,మోపూరు కాలభైరవుడు ,యల్లారెడ్డి రూపకాలు ,యల్లారెడ్డి గేయాలు నాటకాలు బుర్రకధలు ,పద్య ఖండికలు రాశాడు .తర్వాత మోపూరు కాలభైరవుడు గురంచి చెప్పారు . మోపూరు లేదుకాని మోపూరు కాలభైరవుడు కదలకుండా ఉన్నాడు .ప్రళయం వచ్చినా చెక్కు చెదరడు.కారణం స్వయంభు విగ్రహుడు ,.హరిహరాత్మజుడు భైరవుడు ప్రళయ జలాలలో మునిగిపోక నిలిచి ఉంటారు .కడప మండలం పులి వెందుల లో మురికినాట నల్ల చెరువు పల్లెకు అల్లంత దూరం లో మోహనగిరిపై మోపూరు లో తానుగా పుట్టి పెరిగిన దైవమైన దేవ దేవుడు కాలభైరవ స్వామి భక్తులపాలివాడు ,దర్శిస్తే చాలు ముక్తినిచ్చేవాడు కొలువై ఉన్నాడు అని సీస పద్యం లో కవి వర్ణించారు .కాలక్రమం లో అంతా మారి పట్టించుకొనే వారులేక సారాయి బట్టీల అడ్డా గా మారింది .స్వామికి పూజా పునస్కారాలు లేవు .అప్పుడు జోగి సుబ్బన్న అనే ఆయన కవి దగ్గరకు వచ్చి కాలభైరవుని ,స్థల మహాత్మ్యాన్ని సమాచారం ఉంటె ఇస్తే ప్రచారం చేస్తానన్నాడు .కవి ఇవ్వగా అతడు అలానే అని గుఱ్ఱము మీద తిరుగుతూ ప్రచారం చేసి డబ్బు సంపాదించగా కవి గారు దేవాలయాన్ని దేవుడినీ వదిలేసి ఇదేమి పని అని చీవాట్లుపెడితే ,తర్వాత దేవాలయం కోసం కొంత శ్రమించాడని కవి ఉవాచ .ఇక ఆలయ చరిత్ర స్వామి విశేషాలు రేపు తెలుసుకొందాం . సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,130,536 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.6 వ భాగం.25.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి. 3 వ భాగం.25.3.26.
- శ్రీరామ కర్ణామృతం.9 వ భాగం.25.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.153 వ భాగం.25.3.26.
- శ్రీ పత్తిపాటి వారి పంచామృతాలు
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి.షేక్స్పియర్ సాహిత్య వైభవం.5 వ భాగం.24.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.2 వ భాగం.24.3.26.
- శ్రీరామ కర్ణామృతం.8 వ భాగం.24.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.152 వ భాగం. సుందర కాండ.24.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి . కథాంజలి.1 వ.23.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,863)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
