విశ్వ పుత్రిక తోరూ దత్-5

విశ్వ పుత్రిక తోరూ దత్-5

రాం బగాన్ లో

దత్తు కుటుంబం మొదట్లో బెంగాల్ లోని బర్ద్వాన్ జిల్లా అజాపూర్ లో ఉండేవారు కాయస్తులు .నీలమణి దత్ 3-1-1757న జన్మించాడు .తన వ్యక్తిత్వం వలన అందరికి స్పూర్తి కలిగించాడు .ఆయన తండ్రి కొందరు కుటుంబ సభ్యులని బర్ద్వాన్ లోనే వదిలిపెట్టి కలకత్తా లోని రాం బాగాన్ కు  చేరాడు .ఉదారస్వభావంతో అందరికి దగ్గరయ్యాడు .నీలమణి కి రసమయి హరీష్ ,పీతాంబర్ అనే ముగ్గురు కొడుకులు .రసమయి మూడవకొడుకు తోరూతండ్రి గోవిన్ దత్ .మిగిలిన వాళ్ళు కిషన్ చందర్ ,కైలాస చందర్ హరి చందర్ ,గిరి చందర్ .పీతాంబరుని పిల్లలు ఈశాన చందర్ ,శశి చందర్ .ఈశానుడి కొడుకే ప్రసిద్ధ రచయిత ,తత్వవేత్త రమేష్ చందర్ .ఇప్పటికీ ఆయన నివసించిన ఇల్లు ఉంది .అందులో ఆయన చుట్టం అశోక దత్ ఉంటాడు .

  తోరూ తాత రసమయి దత్ ఆంగ్ల సాహిత్యాన్నీ అర్దికశాస్త్రాన్నీ బాగా అభ్యసించాడు .హిందూకాలేజీ కమిటి గౌరవ కార్యదర్శి .స్మాల్ కోర్ట్ లో జడ్జి ,అప్పిలేట్ కోర్ట్ లో కమీషనర్ .ఆయన లైబ్రరీ లోని ఇంగ్లీష్ సాహిత్య పుస్తకాలు ఇంటి వారందర్నీ ఆకర్షించాయి .రసమయి తండ్రి బాగా డబ్బు ఖర్చు చేసి పూజా పునస్కారాలు దాన ధర్మాలు చేయటం కొడుకుకు ఇష్టం ఉండేదికాదు .అందుకే సనాతన బ్రాహ్మణ్యం పై ఈసడింపు పెరిగింది .తోరూ పుట్టటానికి రెండేళ్ళ ముందే 14-5-1854న రసమయి చనిపోయాడు .బైబిల్ లో ఇంట్లో వారందరికీ ఆయన మార్గదర్శి .

 దత్తు కుటుంబం క్రైస్తవానికి మారటానికి కారణాలు s.m.మాకే 29-6-1854న రాసిన ఉత్తరం లో ఉన్నాయి .రసమయి చనిపోయి దహనక్రియలు పూర్తయ్యాక ,పెద్దకొడుకు కిషన్ కు తీవ్రంగా జబ్బు చేసి,చనిపోయాడు .చావు బతుకులతో ఉన్న అన్నకోసం తమ్ముడు గిరీష్ ‘’అజిల్ వీ టెంపుల్ ‘’అనే మిషనరీని పిలిపించి ,తన అన్న చనిపోయేముందు పరలోకం చూశాడని ,క్రైస్తవం పై నమ్మకం పెంచుకున్నాడని ,మతం తీసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడని చెప్పాడు  .ఈమిషనరి రావటం ఇంట్లో వారికి ఇష్టం లేదు .గిరీష్ తానె మతం తీసుకొని అన్నకు క్రైస్తవం ఇప్పించాడు .కొన ఊపిరితో ఉన్న కిషన్ ఇంట్లో వారందర్నీ క్రైస్తవం తీసుకోమని చెప్పి చనిపోయాడు .

  కిషన్ చనిపోయాక ఇంట్లో వారంతా బాగాచర్చించుకొని క్రైస్తవం తీసుకోవటానికి సిద్ధపడ్డారు .కానీ స్త్రీలు వ్యతిరేకించారు .1862లో కానీ దత్తు కుటుంబ సభ్యులంతా క్రైస్తవులు కాలేకపోయారు .గోవిన్ బాబు బృందావన్ మిట్టల్ కూతురు హిందూపురాణాలను పుక్కిటపట్టిన సంప్రదాయవాదిక్షేత్రమణి ని పెళ్ళాడాడు.ఆమె బెంగాలీ బాగావచ్చిన విద్యావేత్త .ఇంటి పెత్తనం అంతా ఆమెదే .కూతురు తోరూ కు పురాణగాధలు కధలుగా గీతాలుగా చెప్పేది .తల్లిపాడే ఆపాటలకు ఆమెకు కంటి నుండి ఆనంద బాష్పాలు రాలేవి .1862లో ఈమె క్రైస్తవం పుచ్చుకొన్నా ,హిందూ విశ్వాసాలను మనసులో భద్ర పరచుకొనే ఉంది .క్రమంగా ఆమె పూర్తి విశ్వాసంకల క్రైస్తవురాలయింది .భర్త తనకూ భార్యకూ మధ్య పెద్ద అఘాతం ఏర్పడుతుందేమో నని భయపడ్డాడు కానీ అలా జరగాకయేసరికి ఊపిరి పీల్చుకొని ఆ భావాలను ఒకకవితలో నిక్షిప్తం చేశాడు –‘’ఒద్దువెళ్లి పోవద్దు –ఒక్క నిమిషం నిలు –నన్ను శపిస్తూ చీదరించుకోకు –అందరిలాగే నువ్వూ –నన్ను అడవిలో వదిలేసి పోవద్దు –ప్రతిమల్ని నిరసిస్తూ –ప్రభువు ము౦దు మోకరిల్లె –నన్ను వదిలేసి వెళ్ళద్దు ‘’

  పెళ్ళయ్యాక ఆమె ఇంగ్లీష్ జ్ఞానాన్ని బాగా పెంచుకొన్నది .’’ది బ్లడ్ ఆఫ్ జీసెస్ ‘’ను బెంగాలీలోకి అనువదించింది .దీన్ని ట్రాక్ట్ అండ్ బుక్ సొసైటీ ముద్రించింది .ఆకుటుంబం లోఎక్కువకాలం బతికింది ఈమె మాత్రమె .పవిత్ర యోగినిలా బతికి క్షేత్రమణి1900లో మరణించింది .కూతుళ్ళు ఇద్దరిపైనా ఈమె ప్రభావం తండ్రి ప్రభావం బలంగా ఉన్నాయి .తండ్రి నుంచి తెలివి పాండిత్యం,తల్లి నుంచి  నైతిక హృదయ సౌందర్యమ నిర్మలత్వం  తోరూ పొందింది .

  రసమయి కొడుకుల్లో గోవిన్ పరమ ఉదారుడు .హిందూకాలేజిలో చేరి ప్రొఫెసర్ రిచర్డ్సన్ గారి ముఖ్య శిష్యుడయ్యాడు .గోవిన్ ,మధుసూదన్ కలిసి కాలేజీలో నాటకాలు ఆడారు .షేక్స్పియర్ పోయెట్రి ఎలా చదవాలో గురువు వద్ద నేర్చాడు .ఆకాలం లో హిందూకాలేజీ అనేకమంది రచయితల్ని కవులనూ తయారు చేసింది .చిన్నప్పటి నుంచి కవిత్వం రాసే అలవాటున్న గోవిన్ కొన్నికవిత లను ఒక సంపుటంగా ప్రచురిస్తే బ్లాక్ వుడ్ పత్రిక చక్కని విమర్శ చేసి ప్రోత్సహించింది .చదువు పూర్తయ్యాక ప్రభుత్వ శాఖలో ఆదాయ వ్యయ శాఖాదికారయ్యాడు .బెంగాలీలను చిన్న చూపు చూస్తున్నాడు అనే అభియోగం తో బొంబాయికి బదిలీ చేశారు .అక్కడ కుటుంబం పెట్టినా ఉద్యోగం ప్రోత్సాహకంగా లేక రాజీనామా చేసి ,కలకత్తా వచ్చి సాహిత్య, మత కార్యక్రమాలలో మునిగిపోయాడు .

  1873లో లండన్ నుంచి కుటుంబం తో తిరిగొచ్చాడు లండన్ లో  అక్క ఆరూను ప్రతిభా వంతురాలు తోరూను పెద్ద జబ్బు కబళించగా ఇండియా వచ్చారు .ఇంగ్లాండ్ లో తొరూ రాసిన కవిత్వాన్ని ఎడ్మండ్ గాసే బాగా మెచ్చుకొన్నాడు .ఆమె ఇంకొంచెం కాలం బతికి ఉంటె ఆంగ్ల సాహిత్యం లో తన పేరు చిర స్థాయిగా నిలుపుకోనేది అని కితాబిచ్చాడు .ఇద్దరు పిల్లల మరణం తర్వాత తండ్రి కొద్దికాలం మాత్రమె జీవించి ఉన్నాడు .తర్వాత భార్య ఆయన్ను అనుసరించింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-22-ఉయ్యూరు   

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.