గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-6
1837లో జమీందార్లు స్వంత సంఘం ఏర్పాటు చేసుకొని ,1839 రామమోహన రేయ్ మిత్రుడు రివ్రెండ్ ఆడం ఏర్పాటు చేసిన బ్రిటిష్ ఇ౦డియాసొసైటీకి అనుబంధంగా మార్చారు .ఇంగ్లాండ్ వెళ్ళిన ద్వారకానాద టాగూర్ అక్కడి బ్రిటిష్ లేబరలిస్ట్ జార్జిథాంప్సన్ ను తీసుకువచ్చాడు .ఆయన సూచనపై 1843లో బెంగాల్ బ్రిటిష్ ఇండియాసోసైటీఎర్పాటు చేశారు .థాంప్సన్ భారత దేశ రాజకీయ విజ్ఞాన వ్యాప్తికి నాంది పలుకగా ,ఒకటి సంపన్నులకు మరోటి మేధా సంపన్నులకు ప్రాతి నిధ్యం వహించాయి .వీటివల్ల జమీందారీ సోసైటీ , బెంగాల్ సొసైటీలు ఏమీ అభి వృద్ధి పొందింది లేదు .
1849లో డ్రింక్ వాటర్ చేతూన్ స్థానిక కోర్టుల పరిదిలోకి బ్రిటిషర్లను కూడా చేర్చాలని బిల్లు ప్రవేశ పెట్తిన తర్వాత కానీ దేశం లో రాజకీయోద్యమం ఊపందుకోలేదు .బిల్లు ఆమోదం పొందిన కార్యాచరణ జరగలేదు .బ్రిటిష్ ప్రయోజనాలకోసం బిల్లు రద్దు చేశారు .దీనితో రెండు సంఘాలు కలిసిపోయి బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ గా ఏర్పడ్డాయి .ఇది సంస్కరణల తో ఉన్న రాజకీయ సంస్థ .ఇలాగే మద్రాస్ బొంబాయి పూనాలలో కూడా ఏర్పడ్డాయి .తమ ఉనికిని ఈ సంస్థ చాటుకొని శాసన సభలలో భారతీయులను చేర్చాలనీ ,ఇంగ్లాండ్ ,ఇండియాలో ఒకేసారి ఇండియన్ సివిల్ పరీక్షలు జరపాలనీ ,బ్రిటన్ లో పుట్టిన వారితో సహా చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రాన్ని ఆమోదించాలని వత్తిడి తెచ్చారు .1861లో బ్రిటిషర్ల హక్కులన్నిటినీ భారతీయ మాజిష్ ట్రెట్లుకాని న్యాయమూర్తులుకాని విచారణ జరుపరాదు అనే ఒక్క మినహాయింపుతో రద్దు చేశారు .1882-83లో బిల్లుపైఆ౦దోళనయెక్కువై పరిస్థితులు క్లిష్టమయ్యాయి .
సిపాయిల తిరుగు బాటును ప్రముఖులవర్గం ప్రభుత్వాన్ని బలపరచటం ఆశ్చర్యకరమైన విషయం ..అయితే తర్వాత వారిలోనూ ఒక కుదుపు వచ్చి౦ది.హిందూ పెట్రియట్ సంపాదకుడు హరిశ్చంద్ర ముఖర్జీ ‘’భారతీయుల సమస్యలు భారతీయులే పరిష్కరించుకొనే సమయం వచ్చింది .తిరుగుబాట్లు ఆంగ్లేయులకు అలవాటై పోయాయి .స్వదేశస్తుల భాగస్వామ్యం లేకపోతె ఇలానే ఉంటుంది ‘’అని రాశాడు .అప్పటికి ఇంకా దేశానికి స్వాతంత్ర్యం రావాలి అనే డిమాండ్ రాలేదు .తమకు, బ్రిటిషర్లకు సమానహక్కులే కోరారు .శక్తి వంతమైన జాతీయోద్యమం అవసరం అయింది .
భారతీయ సంపదను దోచుకొంటూ తమ దేశానికి తరలిస్తూ ,అక్కడి ప్రభుత్వానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు .కంపెనీ మాజీసైనికాదికారి విలియం బోల్డ్స్ కలకత్తాలో 1776లో ఒక ఇంగ్లీష్ వార్తా పత్రిక పెట్టాలనుకొని సన్నాహాలు చేసుకొని భంగపడ్డాడు .కంపెనీ భయపడి ఆయన్ను ఇంగ్లాండ్ పంపించేసింది .జే ఎ హక్ అనే మరో ఇంగ్లీష్ వాడు ‘’ది బెంగాల్ గెజిట్ ‘’ప్రారంభించి దాన్ని ప్రభుత్వ బాకా పత్రికగా మార్చాడు .ఇది జర్నలిజం లో నీచాతి నీచంగా భావించారు .1786నాటికి బెంగాల్ లో 4,మద్రాస్ లో 1ఇంగ్లీష్ పేపర్లు ఉండేవి .1789లో బొంబాయిలో మొదటి వార్తాపత్రిక వచ్చింది .ఈ పత్రికల ఎడిటర్లు అందరూ ఆంగ్లేయులే .ఏ సంపాదకుడైనా ప్రభుత్వాన్ని అధికారుల్ని అందులో విమర్శిస్తే వాళ్ళను అర్జెంట్ గా లండన్ తోలేసేవారు .ప్రెస్ లపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి .19వ శతాబ్ది ప్రారంభానికి కలకత్తాలో 7 వార్తా పత్రికలున్నాయి.1813-18మధ్య ప్రచురణ రంగం లో మిషనరీలుకూడా అడుగుపెట్టారు . దిగ్ దర్శన్ అనే బెంగాలీ మాస పత్రిక ,సమాచార దర్పణ్ అనే బెంగాలీ వార్తా పత్రిక ,ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ మంత్లీ మిషనరీలు స్థాపించారు .ఇవన్నీ అధికారుల కను సన్నలలో మెదిలేవే .1818లో ఆంక్షలు ఎత్తి వేయగా రామమోహన రాయ్ ,జేమ్స్ ,సిల్క్ బకింగ్ హాం ,లు పత్రికలూ స్థాపించారు .కలకత్తా జర్నలో బకింగ్ హాం ఈస్ట్ ఇండియా కంపెని అక్రమ పాలన ను తూర్పారపట్టాడు .ప్రభుత్వం మండిపడి,1823లో ఆయన్ను లండకు తరిమేశారు .కానీ ఆయన అక్కడ కూడా తన ఉద్యమాన్ని కొనసాగించాడు .
రామమోహన రాయ్ బెంగాలీలో సామ్బాద్ కౌముది ,పర్షియన్ లో మీరతుల్ అక్బర్ ,ఇంగ్లీష్ లో ‘’బ్రాహ్మణకాల్ మేగజైన్ ‘’స్థాపించి నడిపాడు .ఇవన్నీ కొద్దికాలం చాలా స్వేచ్చగా నడిచాయి .దీన్ని రాయ్ బాగా సద్వినియోగ పరచుకొన్నాడు .1823లో పత్రికా స్వాతంత్ర్యం పోయింది .భారతీయ పత్రికలకు రాయితీలు చాలా తక్కువగా ఉండేవి .సనాతన హిందూ ధర్మపత్రికలకు స్వేచ్చ బాగానే ఉండేది.సంస్కరణ వాద పత్రికలలో విమర్శక విషయాలు లేకపోతేనే అనుమతించేవారు .1830కి బెంగాల్ లో ఇంగ్లీష్ లో దినపత్రికలు వార ,పక్ష మాసపత్రికలు 33 ఉండేవి .భారతీయ పత్రికలూ 16మాత్రమె .ఇవికూడా ఎక్కువకాలం సాగలేదు .మిగిలినవి వ్యాపార ప్రకటనతో సరిపెట్టుకున్నాయి .
1835లో ఆంక్షలు ఎత్తేయటం తో విరుద్ధభావప్రచారాలకు వివిధ పత్రికలమధ్య పోటీ ఉండి,సిద్ధాంత పరమైన ఘర్షణలతో జర్నలిజం ఉండేది .హిందూ మితవాదులు సంస్కర్తలు ,మిషనరీలు కలం యుద్ధం లో మునిగిపోయారు .1850నుంచి బెంగాల్ పత్రికలూ ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపించటం మొదలు పెట్టాయి .1853లో హరిశ్చంద్ర ముఖర్జీ స్థాపించిన ‘’హిందూ పేట్రియట్’’ తప్పు చేసినవారి పాలిటి సింహస్వప్నం లా ఉండేది .విద్యాసాగర్ గారి బెంగాలీ వారపత్రిక ‘’సోం ప్రకాశ్ ‘’ మరో పత్రిక ఇండియన్ మిర్రర్ పక్షపత్రిక లు నీలి విప్లవాన్ని వ్యతిరేకించి మార్గదర్శనం చేశాయి .1862లో బెంగాలీ అనేది వారపత్రికగా మొదలై ,సురేంద్రనాధ బెనర్జీ నాయకత్వం లో జాతీయోద్యమానికి కొమ్ము కాసి ప్రముఖ పత్రిక గా రూపు దాల్చింది .
మోతీలాల్ ఘోష్ ఆయన అన్నయ్య ప్రజాజీవితం లో ప్రవేశించే నాటికి బెంగాల్ పరిస్థితులన్నీ పై విధంగా ఉన్నాయి .ఈ సోదరులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారు .జాతీయోద్యమంలో గ్రామీణ పేదప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వీరి నాయకత్వం లో ఆ ప్రజల భావాలకు దర్పణంగా నిలిచారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-7-22-ఉయ్యూరు