–మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -3(చివరిభాగం )

–మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -3(చివరిభాగం )

1971లో కూతురు వైదేహి కి బ్రిటీష ఇండియా చరిత్ర రాయటంలో తండ్రి ఆచార్య మామిడిపూడి తోడ్పడ్డారు .ఉస్మానియాలో రాజనీతి లో ఎం ఎ చేస్తున్న మనుమరాలు శాంతకు ఆమెకోరికపై ప్రామాణిక గ్రంధాలు చదివి ,విషయాలు నోట్స్ గా రాసుకొని వారానికి నాలుగు రోజులు బోధించి తాము యూనివర్సిటిలో లెక్చర ర్ గా ఉండి బోధించిన దానికంటే ఎక్కువ శ్రమ చేశారు .సాంఘిక శాస్త్ర పాఠ్య ప్రణాళికా కార్యక్రమాలు రావన కాష్టం అవటంతో విసుగొచ్చి ,ప్రభుత్వమూ పెడ చెవిన పెడితే రాజీనామా చేయాలనుకోగా,ఇంతకాలం కష్టించి మానుకోవటం మర్యాదకాదని కొనసాగించారు .1930  కుటుంబంతో దక్షిణ దేశ యాత్ర నెలరోజులు  ,1970లో నూ మళ్ళీ ఉత్సాహంగా చేశారు .

  1967 కార్మికులు యజమానులను అధికారులని తమ డిమాండ్ల విషయంలో ఘెరావ్ చేయటం మొదటి సారిగా ప్రారంభమై తర్వాత అది విద్యార్ధులకూ అలవాటై వికృత సంస్కృతికి దారి తీసినందుకు ఆవేదన చెందారు . ఆ ఏడాదే  హైదరాబాద్ లో మున్సిపల్ పన్నుల విధానం ,పరీక్షల సంస్కరణ ,కెవి గోపాలస్వామి రచన’’ పరిపాలనా శాఖలో సంస్కరణలు ‘’మతాదార రాజకీయ పక్షాలపై ఆంక్ష సదస్సులలో ఆచార్య పాల్గొన్నారు .1970 లో గాంధి శత జయంతికిఢిల్లీ నెహ్రు మ్యూజియం వారు ‘’అహింసా తత్వాన్ని ‘’గురించి రాసి పాల్గోనమనగా వ్యాసం రాసి అనారోగ్యం వలన వెళ్ళలేక ఉస్మానియా వారి చర్చలో పాల్గొన్నారు .భారత దేశం లో జాతీయత ,పై మూడు ఉపన్యాసాలు ఆంధ్రా యూని వర్సిటిలో ,’సమాఖ్య విధానం పై కొన్ని సిద్ధాంతాలు ‘’పూనా యూని వర్సిటిలో ప్రసంగించారు .ఇవికాక మేగజైన్స్ కు వ్యాసాలూ రేడియో ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు .హైదరాబాద్ లో సెంట్రల్ యూని వర్సిటి ,ఉస్మానియా ఉండటం తో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం లో పాల్గొంటూనే ఉన్నారు .కొఠారి కమిషన్ సూత్రాలు అమలుకాలేదు .’’ది డెష్టిని ఆఫ్ నేషన్ టెక్స్ రూట్స్ ఇన్ క్లాస్రూం’’అనేది ఆయన స్లోగన్ ,మాకోల్లూరి ఎప్పుడూ దీన్ని గుర్తు చేసేవారు మేము నవ్వుకొనే వాళ్ళం  ఆంద్ర విశ్వ విద్యాలయ  స్వర్ణోత్సవాలకు 1600 తర్వాత ఆంధ్రుల చరిత్ర ,1858 తర్వాత పాలనా చరిత్ర పై రాయమని కోరితే మామిడిపూడి వారు రాసి పంపారు.

  ఒకటి నుంచి పది వరకు పాఠ్య గ్రంధాలు తెలుగులో ఇంగ్లీష్ లో రాసేవారికి తగిన అనుభవం శ్రద్ధ లేక పోవటం నచ్చలేదు .భారమంతా మోస్తూ పీఠిక పాఠ్యప్రణాలిక ,ఆశయం మొదలైనవి ఆచార్య రాసి తంతు పూర్తీ చేయాల్సి వచ్చింది. NCERT,SCERTలు కాడిపారేశాయి.  అప్పటికి ఎవరూ .సాంఘిక శాస్త్రాన్నిపుస్తకం ఎవరూ రాయలేదు. ఆబాధ్యత వీరిపైనే పడింది .1970జులై 27 ఆచార్య వర్యుల షష్టి పూర్తీ మహోత్సవం జుబిలీ హాల్ మహా వైభవంగా జరిగింది .ఇంటర్ డిగ్రీ లకు తెలుగు పాఠ్య గ్రంధాలు రాసే బాధ్యతా వీరిపైనే పడి,కమిటీ అధ్యక్షులయ్యారుకాని ఆతరవాత తెలుగు అకాడెమి బాధ్యత తీసుకోవటం తో ఊపిరి పీల్చుకొన్నారు .

రెండు సార్లు తెలంగాణా ఉద్యమం పుట్టు పూర్వోత్తరాలు స్వార్ధ రాజకీయాలు ఎండగట్టారు .అన్ని వర్గాల వారు సుసంఘటితులై సాంఘిక న్యాయం అంటే సోషల్ జస్టిస్  సాధిస్తేనే ప్రగతి అన్నారు ఆచార్య .ఇండియా పాక్ యుద్ధం చైనా ఇండియా యుద్ధం మన కు రాజకీయ అవగాహనా రాహిత్యమే కారణమన్నారు. MISA దుర్వినియోగం ప్రజాస్వామ్య హక్కుల హరణం కు బాగా కలత చెందారు .రాష్ట్ర పతులు వారి నిర్వాకం కూడా వివరించారు .కిచెన్ కేబినేట్ జనతా ప్రయోగం ,ఎమర్జెన్సీ వగైరాలను కళ్ళకు కట్టించారు .PL80 అనుభవాలు చెప్పారు .ఏ పరిష్కారం సమాజాన్ని దారిలో పూర్తిగా పెట్టలేకపోవచ్చు .ఒకదాని తర్వాత మరో సమస్య వస్తుంది .ఇదే మానవ చరిత్ర లక్షణం అన్నారు ఆచార్య విశేషానుభవంతో .

  1962లో రాష్ట్రపతి పద్మ భూషణ్ పురస్కారం అందించాక మన ఆంద్ర విశ్విద్యాలయం చురుకుపుట్టి గౌరవ డిలిట్ అందించింది .చింతామణి దేశముఖ్ దుర్గాబాయ్ మామిడిపూడి వారి గ్రంధాలపై గొప్ప ప్రసంగాలు చేశారు .ఢిల్లీ ఆంద్ర సంఘం పురస్కారాలు అందుకోన్నవారికి ఆత్మీయ సత్కారం జరిపారు .ఇన్ ష్టి ట్యూట్  ఆఫ్ పబ్లిక్అడ్మిని స్ట్రేషన్ లో ఆచార్య ప్రసంగించారు .సమాఖ్య ప్రధాన లక్షణాలు గురించి విపుల పీఠికతో 890పేజీల ఉద్గ్రంధం రాశారు ఆచార్య మామిడిపూడి .వీరు రాసిన’’ సం యాస్పెక్ట్స్ ఆఫ్ డెమొక్రాటిక్ పాలిటిక్స్ ఇన్ ఇండియా ‘’ను మైసూర్ యూనివర్సిటి ప్రచురించింది .ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్స్ పై ఒక పుస్తకం రాశారు .1966-74మధ్య సమకాలీన సమస్యలపై రేడియోలో 22ప్రసంగాలు చేశారు .జాతీయ రంగంలో పరిణామాలుపై  వ్యాస పర౦పర  రాశారు .యూని వర్సిటి అటానమి మున్సిపాలిటీల కార్యకలాపాలు ప్రొహిబిషన్ ,సాంఘిక శాస్త్ర అధ్యయనంలో మార్గదర్శకాలు ఇల్లిటరసి –డెమోక్రసీ సదస్సులలో పాల్గొని ప్రసంగించారు .ప్రభుత్వ పత్రిక ఆంద్ర ప్రదేశ కు తరచుగా వ్యాసాలూ రాసేవారు .డక్కన్ హెరాల్డ్ ,ఇల్లస్త్రేటేడ్ వీక్లి ఇండియా క్వార్ట ర్లికి కూడా రచనలు పంపేవారు .ఆంధ్రాలో పంచాయితీ రాజ్ గ్రంధం రాశారు .పంచాయితీ రాజ్ లో ఉద్యోగ నియామకాలు ,అర్బన్ డెవలప్ మెంట్ లపై    ప్రసంగించారు .

  1965లో అన్ని వ్యాసంగాలలో పాల్గొంటూనే 35గ్రంధ సమీక్షలు ,పది రేడియో ప్రసంగాలు చేశారు .మైసూర్ లో జరిగిన ఇండియన్ పొలిటికల్ సైన్స్ కాంగ్రెస్ లోపాల్గొని ప్రసంగించారు .దార్వార్ లో ‘’డైలమాస్ ఆఫ్ డెమొక్రాటిక్ పాలిటిక్స్ ‘’పై మాట్లాడారు .మద్రాస్ అమెరికన్ సొసైటి హెన్రీ డేవిడ్ థొరో రాసిన ‘’వాల్డెన్ ‘’గ్రంధాన్ని వారికోరికపై తెనిగించారు .హైదరాబాద్ రవీంద్ర భారతి లో జరిగిన ‘’గురు పూజ ‘’ఉత్సవ౦ లో  శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు పాద పూజ చేయటం హై లైట్ .

మామిడిపూడి వెంకటరంగయ్య (1889 – 1981) రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను.

బాల్యము, విద్యాభ్యాసము

ఈయన 8 జనవరి 1889లో నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటేశమ్, నరసమ్మ.

బాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత ఆంగ్ల విద్య కోసం మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చయప్ప కళాశాలలో పనిచేస్తూ అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువుతున్న కాలంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత.

ఉద్యోగము

రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రోత్సాహం మీద కాకినాడ లోని పిఠాపురం రాజావారి కళాశాలలో చరిత్రాధ్యాపకులుగా 1910లో చేరి 1914 వరకు నిర్వహించారు. తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో అధ్యాపకులుగా 1927 వరకు పనిచేశారు. ఆ కాలంలో యువరాజైన అలకనారాయణ గజపతికి విద్యాదానం చేశారు తర్వాత సంస్థానంలో దివానుగా నియమితులయ్యారు.

వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 లో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు.

ఇతనికి భారత ప్రభుత్వం 1968లో పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

వ్యక్తిత్వం

ఎంతటి చిన్నవారైనా, చర్చలో ఎదుట వ్యక్తి నోరు విప్పితే, ఆయన మౌనంగా వినేవారు. చివరి రోజులలో మంచం మీద పడుకునే వ్రాసేవారు, చదివే వారు. మరొకరికి డిక్టేట్ చేసే అలవాటు లేదనేవారు. విమాన ప్రయాణం అంటే ఆయనకు భయం. రైల్లోనే ప్రయాణించేవారు. ఆయన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి సన్నిహితులు. అయితే 1968-69లో ఆంధ్రజ్యోతి దిన పత్రికను దృష్టిలో పెట్టుకుని, ప్రెస్ బిల్ అసెంబ్లీలో బ్రహ్మానందరెడ్డి తెచ్చారు. పత్రికా స్వేచ్ఛను హరించే ఆ బిల్లును వెంకట రంగయ్యగారు తీవ్రంగా విమర్శించారు. బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ బిల్ ను మూలబెట్టేశారు

నరిశెట్టి ఇన్నయ్యతో కలిసి ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం అనే తెలుగు గ్రంథాన్ని జాయింట్ రచయితలుగా వ్రాశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972లో ప్రచురించగా, సర్వీస్ కమిషన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు. సోక్రటీస్ భారతదేశంలోని గుర్గాన్ జిల్లాలోని ఓ గ్రామంలో తిరుగాడితే ఎలా ఉంటుందన్న విషయంపై ఈ గ్రంథాన్ని కల్పించి రాశారు. మామిడిపూడి వెంకటరంగయ్య నెల్లూరి జిల్లాలోని గ్రామంగా మార్చి అనువదించారు[1]

ఇతనికి భారత ప్రభుత్వం 1968 లో పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

మరణం

వీరు 1981జనవరి 13వ తేదీ హైదరాబాదులో తమ 93వ యేట మరణించారు. మరణించేనాటికి వీరికి భార్య, ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు[2].

మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్

మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ప్రస్తుతం సికింద్రాబాద్లో 1982 స్థాపించబడింది. దీనికి ఇతని మనుమరాలు శాంతా సిన్హా కార్యదర్శిగా పనిచేస్తూ అనాథ పిల్లల గురించి నిర్విరామంగా కృషిసల్పుతున్నారు. ఈమెకు పద్మశ్రీ, రామన్ మెగసెసే పురస్కారం లభించాయి.

 ఒక రకంగా పుంభావ సరస్వతి అయిన పద్మ భూషణ్ ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి జాదర్శ జీవితం యువతకే కాదు అన్నివయసులవారికి ప్రేరణ .వారి అసంఖ్యాక గ్రంధ రచన మానవాళికి వెలుగు బాట .వారి ఆలోచనలు నిత్య వసంతాలు అభి వృద్ధి దాయకాలు .అలాంటి మహా మహునిపై నేను ఫేస్ బుక్ లో వారి జ్ఞాపకాలను ప్రత్యక్ష ప్రసారంచేసి ధన్యుడ నయ్యాను .వారి గ్రంధ రచన ,ప్రసంగాలు వగైరాలను ఈతరం వారికి తెలియటానికి నాలుగు వ్యాసాలూ రాశాను .1970నుంచి బందరు నుంచి వెలువడే తెలుగు విద్యార్ధి పత్రిక అందులో వారిఅమూల్య వ్యాసాలూ ఆలోచనాత్మకమైన ప్రశ్నలు సమాధానాల నిర్వహణ  చదివే వాడిని అందులో నా వ్యాసాలూ కొన్ని వచ్చాయి .శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారితో గాఢ మైన అనుబంధ౦  నాకుంది కాని ఆకాలం లో గురుదేవ్ ఆచార్య మామిడి పూడి వారిని దర్శించుకోలేక పోవటం నా అదురదృష్టం .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-4-23-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.