, రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -14
1920 డిసెంబర్ నాగపూర్ కాంగ్రెస్ లో మాంటేగ్ సంస్కరణలను ఆరకంగా జరిగినా ,ఎన్నికలను పూర్తిగా వ్యతిరేకించటం జరిగింది .శ్రీనివాస శాస్త్రి నాన్ కొ ఆపరేషన్ ను పూర్తిగా వ్యతిరేకించాడు .ఈవ్యతిరేకతపై తన భావాలు వ్యక్తం చేసే సభలలో అయన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు .సున్నిత మనస్కుడైన శాస్త్రి దీనికి చాలా వ్యధ చెందాడు .పనికి రాని అభిప్రాయాలను మోయటం ఆయనకు ఇష్టం లేదు .బలీయమైన మహాత్మాను అడ్డుకోవటం అసాధ్యం కూడా .మహాత్ముడంటే ఆయనకు దైవాంశ సంభూతుడు పేదలను అక్కున చేర్చి సేద దీర్చే మహానుభావుడు .సంస్కరణలను వ్యతిరేకించి తెల్లప్రభుత్వం తో తలపడటం ఆషామాషీ కాదనుకొన్నాడు .ప్రజలపై ఎంతటి పట్టు ఉన్నా,సహాయ నిరాకరణ ఒక్కోసారి ఆయన చేతులు దాటిపోయి తీవ్ర సంచలనాలు కలుగవచ్చు హింసాత్మకంగా మారవచ్చు అని ముందే ఊహించాడు .అయన అంతరంగం యదార్ధమే సూచిస్తుంది –‘’తరాల భవితవ్యం ఆశలు శిధలమై అశాంతి ,అణచి వేట తీవ్రంగా ఉంటుంది .ప్రభుత్వానికి సామాన్యప్రజలకు మధ్య నిత్యం యుద్ధ వాతావరణమేర్పడి అలజడి తీవ్రం అవుతుంది ఇరువైపులవారికి వెనక్కి తగ్గే సావకాశం ఉండక పోవచ్చు. దేశప్రజల దుస్థితి భరించ రానిది అవుతుంది ‘’అన్నాడు.తీవ్ర క్షోభతో –‘’మనం మన పిల్లల విషయంలో వారి ఆశలను చిదిమేస్తున్నామేమో .తేలిక పరిష్కారం వదిలేసి సంక్లిష్ట మార్గం ఎంచుకొంటున్నామేమో ‘’అని రాశాడు .
గాంధీ అంటే వీరాభిమానం ఉన్న శాస్త్రి ఆయన భావాలకు ఇంతవ్యతిరేకంగా ఎందుకు మారాడు ?అది ఆయన రాజకీయ ఫిలాసఫీ ,ఆయన ధైర్యమైన వ్యక్తిత్వం ,నిర్దుష్టత ముందు చూపు ,మనస్సాక్షి .బర్క్ పండితుని శిష్యుడు కాకపోయినా శాస్త్రి వ్యవస్థ పతనం చెందటం ,అరాచకం ప్రబలటం ఇష్టం లేని వాడు . లార్డ్ రోస్ బరి బార్క్ ను గురించి ఏది చెప్పాడో శాస్త్రి విషయమూ అంతే –He loved reforms ,. Because he hated revolution . He hated revolution because he loved reform ‘’. శాస్త్రి ఎప్పుడూ రాజ్యాంగ ఆందోళనపై విశ్వాసం ఉన్నవాడు .శాస్త్రి –‘’గాంధీ సమకాలీనులు ఎంతటి చిల్లర దేవుళ్ళు అయినా ,దేశం పట్ల ,గాంధీ పట్ల బాధ్యత,విధి విధానం ఉండాల్సిన వాళ్ళు .వాళ్ళు అన్నీ స్పష్టంగా చూడలేరు .సరైన మార్గమేదో ,ఎలా ఎప్పుడు ప్రవర్తించాలో నిర్ణయించు కోలేరు .వాళ్లకు ఏది న్యాయం అని అనిపిస్తే అదే చేస్తారు .ఆయన ఉ త్క్రుష్టమైన మంచి సాధించటానికి ,అత్యంతమైన చెడును దేశానికి కలిగిస్తున్నాడేమో?చివరికి వారంతాకలిసి ఆయన్నే వ్యతిరేకించవచ్చు .అప్పుడు ఆయన వారిని కనీసం మందలించ లేడు కూడా ‘’అని రాశాడు శాస్త్రి .
గాంధీజీ జాతీయ విషయాలను తన సత్య శోధన లెక్క ప్రకారమే చేశాడు .శాస్త్రి మాత్రం మరింత నెమ్మదిగా వ్యవస్థలకు భంగం కలగకుండా బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా ధైర్యంగా చేయాలన్న భావన ఉన్నవాడు .వ్యక్తికీ దేశానికి మధ్య ఉన్న స్వభావంగా భావించాడు .ఒక వ్యక్తీ తన స్వంత విషయాలలో నిర్భయంగా జరిగబోయే పరిణామాలను గుర్తించకుండా ప్రవర్తించ వచ్చు.కానీ దేశ వ్యవహారాల,మొత్తం ప్రజల విషయం లో మాత్రం భయంతో జరగబోయే పరిణామాలను ఆలోచించి ముందడుగు వేయాలి .జాతీయ విషయాలలో తప్పనిసరిగా పిరికి తనం ఉండాలి .కారణం సంఘ శ్రేయస్సుతో అది ముడి పడి ఉంటు౦ది కనుక . 1926లో ‘’కమలా లెక్చర్స్ ‘’లో శాస్త్రి ‘’రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ‘’పై ప్రసంగిస్తూ –‘’మన అత్యుత్తమ మేధావులు విప్లకాత్మక అరాచక శక్తుల విషయం లో వారి విధి విధానం లో తప్పులు చేశారు ,విఫలమయ్యారు .ఇప్పుడు మనకున్న వ్యవస్థచట్రం లో లొసుగులు ఉన్నా ,భవిష్యత్తులో ఉత్తమ రీతిలో మార్చుకొనే అవకాశమున్నా ,ఉన్నదాన్ని విచ్చేదనం చేసుకొంటే ,కూల్చిపారేస్తే అ శిదిలాలమీద కొత్త నిర్మాణం చేయగలమా ?అందుకే నేను అలాంటి వినాశకర చట్టన్యాయ వ్యవస్థను కూల్చేసే విచ్చిత్తి చేసే ఉద్యమాలలో పాల్గొనలేదు పాల్గొనను కూడా .విధానం నాశనమైతే విధాన ప్రభుత్వం నాశనమౌతుంది ‘’అన్నాడు .
నూతన రాజ్యాంగ మండలి
శ్రీనివాస శాస్త్రి మాంటేగ్ –చేమ్స్ ఫర్డ్ సంస్కరణల ఫలితం గా ఆవిర్భవించిన నూతన రాజ్యాంగ మండలి –ది న్యు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కు ఎన్నికయ్యాడు .డ్యూక్ కాఫ్ కన్నాట్ –కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ,ఇండియన్ లెజిస్లేటివ్ అసెంబ్లి అనే ఉభయ సభల సంయుక్త సమావేశానికి 9-2-1921 నప్రారంబోత్సవం చేశాడు.డ్యూక్ చదివిన ప్రసంగం లోని కొన్ని పేరాలు నిజాయితీగా నిర్దుష్టంగా ,ఉన్నత భావ మిశ్రిత౦ గా ఉన్నాయనిపించాయి శాస్త్రికి .ఫిబ్రవరి 12 న కౌన్సిల్ ఆఫ్ స్టేట్ మొదటి సారి సమావేశమైనప్పుడు ‘’డ్యూక్ మాటలు అర్ధవంతంగా ఉన్నాయి .ప్రజలు తమ స్వాతంత్ర్య సిద్ధికోసం ఉన్న ఆకాంక్ష వ్యక్తమైంది .ఆయన అన్న మాటలు మరీమరీ చెప్పుకోతగినవిగా ఉన్నాయి –సాధారణంగా రాజకీయ స్వేచ్చ విప్లవం ద్వారా ,లేక అల్లరి గందర గోళం,అంతర్ యుద్ధం ద్వారా ప్రజల ఆస్తులు త్యాగాల వలన పొందుతారు .కానీ ఇక్కడ ఒక తరహా ప్రజలు మరొక తరహా వారి మరింత స్వేచ్చకు స్వాతంత్ర్యానికి ,ఆన౦దానికి కారణమైంది .తరచుగా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు .-రక్తపాతం లేకుండా యే దేశమైనా స్వాతంత్ర్యం స్వేచ్చా పొందిందా ?అని .అది జరిగిందో లేదోకానీ మేము అంటే ఇంగ్లాండ్ ,ఇండియా లు మాత్రం చక్కగా చర్చించుకొని ఇంగ్లాండ్ రాజ్యాంగ వ్యవస్థను అర్ధం చేసుకొని ,ఇలాంటి ప్రత్యేకమైన వినూత్నమైన రాజకీయ అభి వృద్ధి సాధించాం .మేము త్వరలోనే స్వాతంత్ర్యం పొందుతాము ,అదీ పూర్తీ స్వాతంత్రమే సాధిస్తాం ఎట్లా ?శాంతియుత విధానం వలన .అదే స్పూర్తి మనం చూపించి ఈ సభను హుందాగా గౌరవ ప్రదంగా నిర్వహించుకోవటానికి మనం అందరం కలిసి కట్టుగా పని చేద్దాం . ‘’అని డ్యూక్ అన్నమాటలను ఉటంకిస్తూ అతడికి శాస్త్రి ధన్యవాదాలు తెలియజేశాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-23-ఉయ్యూరు

