, రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -17
పై సందర్భాన్ని కొడుకు కు శ్రీనివాస శాస్త్రి ఒక ఉత్తరం రాస్తూ –‘’బ్రిటీష ప్రభుత్వం సర్వ సమర్ధులైన బాల్ఫార్ ,కర్జన్ ,చర్చిల్ ,లాయడ్ జార్జి వంటి ప్రముఖుల చేత నిర్వహిమ్పబడుతూ ,ప్రపంచం లోనే అత్యంత విశిష్ట ప్రభుత్వం గా ఉంది .వీరికి సాటి వారెవరు ?స్మట్స్ గౌరవనీయుడు , కొంత వరకు వీరి సరసకు రాగలవాడు . కాని అతడిలో వారికున్న విషయ పరిజ్ఞానం ,విశాల దృక్పధం లేవు .వాళ్ళ పాలసీ లపై కొంత వ్యతిరేక భావనలున్నవాడు .ఆస్ట్రేలియాకు చెందిన హగ్స్ చురుకైన వాడు .చెవుడు ఎక్కువ ,మానరిజమ్స్ బాగా ఉన్నవాడు .మొండి వాడు. పోరాట పటిమ ఉన్నవాడు .కెనడాకు చెందిన మీఘెన్ శాంత చిత్తుడైన లాయర్ .అతని భావాలు అతనివే .వాటికే కట్టుబడి ఉంటాడు .ఇంప్రెసివ్ గా ఉండడు,గొప్ప వక్త కూడా కాదు కానీ ,శీల సంపద ఉన్నవాడు .న్యూజిలాండ్ కు చెందిన మాస్సీ ప్రేమింప తగడుకానీ సూటిగా ప్రవర్తిస్తాడు .పాలనాను భవం బాగా ఉన్న వాడు .బాగా మాట్లాడాలని ప్రయత్నిస్తాడుకానీ మాట్లాడ లేడు .అతడి నిజాయితీభావాలు సామ్రాజ వాదం గా ఉంటాయి .కర్జన్ మాట్లాడే తీరు ,సమతుల్యత ఆకర్షణీయం .అతడితో మనం మాట్లాడిన క్షణమే మనల్ని తన ప్రభావం లోకి లాక్కొనే ఆకర్షణ ఉన్న వాడు .అతడి పాలిటిక్స్ నాకు ఇష్టం లేకపోయినా ,నన్ను బాగా దగ్గర చేసుకొన్నాడు .మాగురువు గోఖలే పై మంచి మాటలు చెప్పాడు .చర్చిల్ మహా మేదావే .కానీ పనిలో కర్జన్ కు సాటి కాదు .విషయం పై మాట్లాడే టప్పుడు జోవియల్ గా అసలైన మేధావి గా కనిపిస్తాడు .స్థిరత్వం లేనివాడు .గర్విష్టి .కానీ అతడిని వదిలించు కోలేని పరిస్థితి . అంటే అనివార్యమైన వాడు –indispensable.బాల్ఫార్ అతడికి అతడే సాటి .అతడంటే నాకు ఎందుకో మోజు ఏర్పడింది .తక్కువ మాట్లాడుతాడు అప్పుడప్పుడు నిద్రలోకి జారుకొంటాడు .అతడు పెదవి విప్పాదంటే నాగ స్వరానికి నాగుపాముతల ఊపినట్లు అయిపోతాం .పెద్దగా సరుకున్న వాడు కాదు .కాని అతడి విజ్ఞత నిర్ణయం నాకు స్పూర్తి దాయకాలు .అందుకే పై వారిలో అతడు సర్వ సమర్ధుడు అని నేను అనుకొంటాను ‘’అని రాశాడు .
ఇంపీరియల్ కాన్ఫరెన్స్ లో శాస్త్రి పాల్గొనటం వలన ,అతడి జీవితంలో అనేక సత్ఫలితాలనిచ్చే కాలం గా మారింది ..విదేశాలలో సమాన సిటిజన్ షిప్ పోరాటం ఫలించింది .ఒక రకంగా గోఖలే , గాంధీల మిషన్ లకు ప్రతినిధి అయి ఇండియన్ ల హోదాను విదేశాలలో పెంచాడు శాస్త్రి .ఇంపీరియల్ కాన్ఫరెన్స్ లో ఉండగానే గొప్ప రాజకీయ వేత్త –అంటే స్టేట్స్ మన్ అనిపించుకొన్న దక్షిణ ఆఫ్రికా ప్రధాని జనరల్ స్మట్స్ తో
వివాదానికి దిగాడు .స్మట్స్ మామూలు విరోధి కాదు .మొదటి ప్రపంచ యుద్ధం లో ఇంపీరియల్ ప్రభుత్వానికి విశేషమైన సేవలు అందించి అభిమాన పాత్రుడైన వాడు .లీగ్ ఆఫ్ నేషన్స్-నానారాజ్య సమితి స్థాపనలో ముఖ్య పాత్ర వహించిన వాడు .ప్రపంచ శాంతి సౌభ్రాత్రు త్వాలకు కృషి చేసినవాడు –But this great man had a skeleton in his cupboard –the colour bar in South Africa .over which he had ,a decade before ,come into conflict with Mahatma Gandhi ,and he now came into conflict with Sastri .శాస్త్రి ప్రతిపాదించిన ఇండియాకు సమాన పౌరహక్కుల తీర్మానం పై వ్యతిరేకంగా ఇంతా బయటా తీవ్రంగా మాట్లాడి అడ్డు తగిలాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-23-ఉయ్యూరు

