రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -22
ఆస్ట్రే నుంచి శాస్త్రి న్యు జీలాండ్ వెళ్లాడు .అక్కడ అప్పటికే ఇండియన్ లకు వోటు హక్కు ఇవ్వబడింది కనుక పని తేలికైంది .వృద్ధాప్య పెన్షన్ ,కొన్ని రకాల ఉద్యాగాలు పొందటం లో చిక్కులు పైన కృషి చేశాడు .ఉద్యోగస్తులు తాత్కాలికంగా న్యూజిలాండ్ లో పర్యటి౦చ టానికి ఉన్న అడ్డంకుతొలగించటం గూర్చి ప్రభుత్వం తో చర్చించాడు .భారత ప్రభుత్వానికి శాస్త్రి తన డొమినియన్ టూర్ పై ఒక నివేదిక ఇస్తూ ,వారికి ఒక ప్రో టేక్టర్ లేక కాన్సులర్ ఆఫీసర్ న్యూజిలాండ్ లో ఏర్పాటు చేయాలని కోరాడు .అలాగే ఫిజి ఐలాండ్స్ విషయంలోనూ జరగాలన్నాడు .అలాచేస్తేఇండియా వాసుల ప్రవేశానికి ,ఇమ్మిగ్రేషన్ కు డోమినయ్న్ ప్రభుత్వానికి ,ఇండియా ప్రభుత్వానికి మధ్య ఉన్న కష్టాలు తేలికగా తొలగించ వచ్చు అన్నాడు .కెనడాలో శాస్స్త్రి పని మరీ కష్ట సాధ్యమైంది .1921 ఇంపీరియల్ కాంగ్రెస్ లో శాస్త్రికి మిత్రుడైన మీఘెన్ కు శాస్త్రి రాక సంతోషాన్ని కల్గించింది .కాని ఆయన రిటైర్ అయన స్థానంలో మెకంజీ కింగ్ ప్రైం మినిస్టర్ అయ్యాడు .
శాస్త్రి ఆస్త్రేలియా న్యూజిలాండ్ ప్రజలను తన ప్రసంగాలతో ఉర్రూత లూగించాడు కానీ ,కెనడా లో శాస్త్రికి పబ్లిక్ స్పీచ్ లకు అవకాశం ఇవ్వలేదు .కనుక విధానం మార్చి శాస్త్రి వోటర్లకు సూటిగా విజ్ఞప్తి చేస్తూ ,చాలెంజింగ్ ప్రసంగాలు చేస్తూ ,అగ్నికణాలు వర్షిస్తూ ఆ రెండు దేశాలలో చేసిన ఉపన్యాసాలకు భిన్నంగా మాట్లాడాడు .మాంట్రియల్ లో రిఫారం క్లబ్ లో మాట్లాడుతూ శాస్స్త్రి బాహాటంగా ,సెంటిమెంట్ దట్టించి –‘’బ్రిటన్ కానీ మరే డొమినియన్ కానీ ఇండియాను వేధించటం కుదరని పని .వేధించే ప్రయత్నాలను ఇండియా తిప్పి కొడుతుంది .మనం సమాన హోదాగల భాగస్వాములు గా సామ్రాజ్యంలోని మిగిలిన ప్రదేశాలలో లాగా శాంతిగా ఉంటే ,.మనం ప్రజలకు ఎన్నో మేళ్ళు చేయగలం..సామ్రాజ్యాన్ని బలపరచగలం..ప్రపంచానికి మనందరి అవసరం ఉందని గుర్తుంచుకోవాలి .మేము యూనియన్ జాక్ సాక్షిగా కాపాడు కొంటూ ,దేశ గౌరవంపెంచుతూ మా ఆత్మ గౌరవాన్ని పెంచుకొంటూ ,ఆపని చేయటానికి సిద్ధంగా ఉన్నాం . ఇలాచేయలేకపోతే ఆతర్వాత మనం చాలా విచారించాల్సి వస్తుంది .మన రాజకీయ విముక్తిని ఈ గొప్ప రాజకీయసంస్థ కు బయట తేల్చుకొందాం.ఆశావహంగానే శాస్త్రి పర్యటన కెనడాలో ముగిసింది . ప్రైం మినిస్టర్ మెకంజీ శాస్త్రికి ఒక ఉత్తరంరాస్తూ –‘’కొద్దిరోజుల్లోనే మీరు కోరిన విధంగా మా కెనడా పార్లమెంట్ సమావేశమై ఇక్కడి భారతీయులకు డొమినియన్ పార్లమెంటరి వోటు హక్కును అందిస్తుందని సంతోషంగామీకు హామీ ఐస్తున్నాను ‘’అని చెప్పాడు అన్నట్లే -1947లో కెనడాలోని ఇండియన్స్ కు పూర్తీ సిటిజన్ షిప్ లభించింది .ఇప్పటిదాకా శాస్త్రి ఒక్కడే ‘’India’s first and till today her greatest ambassador .In his noble bearing ,sweet reasonableness ,,capacity to understand the other man’s point of view ,high intellectual gifts and shining eloquence ,he had the makings of an ideal ambassador ‘’కానీ ఇండియా అదృష్టం ఏమిటి అంటే శాస్త్రి మానవ సంబంధ మైన అనేక కౌన్సిల్స్ లో పార్లమెంట్ లలో తన అద్భుత భారతీయ వాణిని వినిపించాడు .శాస్త్రి గురించి సి ఎఫ్ ఆండ్రూస్ ‘’He did more than any other Indian statesman to raise the name of the country in the Dominions and elsewhere ‘’.నిజంగా ఇది ఘనమైన ట్రిబ్యూట్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-23-ఉయ్యూరు
