రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -25
శాస్త్రికి కెన్యా సమస్య బ్రిటన్ కు చట్టంవిషయం లో అందరూ ఒకరే అన్న నిబద్ధత ఒక యాసిడ్ టెస్ట్ అయింది .బ్రిటీష సామ్రాజ్యం పైనా ,ఆదర్శాలను నిలబెట్టటం పై అక్కడి రాజకేయ వేత్తల ఆసక్తిపైనా గొప్ప నమ్మకం ఉంది .కానీ తానూ ఓడిపోతున్నానని తెలిసి విపరీతంగా బాధపడ్డాడు .ఆరోగ్యమూ సహకరించటం లేదు .అయినా మొండిధైర్యంతో ఉన్నాడు .1923జూన్ 5 న లండన్లో బానిస వ్యతిరేక,అబోవ్ ఆరిజిన్స్ సంరక్షణ సమితి సమావేశం లో మాట్లాడుతూ బ్రిటన్ ను తమ అత్యున్నత ఆదర్శాలను నిలబెట్టుకోవలసినది గా అభ్యర్ధిస్తూ శాస్త్రి – ‘’యుద్ధ సమయంలో మీరు చిన్న జాతులన్నిటి సాయం అర్ధించి పొందారు .స్వాతంత్ర్య జండాను ఎగిరెట్లు చూశారు .ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోమని మనస్పూర్తిగా కోరుతున్నాను .ఆ స్వాతంత్ర్యజండా మీ స్వాతంత్ర్యం కోసమే మాత్రమె కాదు,అది ప్రపంచ దేశాలన్నిటికీ చెందింది అందులో ముఖ్యంగా లీగ్ ఆఫ్ నేషన్స్ కు అంటే బ్రిటీష కామన్ వెల్త్ అంతటికీ చెందిందని మర్చిపోవద్దు .మీ యూనియన్ జాక్ కు అప్రతిష్ట ,అగౌరవం తెచ్చుకో వద్దు .’’అని చాలా వినయంగా చెప్పాడు .
రామ్సే మాక్ డోనాల్డ్ ఆధ్వర్యంలో క్వీన్స్ హాల్ లో జరిగిన భారీ బహిరంగ సభకు జబ్బుతో ఉంటూనే హాజరయ్యాడు శాస్త్రి .కానీ కొన్ని నెలల నిరంతర చర్చల తర్వాతకూడా బాల్డ్విన్ కాబినెట్ ,ఇండియన్ ల వాడనలన్నితిని తోసి పుచ్చటానికి నిర్ణయం తీసుకొన్నది .శాస్త్రి పెట్టుకొన్న ఆశాలన్నీఅడియాశలయ్యాయి. ఎంతోకాలంగా చాలా ఇష్టమైనవన్నీ ఒక్క దెబ్బతో నాశనమయ్యాయి .అమెరికన్ రిపబ్లిక్ కు జాతుల సమస్య తీర్చటంలో అసాధ్యమైనది,కానీ బ్రిటీష కామన్ వెల్త్ సాధించి ఆదర్శంగా ఉంటుంది అన్న నమ్మకం పూర్తిగా దెబ్బతిన్నదిశాస్త్రి లో ,విపరీతమైన నిస్పృహతో పెద్ద గొంతుకతో తన విలాపాన్ని వినిపించాడు ‘’The people of India are no longer equal partners in the British Empire ,but un redeemed helots in a Boer Empire’’-అంటే బ్రిటీష సామ్రాజ్యంలో ఇండియన్లు సమాన హోదా కలవారు కాదు .విమోచన చెందని స్పార్టా లోని బానిసలకు ,పౌరులకు మధ్య ఉన్న సెర్ఫ్ లమాదిరి బోయెర్ సామ్రాజ్యంలో ఉన్నారు .కోపంతో ఊగిపోతూ అరుస్తూ ,’’Kenya lost ,every thing lost ‘’అని గర్జిస్తూ హితవు చెప్పాడు .శాస్త్రి చెప్పిన ఆమాటలు సామెత గా నిలిచిపోయాయి చరిత్రలో .రాజకీయ విషయాలలో అయన మధ్యస్థ మార్గం ఒడిదుడుకుల పాలైంది .ఈ విషయాన్ని కూతురుకు 1923ఆగస్ట్ ఒకటవ తేదీ ఉత్తరం రాస్తూ –‘’ఇక్కడి జరగాని సంఘటనల వల్ల నా దృక్పధమే మారిపోయింది .ఇక్కడ ఉన్నా ,ప్రశాంతంగా ఉండలేను .ఇంటికి రావటమే మంచిదనిపిస్తోంది .మన దేశ పరిస్థితి లాగానే నా భవిష్యత్తూ అగమ్య గోచరమైనది ‘’అని బాధ పడ్డాడు .ఆగస్ట్ 17న బనారసీ దాస్ కు రాసిన ఉత్తరంలో –‘’నా దృక్పధం మారి పోయింది .ఇండియాలోని భవిష్యత్ రాజకీయంలో నాకు స్థానం లేదు ‘’అన్నాడు .
ఆ విపరీతమైన ఒత్తిడి మనస్తాపం లోఉన్నకాలం లో శాస్స్త్రి డాక్టర్ లసలహామేరకు ఒక నర్సింగ్ హోమ్ లో చేరగా కొంతకాలం పూర్తీ విశ్రాన్తిఅవసరమని హితవు చెప్పారు .ఆయన గుండె జబ్బు నిత్య అవమానాలు,, దుఖం ,ఆవేశాలవలన బాగా పెరిగింది .కెన్యా పరిష్కారం జాతికి పెద్ద తీరని అవమానంగా భావించాడు .కెన్యా విషయంలో ఆయన మాట్లాడిన మాటలు చెప్పిన అభిప్రాయాలు ఏ ఇతర నాయకుడూ చెప్పనివి చెప్పలేనివి .మండిపోతున్న బాధను తన వాక్చాతుర్యంతో శాస్త్రి –‘’మానవ జ్ఞాపక శక్తి ఎంత తక్కువది ?శ్రమించి పని చేసిన పనులు పొందిన వాగ్దానాలు ,అందుకొన్న ఆశలు ప్రశంసలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరయింది .చేసిన ప్రతిజ్ఞలు ఏమయ్యాయి?పూర్తి సమానత్వం ,భేషజం లేని భాగస్వామ్యం అన్నీ ఏమైపోయాయి .అవన్నీ రాయల్టీ నుంచి బాధ్యతగల మంత్రుల నుంచి .పత్రికలూ ,వేదికల నుంచి వచ్చినవేగా ?మనస్పూర్తిగా గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు వాగ్దానాలేగా .ఇన్ని సమావేశాలు ఇన్ని సార్లపర్యటనలు ఇన్నిన్ని చర్చోప చర్చలు జరిగి, పరిష్కారం కుదురుందని నమ్మకం ఉన్న కాలం లో ఇంత గట్టి దెబ్బ కొట్టారు కెన్యా విషయం లో .రేపు ఇండియాకు మాత్రం ఈ దెబ్బ తగలదు అని నమ్మకమేమిటి ?మోసగించరని గ్యారంటీ ఎక్కడుంది ?’’’’అని బాధపడ్డాడు .తనను మోసం చేయలేదు అనుకొన్నాడు .
జబ్బుతోనే శాస్త్రి ఆగస్ట్ లో ఇండియాకు తిరిగి వచ్చాడు గాయపడిన మనసు గుండె నిండా దుఖం తో .ఆరోగ్యం కుడుట పడటానికి ఒక ఏడాది పట్టింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-23-ఉయ్యూరు

