రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -33
ఆ కమిషన్ తుది నిర్ణయం –ఇండియన్లకు విద్యమీద ప్రభుత్వం ఇచ్చేసబ్సిడీ అంతా ఇండియన్లకే ఉపయోగించాలి .దీని అమలు వలన నటాల్ ఇండియన్ల విద్యా వ్యాప్తి అతి వేగంగా జరిగింది .ఇండియన్ల స్వీయ సహాయం బాగా పెరగాలి అని భావించి వారిని 20 వేలపౌన్ల డబ్బును విరాళంగా అందించి ఒక కాలేజి,హాస్టల్ స్థాపించమని కోరాడు .దీనికి విశేష స్పందనలభించింది .కానీ స్థల విషయంలో ఇబ్బందు లెదురైనా శాస్త్రి వ్యక్తిత్వ ప్రతిభతోఅదీ అనుకూలించి,మెట్రోపాలిటన్ ఆఫ్ ఇండియా అయిన ఫోస్సీ వెస్ట్ కాట్ టూర్ వెళ్ళబోతూ శాస్త్రి పూనుకోన్నది మహాత్తరకార్యం అనీ ,దానికి మాటలలో అభినందిన్చాటానికి ఇంగ్లీష్ డిక్షనరీలో మాటలు దొరకలేదని ,డర్బాన్ రిజిష్ట్రార్ నుకానీ గుమాస్తాను కానీ శాస్త్రి స్వయంగా కలిసి మాట్లాడితే స్థలం వెంటనే కేటాయింపు జరుగుతుందని సలహా చెప్పాడు ,’’I have been completely Sastricised ‘’అని మహదానందాన్ని ప్రకటించాడు .24-8-1928 న నటాల్ అడ్మినిస్ట్రేటర్ సర్ జార్జి ప్లోమాన్ ‘’శాస్త్రి కాలేజ్ ;’కి శంకుస్థాపన చేశాడు .ఈ ఫంక్షన్ కు యూరోపియన్లుకూడా బహుళ సంఖ్యలో హాజరవటం విశేషం .వచ్చిన వారిలో పెద్ద హోదా ఉన్న వారు ఉండటం మరీ విశేషం .కాలేజి నిర్మాణం 1929 లో అనుకొన్నట్లుగా పూర్తీ అయి శాస్త్రి ఇండియాకు వెళ్లినతర్వాత గవర్నర్ జనరల్ ఎరల్ ఆఫ్ ఆల్త్ లోన్ ప్రారంభోత్సవం చేశాడు .ఇది అద్భుత విజయం శాస్త్రికి .ఇండియన్లు కూడా తమ అభివృద్ధికోసం విద్యా వ్యాప్తికోసం కృషి చేయటం శాస్త్రి సాధించిన ప్రగతి .
అక్కడ అక్షరాస్యత ఇండియన్ లలో పెరగటానికి ,విద్యాభి వృద్ధికి ,పారిశుధ్యానికి ,స్త్రీల ఉన్నతికి శాస్త్రి అవిరళ కృషి చేశాడు .సోషల్ సర్వీస్ లీగ్ ,చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ లను స్థాపించాడు .అనునిత్యం మరింత పరిశుభ్రతకు జీవన స్థితి మెరుగు దలకు కృషి చేయమని కోరేవాడు .మన దేశంలోని సంపన్నులను అక్కడ స్కూల్స్ హాస్పిటల్స్ నిర్మాణాలకు ,అక్కడి సోదర పేదల సంక్షేమానికి ముందుకు రావాలని ప్రోత్సహించాడు .శాస్త్రి ఎప్పుడూ మన కున్న ఆసక్తులను పరిరక్షించాలని తపన చెందాడు .అక్కడి వారు వాలుగా ఉన్న అగ్నిపర్వతం పై నివసిస్తున్నారనీ ఎప్పుడు అది జాతి విద్వేషాన్ని వెలిగ్రక్కుతుందో మనవారి అస్తిత్వాలను కూల్చేస్తుందో తెలియదని ,కనుక అనుక్షణం జాగ్రత్తగా ఉండమని కోరాడు వారిని .అసిస్టేడ్ ఇమ్మిగ్రేషన్ స్కీం బాగానే ఉపయోగపడుతున్నా ,ఇండియాకు తిరిగి వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా ఉన్నా ,అక్రమ౦ గా ప్రవేశించిన ఇండియన్ల పై మాఫీ చేయటంలో ఏజెంట్ జనరల్ కు చాలా చిక్కులేర్పడ్డాయి .దీనికి పరిష్కారం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను నిర్లక్ష్యం చేయటం మాత్రమె .దీనిపై ఇండియన్ లలో అభిప్రాయ భేదాలేర్పడినా ,శాస్త్రి అక్కడ ఉండటం ఆయన స్పూర్తి మంతమైన ఆలోచనలతో వారందరికి క్షమా భిక్ష పెట్టటంతో సమస్య తేలికగా పరిష్కారమైంది .అక్రమంగా పూర్వం సౌతాఫ్రికాకు వచ్చిన ఇండియన్స్ అందరికి 28-10-1928 లోపు వారంతా వ్రాతపూర్వకంగా ఒప్పుకొంటే వారందరికి క్షమాభిక్ష –కన్దోనేషన్ ప్రసాదిస్తానని డా.మలాన్ వాగ్దానం చేశాడు .
మరొక సమస్య లిక్కర్ బిల్.దీనిప్రకారం బార్ లలో ఇండియన్లు పని చేయకూడదు .దీన్నిన్యాయ శాఖామంత్రి టేల్మాన్ రూస్ విషపూరిత ఆలోచనతో ప్రవేశ పెట్టాడు .అన్నిరకాల చర్చలు జరిగినా ఫలించక ,శాస్త్రి ప్రైం మినిస్టర్ హీర్త్ జాగ్ ను కలిసి విషయ వివరణ చేస్తూ ,వేలాది ఇండియన్ల ఉపాధిపోతుందని వారంతా రోడ్డున పడి పోతారని వాళ్ళ పొట్ట కొట్టద్దు అని వివరించగా ఆయన సంతృప్తి ప్రకటించి బిల్లు లో ఆక్లాజ్ అంటే నిబంధన తొలగించటానికి ఒప్పుకోని అందరికి ఊరట కల్గించాడు .ఇదీ శాస్త్రి ప్రజ్ఞకు మరో నిదర్శనం .
తర్వాత శాస్త్రి దృష్టి భూమిపై హక్కు ,వ్యాపార అవకాశాలపై పెట్టాడు .తెల్లవారి అభిమతానికి మరీ విరుద్ధంగా ప్రయత్నిస్తే ఫలితం ఉండదని తెలుసుకొన్నాడు .కనుక తీవ్ర విమర్శలు ,దాడి వదిలి కొంచెం ప్రక్కమార్గాలను అనుసరించాడు .తానూ సాధించిన చిన్న చిన్న విజయాలనుఆయన అపహాస్యం చేసుకోలేదు .అలాంటి చిరు విజయాలే భవిష్యత్తులో భారీ విజయాన్ని సాధిస్తుందని నమ్మాడు .ఉన్నంతలో తెల్లవారికి నల్ల వారికి మధ్య మరింత సుహృద్భావం ఏర్పదడేట్లు చేయాలి .వీరిద్దరూ ఎన్నో దశాబ్దాలపాటు ఒకరిపై ఒకరు ఈర్ష్యా ద్వేషాలతో ఉన్నారు అది ఒక్కసారిగా పోయేదికాదు .కనుక చాలా నెమ్మదిగా ఓపికగా సమస్య మూలాల లోకి వెళ్లి పరిష్కరించాలి.’’ హరీబరీ’’గా పనులు సాధ్య౦కావు .శాస్త్రి అమోఘ ఉపన్యాసాలకు దక్షిణాఫ్రికాలో మంచి గిరాకీ ఉంది అతని వాగ్ధాటి ఎవరినైనా మెప్పిస్తుంది .భారతీయ సంస్కృతిపై అక్కడ ఎన్నెన్నో ప్రసంగాలు.’’స్పెల్ బౌండ్ ఆడియన్స్’’ ముందు చేశాడు ,భారతీయ వేదాంతాన్ని క్రిస్టియన్ బిషప్పుల ప్రవచనాలను ఏకరువు పెట్టి మాట్లాడే వాడు .ఇవన్నీ నల్ల –తెల్ల జాతులమధ్య పాతుకు పోయిన జాతి విద్వేషాన్ని తొలగించే ప్రయత్నాలే .ఇదేకాక ఇండో-యూరోపియన్ కౌన్సిల్లు ఏర్పాటు చేశాడు .వీటిలో బాగా ప్రభావ శీలురైన యూరోపియన్ జడ్జీలు బిషప్పులు ఎడిటర్స్ ,పార్లమెంట్ సభ్యులు వగైరాలున్నారు .అభివృద్ధి శీలురైన ఇలాంటి వారితో సమావేశాలు చర్చలు జరిపికొన్ని జటిల సమస్యలకు తేలిక పరిష్కా రాలుసాధించాడు .ఇలా నిరంతర ప్రయత్నాలతో యూరోపియన్ కమ్మ్యూనిటికి బాగా దగ్గరయ్యాడు శాస్త్రి .అక్కడి జు-జంతు ప్రదర్శన శాలకు కు ఒక ఏనుగు పిల్లను మైసూర్ మహారాజు ఇచ్చిన కానుకగా సమర్పించి మనసులను దోచుకొన్నాడు.దీనికి డర్బాన్ ప్రజలు మహా సంతోషం పొందారు .వారి హృదయాలలో పదిలంగా స్థానం సంపాదించాడు శాస్త్రి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-23-ఉయ్యూరు

