రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -40
శ్రీనివాస శాస్త్రి ఉన్న సమస్యపై లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాడు .ఫెడరేషన్ విషయమై సంస్థానాధీశులకు అంతటి మోజు ఎందుకో అని ఆలోచించాడు .మొదట్లో వారిని సందేహాస్పదంగా ,అనుమానాస్పదంగా చూశాడు .బాధ్యతగా ఇప్పుడు మనస్పూర్తిగా మాట్లాడి పరిష్కారం సాధించాలి .మహారాజులలో చాలా మందితో మాట్లాడాడు ఇంటర్వ్యు చేశాడు . ఎవరి స్వార్ధం వారిదే అయినా వారిలో దేశభక్తి ఇండియాపై ప్రేమ చూడగలిగాడు.ఒకసారి ఫెడరేషన్ లో చేరితే బ్రిటీష సామ్రాజ్యపు కూకటి వ్రేళ్ళను కూల్చవచ్చని లేకపోతె వారి రాజకీయ ఆఫీసర్ల బారి నుండి తప్పించు కోవటం కష్టం అనుకొన్నారు .బికనీర్ మహా రాజా దేశభక్తి అతి విశిష్టమైనదని అర్ధం చేసుకొన్నాడు .ఆయన ధైర్య సాహసాలు ,లో౦గిపోని శక్తి సామర్ధ్యాలు నిర్వహణ సామర్ధ్యం గొప్పవి .కల్నల్ హస్కర్ నిత్యం మహారాజులతో మాట్లాడుతూ అభిప్రాయ సేకరణ చేస్తున్నందుకు సంతోషించాడు శాస్త్రి .నెమ్మదిగా అయిష్టంగా నే ఫెడరేషన్ వైపు మొగ్గాడు .సర్దార్ కే . ఎం. పనిక్కర్ ఫెడరేషన్ పై పూర్తీ సమాచారం అందించాడు .శాస్త్రి రెస్ట్ కోసం బేకస్ హిల్ వెళ్లాడు .అక్టోబర్ లో లండన్ తిరిగి వస్తాడు .కల్నల్ హక్సర్ ఫణిక్కర్ ను స్టేషన్ కు వెళ్లి తీసుకు వచ్చి సవాయ్ హోటల్ లో లంచ్ కి ఆహ్వానించామని చెప్పాడు .శాస్త్రిని మనస్పూర్తిగా ఆహ్వానించాడు హోటల్ లో ఆయనకోసం హక్సర్ ,మనుభాయ్ ,సర్ తేజబహదూర్ సప్రులు ఎదురు చూస్తున్నారు .అప్పుడు ప్రచారం ప్రారంభమైంది .ఆయనపై అన్ని వైపులనుంచి ప్రశ్నల బాణాలు విసిరారు .రాష్ట్రాలను బలోపేతంగా చేయాలని హక్సర్ చెప్పాడు .కేంద్రం బాధ్యతపై సప్రూ వివరించాడు .రాష్ట్రాల విభజన ఆలోచన పై సర్ మనూభాయ్ మాట్లాడాడు .శాస్త్రి ఇవన్నీ వింటూ దృష్టిని శూన్యం లో పెట్టాడు .అప్పుడప్పుడు ఒక ప్రశ్న సందిస్తున్నాడు .కొంతసేపు గుసగుస లాడాడు .అంతులేకుండా ఆర్గ్యుమెంట్లు జరుగిపోతున్నాయి .కానీ’’ బుద్ధుడు లాంటి ఆ బ్రాహ్మణుడి ముఖం లో ఏమార్పు కనిపించలేదు ‘’.వెలుగు ,ప్రకాశం ఇప్పుడే బయటికి రావాలి .పొడిపొడి మాటలతో సరిపెట్టాడు .అప్పటికే పావు తక్కువ నాలుగు అయింది . అందరూ వెళ్ళిపోవటానికి లేచారు .అప్పుడు శాస్త్రి ‘’దాన్ని గురించి నేను ఆలోచించాలి .నాకేమీ సంతృప్తి కలుగలేదు ‘’‘’అన్నాడు అంతే .అందరు యుద్ధం సగం పూర్తీ అయింది అని భావించారు .హక్సర్ శాస్త్రి పొడిమాటలకు –‘’Mr sastri’s historic phrase ‘’I am confess I am converted to the idea of ‘’ALL INDIA FEDERATION ‘’అని అర్ధం లాగాడు .
మరొక విశేషం ఇండియా వాళ్లకు రియాక్షనరిగా కనిపించే పూర్వ వైస్రాయ్ లార్డ్ రీడింగ్ అందర్ని ఆశ్చర్యపరుస్తూ డొమినియన్ స్టేటస్ కు ,కేంద్రప్రభుత్వ బాధ్యతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రకటించాడు .అసందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా ప్రేరణాత్మకంగా ఉన్నాయి .అందరూ హర్షించారు .శాస్స్త్రి నోటి నుంచి ఫెడరేషన్ మాట రాకముందే ఆప్రకటన వచ్చింది ఫెడరేషన్ డొమినియన్ స్టేటస రెండూ త్వరలోనే శక్తి మంతమౌతాయని శాస్త్రి భావించాడు .20—11-1930 న శాస్త్రి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఫెడరేషన్ స్టేటస్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు ఒకదాన్ని మరొకటి బలహీన పరచకూడదు అన్నాడు .ఇవన్నీ కాంగ్రెస్ చేతులలో నిర్వహిమ్పబడాలి .విస్తృత రాజ్యాంగ పురోగతి వెంటనే జరగాలి .ఇప్పటికైనా మనవాళ్ళు బాధ్యతతో ప్రవర్తించాలి .ఇప్పటిదాకా ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు కలిగించారు .పాలకులు వారసత్వపు నేరగాళ్ళు అనుకోవద్దు .వారు బ్రిటీష రాజరికానికి రాజ్యాంగ నిబద్ధతకు అన్కితమైనవారే .అపనమ్మకం వదిలేయండి వారు అప్పుడు మన ప్రక్కన మన స్నేహితులుగా నిలబడుతారు .వీరి రాజ్యాంగాన్ని అనుసరించే మన దేశపు రాజ్యాంగ రచన జరగాలి అదీ ఆదర్శంగా అందరికి బాధ్యతా వహించేదిగా ఉండాలి ‘’అన్నాడు శాస్త్రి ..ఇబ్బందులు ఉన్నా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మంచి ముందడుగే వేసింది .27-11-1930 న శాస్త్రి సోదరుడికి రాసిన ఉత్తరం లో –‘’ఆశ్చర్యంగా బ్రిటీష వారు డొమినియన్ స్టేటస్ ను ఆమోదించారు .కొన్ని అభ్యంతరాలు ఉన్నా మొత్తం మీద మంచి ఫలితమే లభించింది .మన హిందూ –ముస్లిం విభేదాలు ప్రతి విషయాన్నీ విడదీయటానికి ప్రయత్నిస్తిన్నాయి .సిక్కుల్ని ఊరడించటం మహా కష్టం .రాజులు కొంచెం సమంజసంగానే ఉన్నారు .భవిష్యత్తులో చీలికలు వచ్చే సూచనలు ఉన్నా ఇప్పుడు అంతా బాగానే ప్రశాంతంగానే ఉన్నట్లు అనిపిస్తోంది ‘’’’అని రాశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-23-ఉయ్యూరు

