రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -42
శాస్త్రి మళ్ళీ ఢిల్లీ వచ్చి వైస్ రాయ్ కి గాంధీకి ఒక టెలిగ్రాం ఇమ్మన్నాడు ఉత్తరం చేరేలోపే .సోదరుడ్కి ఉత్తరం రాస్తూ బహుశా మర్నాడే గాంధీ –ఇర్విన్ లు కలిసి మాట్లాడవచ్చు అన్నాడు .గాంధి ఫిబ్రవరి 17 న ఢిల్లీ చేరాడు .శాస్త్రి వెంకటరామ శాస్త్రికి రాసిన ఉత్తరంలో –శిలువలు లేని ఇద్దరు క్రీస్తులు ఇవాళ మధ్యాహ్నం కలుస్తున్నారు –‘’This afternoon the two un crucified Christs meet ‘’అని రాశాడు ఆనందంగా .చర్చలు ఆశావహంగా జరుగుతుండగా శాస్త్రి ఫిబ్రవరి 23న గాంధీకి కాంగ్రెస్ వర్కుంగ్ కమిటి పై పూర్తీ ఆధిపత్యం ఉందని జవహర్ లాల్ వగైరాలను కట్టడిచేయగలడని,ఇర్విన్ కూడా ప్రతి అంశం మీద చర్చించాలని అనుకున్నాడని ,కాంగ్రెస్ వారి బలహీనతలు తెలుసనీ వారికోరికలు సాధ్యమైనంతవరకు తీరుస్తాడని ‘’.కనుక ఆశ ఉంది ‘’ ‘’రాశాడు .పదిరోజుకు చర్చలు చక్కగానే సాగాయి ఆతర్వాతే చిక్కులేర్పడ్డాయి .శాస్త్రి గాంధీని శాంతి నెలకొల్పటం అత్యవసరం అని గట్టిగా చెప్పగా ఆయన మెత్త పడ్డాడు .చర్చల సారాంశాన్ని శాస్త్రి ఇలా చెప్పాడు –‘’27 విషయం చాలా ఉద్రిక్తమైంది .నేను 28 న గాంధీని కలిసి ప్రక్కనున్న అన్సారి ప్రైవేట్ రూం కు తీసుకు వెళ్లి ,ఒక గంట సేపు’’ తోమాను’’.అందులో సారాంశం –‘’మీ అనుచరులలో అరడజను మంది మాత్రమె సిద్ధాంతం ప్రకారం నాన్ వయోలెన్స్ ను నమ్ముతున్నారు .మీకేదైనా జరిగితే ఏమౌతుందో ఆలోచించండి .ఒక బలహీన శరీరం ఇండియా కు అరాచకానికి మధ్య ఉంది .మీకా వయస్సు మీరింది .మీరు తినేది చాలాస్వల్పం .ఉద్యమాన్ని ఆహిమ్సతో పరాకాష్టకు తెచ్చారు మీరు .దేవుడిపై భారం వేయకండి .ఇప్పుడున్న యదార్ధ స్థితి పై ఆలోచించండి .మీరు చేయకలిగింది పూర్తిగా చెయ్యండి .అలా చేయకపోతే ఉద్యమం అలానే కొనసాగుతుంది .అప్పుడు మీ పై బాధ్యతా ఒత్తిడి విపరీతమౌతుంది .అవి భరించరానివైపోతాయి .మీరు ఒకసారి నాతొ అన్నారు –‘’ I do not care what happens .I must satisfy my conscience ‘’అన్నది గుర్తు చేసుకోండి .నిజాయితీ ఉన్న మంచి వారు మిమ్మల్ని ,మీ పనుల్ని వేరే విధంగా జడ్జి చేస్తారు .మీరు సిద్ధాంతం కోసమే ముందుకు వేడుతున్నారుకానీ యదార్ధ స్థితిని గుర్తించటం లెదు –‘’you did not act properly and give up the movement at this stage ‘’.అప్పుడు గాంధీ తానూ అన్ని విషయాలు జాగ్రత్తగానే ఆలోచించానని ,కానీ మళ్ళీ ఇంకోసారి ఆలోచిస్తానని ,అన్నాడు ఆయన విరమణ ,శాంతికోసమే ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు అనిపించింది .తన శక్తి సామర్ధ్యాలు సంపూర్ణంగా ప్రయోగించి దీన్ని సాధిస్తాడు అని నాకు నమ్మకం కలిగింది .ఆయనటాయన అనుచరులలో ఎక్కువమంది శాంతి కోరుతున్నారని చెప్పాను ‘నాతొ ‘’రేపు వచ్చి వర్కింగ్ కమిటి మీటింగ్ లో మాట్లాడు ‘’అన్నారు .నేను చెప్పింది గాంధీకి బాగా నచ్చిందని అనిపించింది .మర్నాడు ఫిబ్రవరి 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో గంటకు పైగా నేను మాట్లాడాను .వాళ్ళను సరైన దారిలో నడవటానికి బాగా ‘’తోమాను ‘’.వాళ్ళ త్యాగాలు బాధలు కష్టాలు వివరించాను .సాధించిన్దేదో సాధించారు .కానీ సాధించాల్సిన విషయాలు అనేకం ఉన్నాయని అవి సాధిస్తేనే అసలు విజయం సిద్ధిస్తుందని నచ్చ చెప్పాను .ప్రస్తుతం మన దేశానికి శాంతి ముఖ్యం అని గట్టిగా చెప్పాను .నేను మాట్లాడినట సేపు అత్యంత నిశ్శబ్దం పాటించారు అందరూ .మాలవ్య సరోజినీ నాయుడు అన్సారి మరిద్దరు ముస్లిం లు ,చిత్తరంజన్ దాస్ లు శాంతినే కోరుతున్నారని అర్ధమయింది .పాలసి విచారణ అసాధ్యం అన్నాను .మనముందు ఒక తీవ్రమైన పెద్ద సమస్య ఉన్నప్పుడు ఇటువంటి చిన్నవాటికి ప్రాధాన్యం ఇవ్వకూడదు అన్నాను .కమిటీ అంతా నేను చెప్పినదాన్ని ఆమోదించినట్లు అనిపించింది .నేను మాట్లాడక నేను అక్కడ ఉండటం భావ్య౦ కాదని వారిలో వారు చర్చించి మంచి నిర్ణయం తీసుకోమని చెప్పాను .నేను వెళ్లి వరండాలో కూర్చున్నాను .అప్పటికే నేను అలసిపోయినట్లు అనిపించింది .నాతోపాటు సరోజినీ నాయుడుకూడా బయటికి వచ్చి తన కర్చీ ఫ్ పై’’ వుడుకులాం’’ ను చల్లి నాముక్కు దగ్గర ఉంచింది .హిందూ పత్రిక విలేకరి నేను స్పృహ తప్పి పడిపోయానని కద అల్లి ఉడుకులాం తో పోతుందని చెప్పాడని అర్ధమయింది
మార్చి 4 వరకు అన్తాసవ్య౦గానె ఉంది .వైస్ రీగల్ లాడ్జిలో ఒక పార్టీ యేర్పాటు చేశారు .వైస రాయ్ నన్ను పక్కకు పిలిచి విషయం పక్కదారి పట్టిందని అంతే విషయం ఏమిటి అని అడిగాను .లోబరచుకొన్న ప్రాపర్టి అంటా తాసీల్దార్లు కొనుగోలు దార్లు మధ్యజరిగిన లాలూచీ కనుక స్టేట్మెంట్ పై సంతకం చేయను అన్నాడు గాంధి అని చెప్పాడు . గాంధీని ఒక సారి కలవమన్నాడు నేను సప్రూ జాయకర్ లను తీసుకొని మహాత్ముని కలిశాను .ఆయన అప్పుడు వర్కింగ్ కమిటీలో మాట్లాడుతున్నాడు .వారంతా ఆయన సంతకం చేయను అన్నదుకుసంతోషిస్తున్నారు .వైస్ రీగల్ లాడ్జిలో జరిగిన సీను గాంధీ వివరించాడు .తానూ సంతకం చేయటానికి ఇంకు లో పెన్ను ముంచి సిద్ధంగా ఉండగా కలం కదలలేదు –He was intellectually convinced that he had agreed to the agreement .But there was some moral scruple ,something in his conscience which said ‘’D0 not sign ‘’మళ్ళీ ఒకటికి రెండు సార్లు అగ్రిమెంట్ లోని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాడు ,కాన్ఫిస్కేటేడ్ ప్రాపర్టి విషయం చదివి తొట్రుపడ్డాడు .అప్పుడు ఆయనకు దానిపై జ్ఞానోదయం అయినట్లు అనిపించింది .ఇలాంటి ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టి లో మోసపూరితమైన కేసులు చాలా ఉంటాయికదా అనిపించింది .ఈస్థితిలో సంతకం పెట్టకుండా ఉండటం భావ్య౦ కాదని ప్రపంచం యావత్తు స్టేట్ మెంట్ ను స్వాగతి౦చటానికి సిద్ధంగా ఉందని తెలియజేశాను అన్నాడు వైస్రాయ్ ‘’.గాంధి వెంటనే –‘’I do not care the world .I can not sign a statement which I knew untrue ‘’అని అక్కడి నుంచి వచ్చేశాడు .పెద్దపెద్ద విషయాలు పరిష్కరించి ఈ చిన్నవిషయంలో ఇలా జరగటం విచారకరం అనీ ఇలాగే దక్షిణాఫ్రికాలో ఒక సారి జరిగిందని శాస్త్రితో గాంధీ అన్నాడు .నేను సప్రూ బుర్రలు బద్దలు కొట్టుకున్నాం దీనినుంచి ఎలా బయట పడాలని .అప్పుడు నేనో సప్రూ యొ ఒక సూచనచేశాం .స్టేట్ మెంట్ లో గాంధీ కి తెలిసినంతవరకూ ఇందులో కొన్ని లావాదేవీలు చట్ట వ్యతిరేకంగా న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావించాడని ‘’అని చేర్చాం గాంధీ ముఖం వెలిగి పోయి ‘’ఇది చాలు ‘’అన్నాడు .రాత్రి తొమ్మిదింటికి వైస్రాయింటికి చేరాం ఆయన ఈ సవరణ ఒప్పుకోలేదు అక్కడే ఉన్న ఎమర్సన్ కూడా ఆయన్నే సమర్ధించాడు .చర్చోపచర్చలు జరిపాం వైస్రాయ్ చాలా భీష్మి౦చు కున్నాడు .ఒకగంటతర్వాట వైస్రాయ్ ఎమర్సన్ ను రైనీకి ఫోన్ చేయమన్నాడు .విషయం తెలుసుకొని అలా మార్చవద్దు అనగా బయటికి వచ్చి అలామారిస్తే స్థానిక ప్రభుత్వాలను అవమాన పరచినట్లవు తుంది అన్నాడు .మావైపు తిరిగి ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు .రైనీని రమ్మని మళ్ళీ ఫోన్ చేయగా ఆయన పైజమాలో ఉన్నానని చెప్పగా ఫరవాలేదు రమ్మనగా ,ఆయన ఓవర్ కోట్ తో రాగా ,మళ్ళీ అందరంకూర్చుని గంట చర్చించాం .వైస్రాయ్ మెత్తబడలేదు .అప్పుడు సప్రూ జయకర్ లు నావైపు చూడగా నేను ఆయనకు గాంధీ ఇంత చిన్న విషయంలో ఎంతటి మధన పడ్డాడో వివరించా పెద్ద పెద్ద విషయాల లో అంగీకారం కుదిరాక ఆఫ్టరాల్ ఈ చిన్న విషయంపై పట్టు పట్టకండి అన్నాను .వైస్ రాయ్ రైనీ వైపు చూడగా ‘’ఒ యస్ ‘’అన్నాడు ‘’వా యస్ ‘’ అన్నాడు ఇర్విన్ .ఈ విషయంలో గా౦ధే నుంచి ఇబ్బంది రాకుండా చూడమని కోరగా ఆబాధ్యత నాది అన్నాను .వెంటనే గాంధీ దగ్గరకు వెళ్ళాం .తలకింద ఒక వేలంత ఎత్తున్న దిండు పెట్టుకొని పడుకొని నిద్రకు సిద్ధంగా ఉన్నాడు.గాంధీకి అన్నీ వివరించి చెప్పగా ఆయన ఒప్పుకొన్నాడు ఇదంతా అయ్యేసరికి అర్ధరాత్రి ఒంటి గంట అయింది శుభ ప్రదంగా ‘’అని శాస్త్రి మనకు తెలియ జేశాడుపూస గుచ్చినట్లు వివరంగా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-7-23-ఉయ్యూరు

