రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -45

 రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -45

  బ్రిటష్ ప్రధానిని వాయిన్చాకశ్రీనివాస శాస్త్రి మహాత్మా గాంధీని –‘’నిజమే మహాత్మా .ఇప్పుడు మీరు ఒక క్షణం నేను చెప్పింది ఆలకించండి మీకు అనంతమైన కీర్తి ప్రతిష్టలున్నాయి .మీ ప్రభావం అపారం .ప్రజలపై మీకున్న పట్టువారిని మీమాట వినేట్లు చేసే నేర్పు జగద్విదితం .ఈ అపూర్వ విశేషాలు నిర్మాణాత్మక పనులకు అడ్డమౌతాయా ?మిమ్మల్ని నమ్మి అవమానాల పాలౌతున్న ఆ అమాయక  ప్రజలను నడిపించే హృదయం ఇంకా మీకు  ఉందను కొంటున్నారా ?అది అవసరం కాకపొతే ఇక ఇప్పుడు అసలు అవసరం లేదని నేను గట్టిగా చెప్పదలచుకోన్నాను .ఈ బల్ల సాక్షిగా మేమంతా ఎంతో ఆలోచించి ముందుకు వెళ్ళే కొన్ని నిర్ణయాలు చేశాం .అవి మీరనుకోన్నట్లు మీకు సంతృప్త ఇవ్వక పోవచ్చు ..కానీ మీరు నేను ,ఇక్కడి వారందరూ రాజ్యాంగాన్ని నిర్మిద్దాం .మనకు కావాల్సినవి అందులో చేరుద్దాం .భవిష్యత్తుపై ఆశతో ఈపని అందరం కలిసి చేసి సాధిద్దాం .పిల్గ్రిం ప్రోగ్రెస్ లో బన్యన్  –extreme suffering ‘’అన్నట్లు దాన్ని తొలగిద్దాం.దాన్ని పెర్ఫెక్ట్ గా సమీప భవిష్యత్తులో మారుద్దాం .బ్రిటీష ప్రజలు సాధారనంగాతప్పులు చేస్తారు .ఒక్కోసారి తెలివి తక్కువ నిర్ణయాలు చేస్తారు అన్నమాట నిజమే .ఈ సుదీర్ఘకాలం లో వారంతా దారికోచ్చారు .మోడరేషన్ ,జస్టిస్ లకు ఆమోదానికి వచ్చారు .నా అనుభవం దృష్ట్యా ఇది మనకు బంగారుకాలం వారు అభినంద నీయ భావనతో ,మనసుతో ఉన్నా రిప్పుడు. ఇది వారిలో వచ్చిన గణనీయ మార్పు ..Take them now victory is ours .’’అన్నాడు .శాస్త్రి .

      రెండవ కేప్ టౌన్ సమావేశం

  రెండవ రౌండ టేబుల్ సమావేశం అవగానే శాస్త్రి లండన్ నుంచి కేప్ టౌన్ కు బయల్దేరి  ఇండియన్ ప్రతినిధి బృండంతోకలిసి భారతప్రభుత్వం –సౌతాఫ్రికా ప్రభుత్వ రెండవ కేప్ టౌన్ సమావేశానికి జూన్ 1931వెళ్లాడు.. గుండప్పకు ఈ విషయం రాస్తూ శాస్స్త్రి –‘’గుండ్రబల్ల అవగానే కొండలరావు తో కలిసి డిసెంబర్ లో దక్షిణాఫ్రికాకు వెళ్ళాలి  .కేప్ టౌన్ అగ్రిమెంట్ నురెన్యు –కొనసాగించేట్లు చేయాలి  .దానికి ఇండియన్ ప్రతినిధి వర్గం నన్ను చేర్చింది .ఈ ఒక్క పనిలో మాత్రం నన్ను ఎవరూ తప్పించలేక పోతున్నారు .అది నాకు మరో గౌరవం కాదా ?’’అని చెప్పాడు .నెలలు గడిచినా మత రాజీ పై ఆశలు సన్నగిలిపోతున్నాయి .ఈ స్థితిలోఅక్కడికి వెళ్ళటానికి శాస్త్రి కి ఎందుకో ఉత్సాహం లెదు .అక్టోబర్ రెండు న వెంకటరామ శాస్త్రికి రాసిన ఉత్తరంలో –బల్ల సమావేశంలో నా ఆశలు ఆవిరైపోగా ,కేప్ టౌన్ సమావేశం కు నా మనసు పెట్టలేక పోతున్నాను .నేను వెళ్లనని తిరస్కరిస్తే ?మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకొంటాను ‘’అన్నాడు .చివరికి వెళ్లాలనే నిర్ణయించు కొన్నాడు అతని అవసరం అలాంటిది అయింది .

  ఇండియా ప్రతినిధి ఇక్కడికి రావటంలో రెండు విషయాలున్నాయి .మొదటిది 1927అగ్రిమెంట్ ను రెన్యు చేయటం .రెండవది ట్రాన్స్ వాల్ లో ఇండియన్ వ్యాపారస్తులపై ఉన్న తీవ్ర బెదిరింపులు  .రెండవ దాని విషయంలో పబ్లిక్ ఒపినియన్ ,చట్టాలు ఇండియన్లకే కాక అన్ని రంగుల జాతులకు వ్యతిరేకంగా ఉన్నాయి .ఇక్కడి వీరికి ఆస్తులు సంపాదించటం నేరం .దీన్నే వాళ్ళు ‘’రాండ్ ‘’అనీ గోల్డ్ బెరింగ్ ఏరియా అనీ పిలుస్తారు .ఇక్కడి ప్రజాభిప్రాయం సాధించటం చాలా కష్టం .ఇన్ని ఉన్నా కొందరు భారతీయులు గణనీయంగా భూములు కొని సంపన్నులయ్యారు .రాండ్ లోని  స్టాండ్ లను  ఆక్రమించుకొని లాభసాటి వ్యాపారాలు చేస్తున్నారు .వీరి విజయాలను చూసి ముఖ్యంగా యూదులు అసూయ పడుతున్నారు .వీరేమన వాళ్లకు వ్యాపారం లో పోటీ దారులు .కనుక తరచుగా మనవాళ్ళు వాళ్ళ స్థానం ఆక్రమిస్తూ తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నారని  వాళ్ళ ఎకానమిని దెబ్బ తీస్తున్నారని ఆందోళన చేస్తుంటారు .మన వాళ్ళను అక్కడ తొలగిస్తే తప్ప తమ బ్రతుకు ,వ్యాపారం ఆర్ధికం సాగదని గగ్గోలు పెడుతూ ఉంటారు .1929లోనే శాస్స్త్రికి, సర్ కెవి రెడ్డికి తెలిశాయి ఇవి .శాస్త్రి సౌతాఫ్రికా అప్పుడు వదిలాక రెడ్డి ‘’ఏజెంట్ జెనరల్ ‘’అయ్యాడు .తర్వాత కాలం లో తెల్లవారు మరీ బరితెగించి ఇండియన్లు వాళ్ళ సంపద అంతా వదిలేసి వెళ్లిపోవాలని ఒత్తిడి ఎక్కువగా చేశారు .ప్రభుత్వం వారిపక్షమే కనుక విభజించి పాలించటం చేతనవునుకనుక ‘’ట్రాన్స్ వాల్ ఏషియాటిక్ లాండ్ టేన్యూర్ ఏన్దేంట్ బిల్ ‘’తెచ్చి వాళ్ళను జోకొట్టి మనకు మంట పెట్టింది .దీన్ని బట్టి నిషేధీంచిన ప్రదేశాలలో ఉన్న ఇండియన్లు అన్నీ వదిలి ‘’స్పెషల్ లోకేషన్స్ ‘’వెళ్లి స్థిరపడాలి .దీన్ని న్యాయబద్ధంగా ఇండియన్లు తిరస్కరించారు .ఇది పూర్తిగా కేప్ టౌన్ అగ్రిమెంట్ కు పూర్తీ విరుద్ధమ అన్యాయం అని గగ్గోలు పెట్టారు మనవాళ్ళు .ఇక్కడిప్రభుతంమన  బ్రిటిష ప్రభుత్వం అనేక సంప్రదింపులు జరిపాక ఆ బిల్లును ఇండియానుంచి వచ్చే ప్రతినిధి వర్గంతో చర్చించేదాకా బిల్లు వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం చెప్పి కొంత ఊరట కలిగించింది .ప్రతి అయిదేళ్లకు ఆ అగ్రిమెంట్ రెన్యు చేయాలి ,రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ జరపాలి .ఇందులో ట్రాన్స్ వాల్ సమస్యకూడాచర్చకు రావాలి .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-23-ఉయ్యూరు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.